తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Pregnancy Tips: ప్రెగ్నెన్సీ సమయంలో చర్మం కోసం తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలు.. నిర్లక్ష్యం చేయొద్దు!

Pregnancy Tips: ప్రెగ్నెన్సీ సమయంలో చర్మం కోసం తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలు.. నిర్లక్ష్యం చేయొద్దు!

04 November 2024, 18:30 IST

google News
    • Beauty Tips for Pregnancy: ప్రెగ్నెన్సీ సమయంలో చర్మ సమస్యలు ఎక్కువగా ఎదురవుతుంటాయి. అయితే, కొన్ని జాగ్రత్తలు పాటిస్తే అప్పుడు కూడా చర్మం మెరుగ్గా ఉంటుంది. ఆ ముఖ్యమైన టిప్స్ ఏవో ఇక్కడ చూడండి.
Pregnancy Tips: ప్రెగ్నెన్సీ సమయంలో చర్మం కోసం తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలు
Pregnancy Tips: ప్రెగ్నెన్సీ సమయంలో చర్మం కోసం తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలు

Pregnancy Tips: ప్రెగ్నెన్సీ సమయంలో చర్మం కోసం తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలు

గర్భం దాల్చాక మహిళల శరీరంలో చాలా మార్పులు కనిపిస్తాయి. ప్రెగ్నెన్సీ సమయంలో కొందరిలో మానసికంగానూ ఒత్తిడిగా అనిపిస్తుంది. ఇవన్నీ హార్మోన్లలో మార్పు వల్ల కలుగుతుంటాయి. గర్భధారణ సమయంలో మహిళల చర్మం మెరుపు కూడా తగ్గుతుంది. మొటిమలు, మచ్చలు, చర్మం పొడిబారడం లాంటి సమస్యలు ఎదురవుతాయి. అయితే, ప్రెగ్నెన్సీ సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే చర్మపు ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. అందం చెక్కుచెదరకుండా ఉంటుంది.

మాయిశ్చరైజ్ చేసుకోవాలి

ఉదయాన్నే స్నానం చేసిన తర్వాత శరీరానికి మాయిశ్చరైజర్ పూసుకోవాలి. ప్రెగ్నెన్సీ సమయంలో చర్మం ఎక్కువగా పొడిబారే అవకాశం ఉంటుంది. దీనివల్ల మెరుపు తగ్గుతుంది. అందుకే మాయిశ్చరైజర్ రాసుకోవడం చాలా ముఖ్యం. చర్మం మృధువుగా ఉండేందుకు ఉదయంతో పాటు రాత్రి కూడా క్రీమ్ రాసుకోవచ్చు.

ముఖాన్ని శ్రద్ధగా వాష్ చేసుకోవాలి

శరీరంలో హర్మోన్ల మార్పుల వల్ల గర్భధారణ సమయంలో మెటిమలు ఎక్కువవుతాయి. అందుకే ఎల్లప్పుడూ ముఖం క్లీన్‍గా ఉండేలా వాష్ చేసుకోవాలి. శ్రద్ధగా శుభ్రం చేసుకోవాలి. ఆలివ్ ఆయిల్, కలబంద కలపిన మిశ్రమంతో కడుక్కుంటే ముఖంపై ఉన్న దుమ్ము, ఆయిల్ శుభ్రంగా తొలగిపోతాయి. చర్మపు మెరుపు పెరుగుతుంది.

సరిపడా నీరు

గర్భంతో ఉన్న సమయంలో తగినంత నీరు తాగడం చాలా ముఖ్యమైన విషయం. నీరు ఎక్కువగా తాగితే శరీరంలో వ్యర్థాలు సులువుగా బయటికి వెళ్లేందుకు ఉపకరిస్తుంది. దీనివల్ల చర్మానికి కూడా మేలు జరుగుతుంది. చర్మపు మెరుపు బాగుంటుంది.

ఎక్స్‌ఫోలియేట్ చేసుకోవాలి

చర్మాన్ని కచ్చితంగా ఎక్స్‌ఫోలియేట్ చేసుకోవాలి. దీనివల్ల డెడ్ స్సిన్ సెల్స్ తొలగిపోతాయి. కనీసం వారానికి ఓ సారి ఎక్స్‌ఫోలియేట్ చేయాలి. ఇందుకోసం చర్మాన్ని క్లీన్ చేసుకునేందుకు నేచురల్ స్క్రబ్ తయారు చేసుకొని వాడవచ్చు. డెడ్ స్కిన్ సెల్స్ తొలగిపోతే ముఖ్యం మెరుపుతో ఉంటుంది.

ఇంట్లో ఉన్నా సన్‍స్క్రీన్

ప్రెగ్నెన్సీ సమయంలో ఎక్కువ మంది ఇంట్లో ఉంటారు. అయితే, ఇంట్లోనే ఉన్నా శరీరానికి సన్‍స్క్రీన్ రాసుకోవడం ఉత్తమం. ఎస్‍పీఎఫ్ ఉండే సన్‍స్క్రీన్‍ను రాసుకోవాలి. అయితే, ప్రెగ్నెన్సీ సమయంలో వాసన లేని సన్‍స్క్రీన్‍ వాడాలి. జింగ్ ఆక్సైడ్ లాంటి మినరల్స్ ఉన్నవి ఎంపిక చేసుకోవాలి.

కూరగాయలు, పండ్లు ఎక్కువగా..

ప్రెగ్నెన్సీ సమయంలో మీ డైట్‍లో ఎక్కువగా పండ్లు, కూరగాయలు లాంటి పోషకాలు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. వీటివల్ల గర్భంలో బిడ్డతో పాటు మీ చర్మం కూడా డల్‍గా, అలసినట్టుగా కనిపించకుండా ఉంటుంది. తీసుకునే ఆహారం చర్మంపై నేరుగా ప్రభావం చూపిస్తుంది. అందుకే గర్భంతో ఉన్న సమయంలో తప్పకుండా పోషకాలు మెండుగా ఉన్న ఆహారం తీసుకోవడం చర్మానికి కూడా మేలు చేస్తుంది.

తదుపరి వ్యాసం