Vivo Y15c | వివో నుంచి మరో ఎంట్రీలెవెల్ 4G స్మార్ట్‌ఫోన్, ఫీచర్లు ఇలా ఉన్నాయి!
09 May 2022, 16:00 IST
- మొబైల్ తయారీదారు తాజాగా మరో ఎంట్రీలెవెల్ 4G స్మార్ట్‌ఫోన్ ను భారత మార్కెట్లోకి తీసుకొచ్చింది. దీని ఫీచర్లు ఎలా ఉన్నాయి, ధర ఎంత ఉండొచ్చు మొదలగు వివరాలు ఇక్కడ చూడండి..
Vivo Y15c
మొబైల్ తయారీదారు వివో తమ బ్రాండ్ నుంచి Y-సిరీస్‌లో మరొక కొత్త స్మార్ట్‌ఫోన్ Vivo Y15c ను భారత మార్కెట్లో విడుదల చేసింది. చడీచప్పుడు లేకుండా Vivo Y15c స్మార్ట్‌ఫోన్‌ను కంపెనీ తమ ఇండియా వెబ్‌సైట్‌లో జాబితా చేసింది. Vivo Y15c అనేది ఎంట్రీ-లెవల్ 4G మొబైల్. ఇది గతంలో వచ్చిన Vivo Y15sను పోలి ఉంది. అయినప్పటికీ దీని ఫీచర్లు కొత్తగా ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్ డ్యూయల్ రియర్ కెమెరాను కలిగి ఉంది, మీడియాటెక్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. బ్లూ కలర్ లోనే రెండు షేడ్లలో ఈ స్మార్ట్‌ఫోన్ లభిస్తుంది.
ఇంకా ఇందులో ఎలాంటి ఫీచర్లు, స్పెసిఫికేషన్లు ఉన్నాయి. ధర ఎంత మొదలగు అన్ని వివరాలు ఇక్కడ తెలుసుకోండి..
Vivo Y15c స్మార్ట్‌ఫోన్ ఫీచర్స్, స్పెసిఫికేషన్స్
60Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 6.51 అంగుళాల LCD HD+ డిస్‌ప్లే
3GB RAM, 32/64GB ఇంటర్నల్ స్టోరేజ్ సామర్థ్యం
మీడియాటెక్ Helio P35 ప్రాసెసర్
వెనకవైపు 13+2 మెగా పిక్సెల్ కెమెరా, ముందు భాగంలో 8 MP సెల్ఫీ షూటర్
ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్
5000 mAh బ్యాటరీ సామర్థ్యం, 10W ఛార్జర్
ఇంకా నిర్ణయించలేదు. రూ, 15 వేల లోపే ఉండొచ్చని అంచనా.
కనెక్టివిటీ పరంగా చూస్తే Vivo Y15cలో 4G VoLTE, Wi-Fi, బ్లూటూత్ 5.0, GPS, ఇంకా 3.5mm ఆడియో జాక్ ఉన్నాయి.
టాపిక్