తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Saree Tips: పట్టు చీర కట్టు అద్దినట్లు రావాలంటే ఈ టిప్స్ తెల్సుకోండి

Saree Tips: పట్టు చీర కట్టు అద్దినట్లు రావాలంటే ఈ టిప్స్ తెల్సుకోండి

06 October 2024, 19:00 IST

google News
  • Saree Tips: పండగకు పట్టు చీర కట్టుకుంటున్నారా? అయితే ఉబ్బుగా కాకుండా అద్దినట్లు చీరకట్టు ఉండాలంటే ఈ చిట్కాలు తెల్సుకోండి. చీరకట్టులో మెరిసిపోతారు.

చీరకట్టు
చీరకట్టు (instagram)

చీరకట్టు

దసరా, సద్దుల బతుకమ్మ పండగలు దగ్గరికి వచ్చేశాయ్. ఈ పండగలకు దాదాపు మహిళలంతా హెవీ పట్టు చీరల్నే ఎంచుకుంటారు. బనారస్ పట్టుచీరలు ఎంచుకుంటే కచ్చితంగా కొన్ని చిట్కాలు పాటించండి. దీంతో చీర స్టిఫ్ గా ఉంటుంది. కుచ్చులన్నీ అద్దినట్లు ఆకర్షణీయంగా కనిపిస్తాయి. మీ లుక్ మొత్తం మరింత అందంగా కనిపిస్తుంది. ఈ ప్రత్యేక చిట్కాలు గుర్తుంచుకోండి. 

చీరకట్టు మెలకువలు:

పెటికోట్:

చీరకోసం ఎంచుకునే పెటికోట్ చీరకట్టు లుక్ పూర్తిగా మార్చేస్తుంది. దానికోసం ఇప్పుడు షేప్ వియర్ పెటికోట్స్ దొరుకుతున్నాయి. ఇవి శరీరానికి హత్తుకున్నట్లు ఉంటాయి. దాంతో చీర కట్టు బాగొస్తుంది. మామూలుగా పట్టు చీరలు కట్టుకున్నప్పుడు ఉబ్బుగా రాకుండా అంటిపెట్టుకుని ఉండేలా చూస్తాయివి. అలాగే వీటిలో సన్నగానూ కనిపిస్తారు. 

ఎత్తు:

పట్టు చీరలు స్టిఫ్ గా ఉంటాయి కాబట్టి చీర ఎత్తు సరిగ్గా చూసుకోవాలి. లేదంటే పొట్టిగా పైకి లేసినట్లు, లేదా భూమిని తాకుతాయి.అందుకోసం ముందుగానే మీరు వేసుకోబోయే చెప్పులకు తగ్గట్లు పొడవు చూసుకుంటే మంచిది. 

సారీ ఫోల్డింగ్:

ఆన్‌లైన్ సారీ ఫోల్డింగ్ గురించి అనేక వీడియోలు అందుబాటులో ఉంటున్నాయి. చీర కొంగు నుంచి మధ్యలో చెంగుల వరకు అన్నీ ముందుగానే సెట్ చేసి పెట్టుకునేలా మెలకువలు వీటినుంచి నేర్చుకోవచ్చు. దాంతో పండగ రోజు హడావుడి కాకుండా కేవలం పది నిమిషాలు చక్కని చీరకట్టుతో సిద్ధం అవ్వచ్చు. కనీసం చీర కొంగు అయినా ముందుగా సెట్ చేసుకుంటే సులభం అవుతుంది. 

స్ట్రెయిటనర్:

చీర కొంగు, మధ్యలో చెంగులు సెట్ చేయడానికి స్ట్రెయిటెనర్ వాడితే చీర లుక్ పర్ఫెక్ట్ గా వస్తుంది. స్ట్రెయిటనర్ లేకపోతే ఐరన్ బాక్స్ అయినా వాడొచ్చు. ప్రత్యేకంగా కనిపించాలంటే కాస్త కష్టపడాల్సిందే మరి. ఐరన్ చేసిన కొంగులు చెక్కు చెదరకుండా ఎంత సేపైనా అలాగే ఉంటాయి. 

కుచ్చుల వెడల్పు:

చీర రకాన్ని బట్టి కుచ్చుల వెడల్పు మార్చాలి. బనారస్ చీరలకు బార్డర్ అందం తెస్తుంది. కాబట్టి వీలైతే సింగిల్ పల్లు పెట్టితే మంచి లుక్ ఉంటుంది. లేదంటే బార్డర్ కనిపించేలా కాస్త పెద్ద కుచ్చులు పెట్టుకుంటే చీర అందం, పనితనం బాగా తెలుస్తుంది. 

 

 

 

 

 

తదుపరి వ్యాసం