తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Firoza: ఆభరణాల్లో అందమైన రాయి, ఈ రాయిని ఉంగరంగా మార్చి పెట్టుకోండి, ఎంతో ఆరోగ్యం ఆనందం

Firoza: ఆభరణాల్లో అందమైన రాయి, ఈ రాయిని ఉంగరంగా మార్చి పెట్టుకోండి, ఎంతో ఆరోగ్యం ఆనందం

Haritha Chappa HT Telugu

04 October 2024, 14:00 IST

google News
    • Firoza: రాళ్లూ రత్నాలు ధరించే వారు ఎంతోమంది. హిందూ మతంలో ఇలాంటి నమ్మకాలు ఎక్కువగా ఉంటాయి. అలాంటి రాళ్ళల్లో ఫిరోజా కూడా ఒకటి.
ఫిరోజా రాయి ఉపయోగాలు
ఫిరోజా రాయి ఉపయోగాలు (Indiamart)

ఫిరోజా రాయి ఉపయోగాలు

ఫిరోజా రత్నం అని పిలిచే ఈ రాయి ఎంతో ప్రాముఖ్యమైనది. దీన్ని చూడగానే ఎంతో అందంగా కనిపిస్తుంది. అందమైన నీలం రంగులో ఉన్న దీన్ని ఆభరణాల్లో భాగం అయిపోయింది. ఇప్పటికీ ఫిరోజా రాయితో తయారు చేసే ఆభరణాలు ఎన్నో ఉన్నాయి. అలాగే దీన్ని ఉంగరంలో అమర్చి వేలికి ధరిస్తే ప్రతికూల శక్తి తగ్గుతుందని నమ్ముతారు.

ఎవరైతే ఈ ఫిరోజా రాయిని ఉంగరంలో భాగంగా వేలికి ధరిస్తారో వారిపై ప్రతికూల శక్తి చాలా వరకు తగ్గిపోతుంది. ఆ ప్రతికూల శక్తిని ఈ ఫిరోజా రాయి తనలోకి ఇముడ్చుకుంటుందని చెబుతారు. ఆ రాయిని ధరించడం వల్ల ఇంకెన్నో ప్రయోజనాలు ఉన్నాయి.

ఈ ఫిరోజా రాయి టిబేట్, ఈజిప్ట్, అరిజోనా, మెక్సికో, టర్కీ, అమెరికాలోని కొన్ని ప్రదేశాల్లో కనిపిస్తుంది. ఇది ఒక అసాధారణమైన నీలిరంగులో ఉండే రాయి. అందుకే ఈ రత్నం ప్రత్యేకతను సంతరించుకుంది. కొన్ని రాళ్లు నీలి, ఆకుపచ్చ కలిపినా షేడ్‌లో కూడా ఉంటాయి. ఈ రాయి బృహస్పతి, కేతువులకు సంబంధించింది. బృహస్పతి ఒక శుభగ్రహం. ఇది వ్యక్తికి ఎంతో శుభాలను చేకూరుస్తుంది. కేతువు కొన్ని రకాల కష్టాలను ఇస్తూ ఉంటారు. కేతువును అశుభగ్రహంగా కూడా చెబుతారు. ఈ రెండు గ్రహాలకు ఫిరోజా రాయి చెందినదని చెప్పుకుంటారు.

ఆరోగ్య లాభాలు

ఫిరోజా రాయిని ధరించడం వల్ల శారీరక ఆరోగ్యం కూడా దక్కుతుంది. ఆ రాయి శరీరాన్ని తాకుతూ ఉంటే ఎంతో మేలు జరుగుతుంది. రోగనిరోధక శక్తి బలంగా మారుతుందని కూడా నమ్మేవారు ఉన్నారు. అలాగే నిద్రలేమి, మైగ్రేన్, ఊపిరితిత్తులు, గొంతు, శ్వాసకోశ వ్యవస్థ సమస్యలు, వైరల్ ఇన్ఫెక్షన్ బారిన పడుతున్న వారు కూడా ఈ ఫిరోజా రాయిని ధరించడం వల్ల ఆ సమస్యలు వచ్చే అవకాశం తగ్గుతాయని చెబుతారు.

మానసిక ఆరోగ్యంపై ప్రభావం

మానసిక ఆరోగ్యం కోసం ఈ ఫిరోజా రాయిని పెట్టుకోవాలని చెప్పేవారు ఉన్నారు. భయము, నిరాశ, ఆందోళన వంటివి మీ దరికి రాకుండా చేయడంలో ఇవి ముందుంటుంది. ఇది మీ కోల్పోయిన ఆత్మవిశ్వాసాన్ని తిరిగి తెస్తుంది.

సల్మాన్ ఖాన్ ధరించిన రాయి

సల్మాన్ ఖాన్ వంటి సెలబ్రిటీలు ఈ రాయిని ధరించిన వారే ఈ రాయిని ధరించడం వల్ల అది కీర్తి, అదృష్టాన్ని తెస్తుందని నమ్ముతారు. ఆర్థిక శ్రేయస్సును అందిస్తుందని, అప్పులు బారిన పడకుండా కాపాడుతుందని నమ్ముతారు.

చాలామందికి దిష్టి అంటే ఎంతో భయం. ఎదుటివారు దిష్టి పెడతారనుకుంటారు. అలాంటి దిష్టి నుండి కాపాడే శక్తి కూడా ఈ రాయికి ఉందని చెబుతారు. ఇది పెట్టుకున్న వ్యక్తి ఇతరుల అసూయ, చెడు ఆలోచనలు, ప్రతికూల శక్తులను ఇది గ్రహిస్తుంది. దీనివల్ల ఈ ఫిరోజా రత్నాన్ని ధరించిన వారికి అంతా మేలే జరుగుతుంది.

ఈ నీలిరత్నం ధరిస్తే సాహిత్యం, సంగీతం, కవిత్వం, రచన, ఫ్యాషన్, కళా... ఇలా ఏ రంగంలోనైనా రాణించే అవకాశం ఉంది. ఈ రాయి మీ జీవితంలో ఎదురయ్యే అంతరాయాలను తొలగిస్తుందని నమ్ముతారు. ఫిరోజా రాయిని ఒక శక్తివంతమైన ఆధ్యాత్మిక రత్నంగా భావిస్తారు. బృహస్పతి, కేతువుల కలయిక అద్భుతమైన ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఇస్తుందని కూడా నమ్ముతారు. ఫిరోజా రాయి బృహస్పతి చేతువులకు సంబంధించినదే.

తదుపరి వ్యాసం