తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Essential Fats For Weight Loss: ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే ఈ కొవ్వులు తీసుకోవాల్సిందే

Essential fats for weight loss: ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే ఈ కొవ్వులు తీసుకోవాల్సిందే

HT Telugu Desk HT Telugu

25 August 2023, 16:12 IST

google News
    • Essential fats for weight loss: ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే కొన్ని కొవ్వు పదార్థాలను కూడా తప్పక తీసుకోవాల్సిందే. అవేంటో ఇక్కడ తెలుసుకోండి.
ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే అవసరమైన కొవ్వులు (ప్రతీకాత్మక చిత్రం)
ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే అవసరమైన కొవ్వులు (ప్రతీకాత్మక చిత్రం)

ఆరోగ్యంగా బరువు తగ్గాలంటే అవసరమైన కొవ్వులు (ప్రతీకాత్మక చిత్రం)

ఈరోజుల్లో బరువు తగ్గడమనేది దాదాపు అందరీ గోల్ అయిపోయింది. దానికోసం జిమ్స్, యోగా, వాకింగ్ అంటూ వివిధ వ్యాయామాలు చేసేస్తున్నారు. ఫుడ్ విషయంలో కూడా కఠినమైన డైట్స్ ఫాలో అవుతున్నారు. కొవ్వు పదార్థాలను పూర్తిగా మానేస్తున్నారు. అయితే కొవ్వు కలిగిన కొన్ని పదార్థాలను కచ్చితంగా తీసుకోవాలంటున్నారు నిపుణులు.

ఆరోగ్యకరమైన విధానంలో బరువు తగ్గాలంటే మీరు తీసుకునే ఆహారంలో కచ్చితంగా కొవ్వులు ఉండాలంటున్నారు నిపుణులు. తక్కువ కొవ్వు, విటమిన్లు అధికంగా ఉండే పోషకమైన ఆహారాలు తీసుకోవాలంటున్నారు. వీటి వల్ల బరువు తగ్గడమే కాకుండా.. మీ ఆరోగ్యం కూడా కాపాడుకునేవారవుతారు అంటున్నారు. బరువు తగ్గాలనుకుంటే కొవ్వులను తగ్గించాలి కానీ.. వాటి పూర్తిగా మానేయకూడదు. అన్ని కొవ్వులు ఆరోగ్యానికి హాని చేయవనే విషయం గుర్తించాలి.

ఆరోగ్యకరమైన తక్కువ కొవ్వు కలిగిన ఆహారాలు మీ డైట్లో కలిపి తీసుకోవడం వల్ల హెల్తీ పద్ధతిలో మీరు బరువు తగ్గవచ్చు. అయితే ఎలాంటి ఆహారంలో మంచి కొవ్వులు ఉంటాయో.. అవి ఏవిధంగా మీ ఆరోగ్యానికి, బరువు తగ్గడానికి సహాయం చేస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.

పాల ఉత్పత్తులు

బరువు తగ్గడానికి పాల ఉత్పత్తులు మంచి ఎంపిక. దాదాపు అన్ని పాల ఉత్పత్తులలో కొవ్వులు ఎక్కువగా ఉన్నప్పటికీ.. మీరు మీ ఆహారంలో చేర్చుకోగలిగేవి కూడా ఉన్నాయి. కొవ్వు రహితమైన చీజ్, తక్కువ కొవ్వు కలిగిన పెరుగు వంటి పాల ఉత్పత్తులను మీ డైట్లో చేర్చుకోవచ్చు. ఇవి మీ బరువు తగ్గడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. కొందరికి పాలు, పాలు ఆధారిత ఫుడ్స్ అలెర్జీ కలిగిస్తాయి కాబట్టి అలాంటివారు వీటికి దూరంగా ఉంటేనే మంచిది.

ఆకు కూరలు

ఆకుకూరలు, కూరగాయల్లో కొవ్వు ఎక్కువగా ఉండదు. కానీ వాటిలో అవసరమైన విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. అవి మీ శరీరంలో మంటను తగ్గిస్తాయి. అంతేకాకుండా బరువు తగ్గడంలో కీలకంగా వ్యవహరిస్తాయి. అలాగే ఆకు కూరలను మీ ఆహారంలో చేర్చుకోవడం వల్ల గుండె జబ్బులు, మధుమేహం, క్యాన్సర్ వంటి మహమ్మారులను మీ దరికి రానీయవని పలు అధ్యయనాలు వెల్లడించాయి.

బీన్స్

బీన్స్, చిక్కుళ్ల వంటి పప్పులలో కొవ్వు తక్కువగా ఉంటుంది. వాటిలో కొలెస్ట్రాల్ ఉండదు. అదనంగా వాటిలో ఫైబర్, బి విటమిన్లు, మెగ్నీషియం, ఐరన్, జింక్ వంటి ఖనిజాలు మెండుగా ఉంటాయి. ఇవి రక్తపోటు, కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపులో ఉంచుతాయి. బరువు తగ్గడానికి సహాయపడటమే కాకుండా.. మీ రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతాయి.

పుట్టగొడుగులు

మష్రూమ్స్ కొవ్వు రహితమైనవి. వీటిలో పొటాషియం, ఫైబర్, వివిధ విటమిన్లు ఉంటాయి. విటమిన్ డి, యాంటీఆక్సిడెంట్లు కూడా కలిగి ఉంటాయి. ఇవి మీ రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తాయి. అంతేకాకుండా బరువు తగ్గడంలో మీకు సహాయపడతాయి.

వెల్లుల్లి

వెల్లుల్లి వంటగదిలో సుగంధాలు పంచే సూపర్‌స్టార్ అని చెప్పవచ్చు. ఇది కొవ్వు రహితమైన.. రుచిలో రిచ్ ఫ్లేవర్ కలిగి ఉంటుంది. దాదాపు దీనిని వినియోగించి చేసిన ప్రతి వంటకం రుచిని పెంచుతుంది. వెల్లుల్లి జీవక్రియను పెంచి.. ఫుడ్ తినాలనే కోరికలను తగ్గిస్తుంది. తద్వారా బరువు తగ్గడంలో సహాయపడుతుంది. దీనితో మీరు అధిక బరువును దూరం చేసుకోవచ్చు. ఇది మీరు సన్నగా, ఆరోగ్యంగా ఉండేలా చేయడంలో తనవంతు పాత్ర పోషిస్తుంది.

చిలగడ దుంపలు

చిలగడ దుంపలను తక్కువ కొవ్వు కలిగిన రూట్ వెజిటేబుల్ అంటారు. దీనిలో పోషకాలు అధికంగా ఉంటాయి. విటమిన్ ఎ, సి, బి, పొటాషియం, మాంగనీస్‌లను కలిగి ఉంటుంది. కాబట్టి మీరు బరువు తగ్గాలనుకుంటే హ్యాపీగా దీనిని మీ డైట్లో కలిపి తీసుకోవచ్చు.

టాపిక్

తదుపరి వ్యాసం