ఈ యాప్‌ల సహాయంతో ఉచితంగా రెజ్యూమ్ తయారు చేసుకోండి
28 February 2022, 14:43 IST
- ప్రస్తుత పోటి ప్రపంచంలో కలల కొలువును సాధించాలంటే అవసరమయ్యే మొదటి డాక్యుమెంట్ రెజ్యూమె. రిక్రూటర్లకు అభ్యర్థిని పరిచయం చేసే మెుదటి అంశం ఇదే! ఉద్యోగ సాధనలో ఫస్ట్ గేట్‌వే రెజ్యూమె. ఇది అభ్యర్థుల ముఖచిత్రంగా చెప్పొచ్చు. అలాంటి ముఖ్య సాధనాన్ని పకడ్బందీగా రూపొందించుకుని ఉద్యోగ ప్రయాత్నాలు మెుదలుపెట్టాలి.
Resume
జాబ్ మార్కెట్‌లో విస్తృత మార్పులు చోటుచేసుకున్నాయి. ప్రతి రంగం మార్పులకు అహ్వానం పలుకుతున్నాయి. అలానే తమ సంస్థను పోటీతత్వ ప్రపంచం అత్యున్నత స్థాయిలో నిలపాలంటే సృజనాత్మకత ఉన్న ఉద్యోగులు అవసరం. అలాంటి అభ్యర్థులకే సంస్థలు రెడ్ కార్పెట్ వేస్తున్నాయి. ఉద్యోగ సాధన మెుదలుపెట్టే అభ్యర్థులు నైపుణ్యాలు ఉంటనే రాణిస్తారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో కలల కొలువును సాధించాలంటే విద్యార్థులకు అవసరమయ్యే మొదటి డాక్యుమెంట్ రెజ్యూమె. రిక్రూటర్లకు అభ్యర్థిని పరిచయం చేసే మెుదటి అంశం ఇదే! ఉద్యోగ సాధనలో ఫస్ట్ గేట్‌వే రెజ్యూమె. ఇది అభ్యర్థుల ముఖచిత్రంగా చెప్పొచ్చు. తమ నైపుణ్యాలను సంస్థలకు ప్రదర్శించగలిగే సాధనమిది. అలాంటి ముఖ్య సాధనాన్ని పకడ్బందీగా రూపొందించుకుని ఉద్యోగ ప్రయాత్నాలు మెుదలుపెట్టాలి.
నైపుణ్యాలు, అనుభవం, ఇతర వివరాలను క్రమపద్ధతిలో కూర్చి అర్ధవంతంగా రెజ్యూమె తయారు చేసుకోవడం చాలా ముఖ్యం. ప్రస్తుత డిజిటల్ ప్రపంచంలో ఉచితంగా ఈ పని చేసిపెట్టే వెబ్‌సైట్లు,యాప్‌లు చాలానే ఉన్నాయి. మెరుగ్గా కనిపించే విధంగా ఆటోమేటిక్ రెజ్యూమె బిల్డర్‌ల సాయం తీసుకోవచ్చు. మంచి టెంప్లేట్ ఎంచుకొని మన వివరాలు ఇవ్వడం ద్వారా రెజ్యుమె సిద్ధమవుతుంది.మరీ అలాంటి ఆన్‌లైన్ రెజ్యూమె మేకర్లు ఏమిటో ఓసారి చూద్దామా:
RESUME.COM
స్టైలీష్‌గా.. రిక్రూటర్లను ఆకట్టుకునే విధంగా రెజ్యూమెలు తయారు చేయాలనుకునే వారికి రెజ్యూమె.కామ్ (Resume.com) మంచి ఆప్షన్. ఇందులో 20కిపైగా రెజ్యూమె టెంప్లేట్స్ అందుబాటులో ఉన్నాయి. మంచి ప్రొఫెషనల్ రెజ్యూమె తయారు చేసుకోవడానికి ఈ టెంప్లేట్స్ చక్కగా ఉపయోగపడతాయి. ముందుగా టెంప్లేట్స్ అణుగుణంగా వివరాలను అందించాలి. తర్వాత వాటిని మేకర్ స్వీకరించి, నిర్దేశిత ఫీల్డ్స్‌లో వాటిని ఉంచుతుంది. ఈ టెంప్లేట్స్‌లో ముఖ్యమైన అంశాలు (సమ్మరీ, జాబ్ హిస్టరీ, విద్యార్హతలు, నైపుణ్యాలు, భాషలు) అధారంగా రెజ్యూమె రూపొందించబడుతుంది. అలానే రెజ్యూమె సెక్షన్లను మీకు కావలసిన విధాంగా సర్దుబాటు చేసుకొవచ్చు. మీకు ప్రివ్యూ నచ్చితే ఆ రెజ్యూమెను DOCX, RTF, PDF ఫార్మాట్లలో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
CANVA
మెరుగైనా రెజ్యూమె ఫార్మెట్ కోసం కాన్వా (Canva) వెబ్‌సైట్ మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. https://www.canva.com/create/resumes/తో రెజ్యూమె పేజీని ఓపెన్ చేసి మీకు కావాల్సిన టెంప్లేట్స్ ఎంచుకోవాలి. ప్రొఫెషనల్, ఇన్ఫోగ్రాఫిక్, ఫొటో, కార్పొరేట్‌లోని నచ్చిన ఫార్మెట్‌ను ఎంచుకుని రెజ్యూమెలను కూడా రూపొందించుకోవచ్చు. ఫ్రీగా చాలా ఫీచర్లు అందుబాటులో ఉంటాయి. భిన్నమైన ఫాంట్లు, టెక్స్ట్ సైజ్ లాంటి ఆప్షన్స్‌ను ఉచితంగా పొందవచ్చు. రెజ్యూమె బ్యాక్‌గ్రౌండ్ కలర్ మార్పులు, స్టైలిష్ గ్రిడ్, ఫ్రేమ్స్ వంటి అదనపు ఆప్షన్స్ ఉపయోగించుకోవచ్చు. ఈ గ్రాఫిక్ డిజైన్ టూల్ వెబ్‌సైట్‌తో అన్ని గ్రాఫిక్ డిజైన్‌లను తయారుచేసుకోవచ్చు. ఫేస్‌బుక్ కవర్లు, ఇన్ఫోగ్రాఫిక్స్, బ్రోషర్లు, బిజినెస్ కార్డులు, పోస్టర్లు, లోగోలు, ఫ్లయర్స్ వంటివి రూపొందించుకోవచ్చు.
రెజ్యూమ్ బిల్డర్
రెజ్యూమ్ బిల్డర్ & సివి మేకర్ యాప్ మెరుగైన రెజ్యూమ్‌ను రూపొందించడంలో మీకు బాగా సహాయపడుతుంది. ఈ యాప్ ద్వారా ప్రొఫెషనల్ రెజ్యూమ్‌ని సిద్ధం చేసుకోవచ్చు. ఇది రిక్రూటర్‌లను ఆకర్షించే విధంగా సూపర్ ఫార్మట్‌లో రెజ్యూమ్‌ను బిల్డ్ చేస్తుంది. రెజ్యూమ్,కవర్ లెటర్‌కు సంబంధించిన అనేక విభిన్న డిజైన్‌ల టెంప్లేట్లు కనిపిస్తాయి. అందులో మీ సమాచారాన్ని ఇస్తే చాలు. ఇందులో అనేక ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి, వీటి సహాయంతో మీరు Word ఫైల్, PDF ఫైల్‌లలో రెజ్యూమ్‌ను సులభంగా దిగుమతి చేసుకోవచ్చు. ప్రొఫెషనల్ రెజ్యూమ్‌ను సిద్ధం చేయవచ్చు. రెజ్యూమ్‌లో పొరపాట్లను సవరించుకునే వెసులుబాటు కూడా ఉంది. మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు రెజ్యూమ్‌లో కూడా మీ సౌకర్యాన్ని బట్టి మార్పులు చేసుకోవచ్చు. మీకు లింక్డ్‌ఇన్‌లో ప్రొఫైల్ ఉంటే, అక్కడ నుండి డేటాను దిగుమతి చేసుకోని రెజ్యూమ్‌ని క్రియేట్ చేసుకోవచ్చు.
ఈ యాప్‌ను ఉచితంగా.. గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు
సివి మేకర్
మీరు స్మార్ట్ రెజ్యూమ్‌ని ఉచితంగా తయారు చేసుకోవాలనుకుంటే. CV Maker యాప్ మీకు బాగా ఉపయోగపడుతుంది. ఇందులో రెజ్యూమ్‌కి సంబంధించిన 50కి పైగా టెంప్లేట్లు అందుబాటులో ఉన్నాయి. 15 రకాల కలర్స్‌లో రెజ్యూమ్‌లను రూపొందించవచ్చు. దాదాపు 500 కంటే ఎక్కువ రెజ్యూమ్ డిజైన్‌లను కలిగి ఉంది. కావాల్పిన ఫార్మట్‌లో రెజ్యూమ్‌లను సిద్ధం చేసుకోవచ్చు. స్టెప్ బై స్టెప్ ఇచ్చిన సూచనల అధారంగా PDF వెర్షన్‌లో CVని సిద్ధం చేయవచ్చు. ఇక్కడ ప్రొఫెషనల్ రెజ్యూమ్‌కి సంబంధించిన అనేక టెంప్లేట్‌లు కూడా కనిపిస్తాయి. అలాగే రెజ్యూమ్‌లను సులభంగా ఎడిట్ చేయవచ్చు. దీంతో పాటు అడ్వాన్స్‌డ్ రెజ్యూమ్ మేనేజర్, కవర్ లెటర్ తదితర ఫీచర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ యాప్ కూడా ఉచితం. దీన్ని గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.