తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Signs Of Diabetes । ముఖంపై వెంట్రుకలు రావడం డయాబెటీస్ లక్షణమే, ఈ సంకేతాలు గమనించారా?

Signs of Diabetes । ముఖంపై వెంట్రుకలు రావడం డయాబెటీస్ లక్షణమే, ఈ సంకేతాలు గమనించారా?

HT Telugu Desk HT Telugu

01 July 2023, 9:30 IST

    • Signs of Diabetes: గుండె దడగా అనిపించడం, చెమటలు పట్టడం, కళ్లు తిరగడం, విపరీతమైన ఆకలిదప్పికలు ఇవన్నీ మీ రక్తంలో గ్లూకోజ్ పెరిగినపుడు అనిపించవచ్చు. మధుమేహం లక్షణాలు చూడండి..
Signs of Diabetes
Signs of Diabetes (istock)

Signs of Diabetes

Signs of Diabetes: టైప్ 2 డయాబెటిస్ అనేది జీవక్రియ సంబంధిత వ్యాధి. మధుమేహం ఉన్న వ్యక్తులు తరచుగా వారి రక్తంలో చక్కెర స్థాయిలలో హెచ్చుతగ్గులను అనుభవిస్తారు, ఇది వారి శరీరాన్ని అనేక విధాలుగా ప్రభావితం చేస్తుంది. శరీరం ఇన్సులిన్‌ను సరిగ్గా ఉపయోగించలేనప్పుడు ఇది రక్తంలో గ్లూకోజ్ స్థాయిలలో అసమతుల్యతకు దారితీస్తుంది. అధిక రక్త చక్కెర స్థాయిలు అలాగే కొనసాగితే అది కొంత కాలానికి మూత్రపిండాలు, గుండె, ఇతర అంతర్గత ప్రక్రియలకు హాని కలిగిస్తుంది. మరోవైపు, టైప్ 1 మధుమేహం అంటే ప్యాంక్రియాస్ ఇన్సులిన్‌ను సృష్టించడం ఆపివేసినప్పుడు , రక్తంలో చక్కెరను నిర్వహించడానికి శరీరానికి సొంతంగా ఇన్స్సులిన్ ఉత్పత్తి చేసే సామర్థ్యం అసలే ఉండదు. ఈ స్థితిలో బయట నుంచి హార్మోన్‌ను తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.

ట్రెండింగ్ వార్తలు

Oats Egg Omelette : ఓట్స్ ఎగ్ ఆమ్లెట్.. మీ అల్పాహారాన్ని ఆరోగ్యకరంగా మార్చగలదు

Tuesday Motivation : పెళ్లి జీవితంలో చాలా ముఖ్యమైనది.. కానీ ముందుగా ఈ విషయాలు చెక్ చేసుకోండి

Night Shift Effect : ఎక్కువగా నైట్ షిఫ్ట్‌లో పని చేస్తే ఈ సమస్య.. పాటించాల్సిన చిట్కాలు

Chia Seeds Benefits : చియా విత్తనాల ప్రయోజనాలు తెలుసుకోండి.. ఒక్క రోజులో ఎన్ని తివవచ్చు?

రక్తంలో చక్కెర పెరిగినప్పుడు లేదా తగ్గినప్పుడు, మన శరీరంలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగినపుడు, ఆ వ్యక్తి అనేక గ్లాసుల నీటిని తాగిన తర్వాత కూడా చాలా దాహాన్ని అనుభూతి చెందుతాడు, తరచుగా మూత్ర విసర్జన చేయవలసి ఉంటుంది. రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉండటం వల్ల ఒకరికి అస్పష్టమైన దృష్టి లేదా చర్మ వ్యాధులు కూడా రావచ్చు. గ్లూకోజ్ స్థాయిలు క్రాష్ అయినప్పుడు, వేగంగా గుండె కొట్టుకోవడం, చెమటలు పట్టడం, కళ్లు తిరగడం లేదా విపరీతమైన ఆకలిగా అనిపించవచ్చు.

ఫ్రెంచ్ బయోకెమిస్ట్ జెస్సీ ఇంచాస్పే, డయాబెటిస్ ఉన్నవారిలో రక్తంలో చక్కెర పెరుగుదల ఉన్నప్పుడు కనిపించే ఆశ్చర్యకరమైన లక్షణాలను పంచుకున్నారు.

1. మెదడులో గందరగోళం

మీరు మీ ఆలోచనలను ట్రాక్ చేయలేకపోతున్నారని లేదా దేనిపైనా దృష్టి పెట్టలేకపోతున్నారని ఎప్పుడైనా అనిపించిందా? మీ రక్తంలో చక్కెర స్థాయిలు మీ మెదడు పనితీరును మందగించడానికి దారితీయవచ్చు. బ్లడ్ గ్లూకోజ్ హెచ్చుతగ్గులు జరిగినప్పుడు, మెదడులోని న్యూరాన్‌ల మధ్య సిగ్నల్‌లలో వేగం మందగించవచ్చు. ఇది మెదడు స్థితిని అయోమయానికి గురిచేస్తుంది.

2. ఆడవారిలో జుట్టు రాలడం

మీ బ్లడ్ స్ట్రీమ్‌లో బ్లడ్ షుగర్ ఎక్కువగా ఉండటం వల్ల అది మీ జుట్టు ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేయవచ్చు. ముఖ్యంగా ఆడవారిలో అధిక గ్లూకోజ్ స్థాయిలు వారి శరీరంలో అధిక టెస్టోస్టెరాన్ (పురుష సెక్స్ హార్మోన్) ఉత్పత్తికి కారణమవుతాయి. ఫలితంగా ఇది వారి తలపై వెంట్రుకలు రాలిపోవడానికి, బట్టతలకి దారితీస్తుంది. మరోవైపు ముఖంపై వెంట్రుకల పెరుగుదల కనిపిస్తుంది.

3. గుండె దడగా అనిపించడం

రాత్రి సమయంలో ఒక గ్లూకోజ్ క్రాష్ అయినపుడు అంటే రాత్రి భోజనం తర్వాత రక్తంలో గ్లూకోజ్ స్పైక్ ఎక్కువైనపుడు దాని ప్రభావం ఉదయం లేచినపుడు కనిపిస్తుంది. మేల్కొన్న తర్వాత తీవ్రమైన చెమట, వికారంగా, గుండె దడదడగా ఉంటుంది. ఉదయం ఈ పరిస్థితి రాకుండా నివారించడానికి రాత్రివేళ తక్కువ GI కలిగిన ఆరోగ్యకరమైన భోజనం తినడానికి ప్రయత్నించండి.

4. తామర

గ్లూకోజ్ స్పైక్‌లు శరీరంలో మంటను పెంచుతాయి. మీరు తామర వంటి చర్మ సమస్యలను కలిగిస్తుంది. మీకు ఇదివరకే చర్మ సమస్యలు ఉంటే పెరిగిన గ్లూకోజ్ స్థాయిలు ఆ పరిస్థితిని మరింత దిగజార్చవచ్చు.

5. స్థిరమైన ఆకలి

మీరు ఎల్లప్పుడూ ఆహారం కోసం ఆరాటపడుతుంటే, ఇది రక్తంలో అసమతుల్య చక్కెర స్థాయిలకు సంకేతం. గ్లూకోజ్ స్పైక్‌లు, అదనపు ఇన్సులిన్ మన ఆకలి హార్మోన్లను గందరగోళానికి గురి చేస్తాయి. ఈ కారణంగా నిరంతరం మనకు ఆకలి దప్పికలను కలిగిస్తుంది.

తదుపరి వ్యాసం