తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Pregnancy Care : ప్రెగ్నేన్సీ సమయంలో బాగా నిద్రపోవాలంటే.. వీటిని ఫాలో అయిపోండి..

Pregnancy Care : ప్రెగ్నేన్సీ సమయంలో బాగా నిద్రపోవాలంటే.. వీటిని ఫాలో అయిపోండి..

05 July 2022, 20:30 IST

    • గర్భం అనేది బాధ కలిగించే లక్షణాలను ఎక్కువగా కలిగి ఉంటుంది. శారీరక మార్పులతో పాటు.. నిద్ర, విశ్రాంతి వంటి మానసిక ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపిస్తుంది. ముఖ్యంగా సరైన నిద్రలేకపోతే.. నార్మల్ డెలివరీ అవకాశాలు తగ్గుతాయి అంటున్నారు నిపుణులు. అయితే గర్భిణీలు మంచిగా నిద్రపోవాలంటే ఈ చిట్కాలు ఫాలో అయిపోవాలని సూచిస్తున్నారు.
ప్రెగ్నేన్సీ సమయంలో బాగా నిద్రపోవాలంటే
ప్రెగ్నేన్సీ సమయంలో బాగా నిద్రపోవాలంటే

ప్రెగ్నేన్సీ సమయంలో బాగా నిద్రపోవాలంటే

Pregnancy Care : ఓ బిడ్డకు జన్మనివ్వడమనేది సాధారణమైన విషయం కాదు. ఆ సమయంలో స్త్రీ శరీరంలో జరిగే మార్పులు అన్ని ఇన్ని కాదు. ముఖ్యంగా మూడవ త్రైమాసికంలో చాలా ఇబ్బందులు ఎదురువుతాయి. ప్రత్యేకించి విశ్రాంతి, నిద్రలో ఆటంకాలు ఎదురవుతాయి. ఈ సమయంలో తల్లి, బిడ్డకు నిద్ర చాలా ముఖ్యమైనది. కానీ నిద్ర మాత్రం అంత సులువుగా రాదు. ఇలా తక్కువ నిద్రపోతే.. ఆరోగ్య సమస్యలు వస్తాయి. అయితే మూడవ త్రైమాసికంలో గర్భిణీలు మంచిగా నిద్రపోవడానికి కొన్ని చిట్కాలు సూచించారు గైనకాలజిస్ట్ డాక్టర్ హేమావతి. మీరు కూడా ఈ సమస్యతో ఇబ్బంది పడుతుంటే.. వీటిని ఫాలో అయిపోండి.

షెడ్యూల్ ఉండాలి

మంచి నిద్ర కోసం కచ్చితంగా ఓ షెడ్యూల్ ఉండాలి. దీని వలన మీ శరీరం ఒక నిర్దిష్ట సమయంలో నిద్రించేందుకు, సరైన విశ్రాంతి తీసుకోవడానికి మీకు సహాయపడుతుంది.

నైట్ రోటీన్ ఫాలో అవ్వాలి..

పడుకునే ముందు రొటీన్ ఫాలో అవ్వండి. గోరు వెచ్చని నీటితో స్నానం చేయండి. ఆపై మీరు కాస్త రిలాక్స్ అవ్వండి. పడుకునే ముందు ధ్యానం చేయండి.

హైడ్రేటెడ్‌గా ఉండాల్సిందే..

మీరు హైడ్రేటెడ్‌గా ఉండేలా చూసుకోవడానికి.. మీరు తీసుకునే నీటి పరిమాణం గురించి మీరు తెలుసుకోవాలి. నిద్రలో ఎక్కువసార్లు వాష్‌రూమ్‌కి వెళ్లకుండా ఉండాలంటే.. రాత్రులు కొంచెం నీటిని తీసుకోవడం తగ్గించండి. కార్బోనేటేడ్ డ్రింక్స్, కెఫిన్ పానీయాలు వంటి వాటికి దూరంగా ఉండండి.

హెల్తీ ఫుడ్ తీసుకోండి..

ఈ సమయంలో శరీరంలో చాలా మార్పులు వస్తాయి. ముఖ్యంగా తిన్న తర్వాత.. ఛాతీ మధ్యలో నొప్పి రావడం వంటివి గమనించవచ్చు. కాబట్టి మీరు ఏమి, ఎప్పుడు తింటున్నారో పర్యవేక్షించాలి. పైగా యాసిడ్ రిఫ్లక్స్‌ను తగ్గించడానికి.. గర్భిణీ స్త్రీలు భోజనం చేసిన తర్వాత వంగడం లేదా చదునుగా పడుకోవడం వంటివి మానుకోవాలి. వేడి సాస్, మసాలా, పొగాకు, ఆల్కహాల్‌కు దూరంగా ఉండాలి.

నో ఫోన్స్..

పడుకునేముందు ల్యాప్‌టాప్, ఫోన్‌ని నివారించండి. స్క్రీన్‌ల కాంతి కూడా నిద్ర నాణ్యతను ప్రభావితం చేస్తుంది కాబట్టి నిద్రించడానికి కనీసం గంట ముందు గాడ్జెట్‌లో ఉండటం మానుకోండి.

స్లీపింగ్ పొజీషన్

ఎడమవైపునకు తిరిగి పడుకోవడం వల్ల మంచి నిద్ర వస్తుందని ఇప్పటికే చాలా అధ్యయనాలు వెల్లడించాయి. ఎడమ వైపున తిరిగి పడుకోవడం వల్ల శరీరంలో రక్త ప్రసరణ బాగా జరుగుతుందని, అంతేకాకుండా అది పిండం అభివృద్ధిలో సహాయపడుతుందని వైద్యులు చెబుతున్నారు. వెనుకభాగంలో పడుకోవడం మానుకోవాలి. ఎందుకంటే ఆ స్థానం గర్భాశయంలోని రక్త ప్రవాహానికి ఆటంకం కలిగిస్తుంది. గర్భిణీ స్త్రీలు తరచుగా తుంటి నొప్పిని, నడుము నొప్పితో బాధపడుతుంటారు. ఆ సమయంలో కాళ్ల మధ్య దిండు పెట్టుకుని పడుకోవడం వల్ల నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు.

చురుకుగా ఉండాలి..

చురుకుగా ఉండటం వల్ల మీకు మంచి నిద్ర వస్తుంది. ఎందుకంటే ఇది రోజు చివరిలో మిమ్మల్ని కాస్త అలసటకు గురిచేసి.. మీరు బాగా నిద్రపోయేలా చేస్తుంది. రోజులో వ్యాయామం చేయడం లేదా యోగా సాధన చేయడం వల్ల మీరు నిద్రపోవడానికి మాత్రమే కాకుండా.. సుదీర్ఘమైన, ప్రశాంతమైన నిద్రను పొందుతారు.

రిలాక్స్‌డ్‌గా ఉండండి

చురుకుగా ఉండటం అవసరం. కానీ రిలాక్స్‌గా ఉండటం కూడా అంతే అవసరం. మీరు తీసుకునే ఒత్తిడిని తగ్గించుకోండి. యోగా, ధ్యానం వంటివి ప్రయత్నించండి. కొందరికి అరోమాథెరపీ కూడా బాగా పనిచేస్తుంది.

లైట్ డిన్నర్

రాత్రిపూట తేలికగా తినడం ఎవరికైనా మంచిదే. ఇది నిద్రవేళలో మీకు అసౌకర్యాన్ని కలిగించదు. ఇది జీర్ణక్రియను కూడా సులభతరం చేస్తుంది. నిద్రకు కనీసం రెండు గంటల ముందు రాత్రి భోజనం ముగించేయండి.

వైద్యుడిని సంప్రదించండి

అన్నింటిని ప్రయత్నించిన తర్వాత కూడా మీరు నిద్రలేమితో బాధపడుతుంటే.. మీ గైనకాలజిస్ట్ ని సంప్రదించండి. వారు మీకు కచ్చితంగా సహాయం చేస్తారు.

టాపిక్

తదుపరి వ్యాసం