తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Summer Foods | వేసవిలో ఈ 6 పదార్థాలు తీసుకుంటే చెమట, శరీర దుర్వాసన తగ్గుతుంది!

Summer Foods | వేసవిలో ఈ 6 పదార్థాలు తీసుకుంటే చెమట, శరీర దుర్వాసన తగ్గుతుంది!

HT Telugu Desk HT Telugu

24 March 2022, 15:24 IST

google News
    • వేసవిలో చెమట, శరీర దుర్వాసన, బట్టలపై ఉప్పుతేలడం, ఎలర్జీ లాంటి సమస్యలు తలెత్తుతాయి. తినే ఆహారంలో ఇవి చేర్చుకుంటే ఈ సమస్యను నివారించవచ్చు…
Sweat (representative image)
Sweat (representative image) (iStock)

Sweat (representative image)

వేసవి ప్రారంభమైపోయింది. ఇంతకాలం చలికాలాన్ని చల్లగా ఎంజాయ్ చేసిన ప్రజలు ఇప్పుడు ఉక్కపోతతో అల్లాడిపోతున్నారు. మార్చి నుంచే చెమటోడుస్తున్నారు. అదనంగా ఈ చెమటతో దుర్వాసన, బట్టలపై ఉప్పుతేలడం, ఎలర్జీ లాంటి సమస్యలు తలెత్తుతాయి. అయితే ఎండాకాలంలో కొన్ని ఆహార పదార్థాలతో ఈ సమస్య మరింత ఎక్కువ అవుతాయి. ఈ కాలంలోనే మామిడిపండ్లు వస్తాయి, అవి కూడా శరీరానికి వేడి చేసేవే.

అయితే చెమటను తగ్గించి అలాగే శరీర దుర్వాసనను నివారించే ఆహార పదార్థాల న్యూట్రిషనిస్టులు సూచిస్తున్నారు. 

అలాగే కొంతమందికి 'హైపర్‌హైడ్రోసిస్' సమస్య ఉంటుంది. అంటే వీరిలో సాధారణం కంటే ఎక్కువగా చెమటపడుతుంది. అలాంటి వారు రోజుకి కనీసం రెండు సార్లు స్నానం చేయాలి. కెఫిన్, ఆల్కహాలిక్ పానీయాలకు దూరంగా ఉండాలి. ఈ పదార్థాలు నాడీ వ్యవస్థను ఉత్తేజపరుస్తాయి. దీంతో శరీరం అధికంగా ప్రతిస్పందించి ఎక్కువగా చెమటను ఉత్పత్తి చేస్తుంది.

చెమటను తగ్గించి, శరీర దుర్వాసను నివారించే పదార్థాలు:

1. నీరు- కార్బొనేటెడ్ కాని పానీయాలు

తగినంత మొత్తంలో నీరు త్రాగడం వల్ల మీ శరీరాన్ని చల్లగా ఉంచుతుంది. చెమట సాంద్రతను తగ్గిస్తుంది. డీహైడ్రేషన్ నుండి మిమ్మల్ని కాపాడుతుంది. కాబట్టి నీరు, మజ్జిగ, షర్బత్ ఇతర నాన్ కోర్బోనేటెడ్ పానీయాలు ఎక్కువగా తీసుకోవాలి.

అలాగే ఎండాకాలంలో వేడి వేడి టీ, కాఫీలు మరింత చేటు చేస్తాయి. కానీ గ్రీన్ టీలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. నాడీ వ్యవస్థను శాంతపరిచే ప్రభావాన్ని కలిగి ఉంటుంది. అలాగే వేడి తగ్గించి చెమటను అదుపులో ఉంచడంలో తోడ్పడుతుంది.

2.మెగ్నీషియం అధికంగా ఉండే ఆహారాలు

శరీరంలో మెగ్నీషియం లోపం కారణంగా చెమట ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. కాబట్టి మెగ్నీషియం అధికంగా ఉండే బాదం, పాలకూర సోయా, అరటిపండ్లు వంటి ఆహారాలు తీసుకోవాలి. మెగ్నీషియం జీవక్రియను పెంచుతుంది, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

3. అధిక ఫైబర్ ఉన్న ఆహారాలు

ఓట్స్ , తృణధాన్యాలు వంటి ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలు జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడతాయి. మెరుగైన జీర్ణక్రియ శరీర ఉష్ణోగ్రతను అదుపులో ఉంచుతుంది తద్వారా చెమటను తగ్గిస్తుంది.

4. అధిక కాల్షియం ఉన్న ఆహారాలు

 కాల్షియం శరీరంలో వేడిని తగ్గించి, చెమటను అదుపులో ఉంచే ఒక మినరల్. కాబట్టి కాల్షియం లభించే గుడ్లు, మీగడలేని పాలను పెరుగు ఇతర డెయిరీ ఉత్పత్తులను తీసుకోవచ్చు. అయితే అందులో కొవ్వుశాతం తక్కువగా ఉండేలా చూసుకోవాలి.

ఇక వంటలకు ఇతర నూనెలకు బదులుగా ఆలివ్ నూనెను ఉపయోగించడం వల్ల జీవక్రియ, జీర్ణక్రియలు పెరుగుతాయి. ఆలివ్ నూనెలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో వేడిని నివారిస్తుంది, చెమటను నియంత్రిస్తుంది.

5. సిట్రస్ జాతి పండ్లు

యాపిల్స్, ద్రాక్ష, పుచ్చకాయలు, పైనాపిల్స్ , నారింజ వంటి అధిక నీటి కంటెంట్ ఉన్న పండ్లు తీసుకుంటే చెమట తక్కువగా పడుతుంది. అంతేకాకుండా నారింజ, నిమ్మకాయలు, పైనాపిల్స్ వంటి సిట్రస్ పండ్ల సహజమైన సువాసనలను శరీరం శోషించుకుంటుంది. దీంతో చర్మం తాజాగా ఉంటుంది, దుర్వాసన రాదు.

6. కూరగాయలు

ఆహారంలో దోసకాయలు, పాలకూర, ఎర్ర క్యాబేజీ, పువ్వుగోబి, వంకాయ వంటి కూరగాయలను చేర్చుకోవాలి. వీటిలో నీరు సమృద్ధిగా ఉంటుంది. శరీరంలో వేడిని తగ్గిస్తాయి. చెమటను నియంత్రించడంలో సహాయపడతాయి.

 

తదుపరి వ్యాసం