తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Food For Reduce Stress: ఒత్తిడి తగ్గించే శక్తి ఈ ఆహారాలకే ఎక్కువ, రోజూ తినండి

Food for Reduce stress: ఒత్తిడి తగ్గించే శక్తి ఈ ఆహారాలకే ఎక్కువ, రోజూ తినండి

Haritha Chappa HT Telugu

10 January 2024, 10:00 IST

google News
    • మీ మెదడు ఆరోగ్యాన్ని పెంచుతూ, ఒత్తిడిని తగ్గించే ఆహారాలను ప్రతిరోజూ తినాల్సిన అవసరం ఉంది.
ఒత్తిడి తగ్గాలంటే ఏం తినాలి?
ఒత్తిడి తగ్గాలంటే ఏం తినాలి? (pixabay)

ఒత్తిడి తగ్గాలంటే ఏం తినాలి?

Food for Reduce stress: ఆధునిక జీవితంలో ఎంతో మంది తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు. ఒక పక్క ఉద్యోగ సమస్యలు, మరొక పక్క ఆర్ధిక ఇబ్బందులు, కుటుంబ బాధ్యతలు… ఇవన్నీ కూడా మనిషిలో తీవ్ర ఒత్తిడికి కారనమవుతున్నాయి. ముఖ్యంగా సెలవులు తీసుకుని తిరిగి ఉద్యోగ జీవితాన్ని మొదలుపెట్టినప్పుడు ఎంతో మంది ఉద్యోగులు తీవ్ర ఒత్తిడికి గురవుతూ ఉంటారు. సెలవుల్లో, పండుగల సమయంలో అధిక చక్కెర, ఉప్పులు కలిపిన ఆహారాన్ని అధికంగా తింటారు. దీని వల్ల కూడా ఒత్తిడి స్థాయిలు పెరుగుతూ ఉంటాయి. పరిశోధన ప్రకారం ఒత్తిడిని తట్టుకోవడానికి మన శరీరానికి మెగ్నీషియం, జింక్, కాల్షియం, ఐరన్, నియాసిన్ నిండి ఉన్న ఆహారాలని తినాలి. అనారోగ్యకరమైన ఆహారాలు తిన్నప్పుడు పొట్టలోని మంచి బ్యాక్టిరియా ప్రభావితం అవుతుంది. ఇది మన మానసిక స్థితిపై ప్రభావం చూపిస్తుంది. దీని వల్ల ఒత్తిడి కలిగే అవకాశం ఉంది.

అధిక ఒత్తిడి లక్షణాలు

జీర్ణ సమస్యలు, బరువు పెరగడం, అధిక రక్తపోటు వంటివి అధిక ఒత్తిడికి కారణం అవుతాయి. ఒత్తిడిగా అనిపించినప్పుడు జీర్ణ సమస్యలు వస్తాయి. జీర్ణక్రియ సక్రమంగా జరగదు. పొట్ట ఉబ్బరంగా అనిపిస్తుంది. ఒత్తిడి వల్ల బరువు త్వరగా పెరిగిపోతారు. అధిక ఒత్తిడి హార్మోన్ల వల్ల శరీరంలో కొవ్వు పేరుకుపోతుంది. హఠాత్తుగా బరువు పెరిగితే అది ఒత్తిడి వల్లనేమో అని అర్థం చేసుకోవాలి. రక్తపోటు పెరిగడం కూడా అధిక ఒత్తిడికి కారణం అవుతాయి. అధిక ఒత్తిడి వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు కూడా పెరుగుతాయి. ఒత్తిడిని తగ్గించడానికి కొన్ని రకాల ఆహారాలు ప్రతి రోజూ తినాలి.

ఒత్తిడిని జయించే ఆహారాలు

1. బీట్రూట్

బీట్రూట్లలో నైట్రిక్ ఆక్సైడ్ అధికంగా ఉంటుంది, ఇది రక్త ప్రవాహానికి సహాయపడుతుంది. ఇది రక్తపోటును నియంత్రిస్తుంది. బ్రీట్రూట్లతో ఎన్నో రకాల వంటలను చేసుకోవచ్చు. కూరలు, వేపుళ్లు, బీట్రూట్ రైస్, పచ్చడి ఇలాంటివి తరచూ తినడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది.

2. బ్లూబెర్రీస్

అద్భుతమైన ఆహారం బెర్రీలు. ఇవి ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించి, మెదడు పనితీరును పెంచుతాయి. మానసిక స్థితి దిగజారకుండా కాపాడతాయి. దీన్ని స్మూతీలు, ఓట్ మీల్‌ వంటి వాటిలో కలుపుకుని తింటే మంచిది

3. అవోకాడో

మోనోశాచురేటెడ్ కొవ్వులతో అవకాడో పండ్లు నిండి ఉంటాయి. ఇది మెదడు ఆరోగ్యానికి సహాయపడుతుంది. ఒత్తిడి హార్మోన్లను నియంత్రించడంలో ముందుంటుంది. రక్తపోటులో హెచ్చుతగ్గులు రాకుండా కాపాడుతుంది. ఒత్తిడిని తగ్గిస్తుంది.

4. దానిమ్మ

శరీరంలో ఒత్తిడిగా అనిపించినప్పుడు ఆక్సీకరణ నష్టం ఏర్పడుతుంది. అలా జరగకుండా కాపాడే శక్తి దానిమ్మకు ఉంది. దానిమ్మలో యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. దానిమ్మ జ్యూస్ ను రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల యాంటీ డిప్రెసెంట్ లా పనిచేస్తుంది. దీన్ని పెరుగు, సలాడ్ లో కలుపుకుని తింటే మంచిది.

టాపిక్

తదుపరి వ్యాసం