తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  డిస్కౌంట్ ఆఫర్లతో Vivo T1, Vivo T1 Pro 5g స్మార్ట్‌ఫోన్‌లు విడుదల

డిస్కౌంట్ ఆఫర్లతో Vivo T1, Vivo T1 Pro 5G స్మార్ట్‌ఫోన్‌లు విడుదల

HT Telugu Desk HT Telugu

04 May 2022, 15:01 IST

    • స్మార్ట్‌ఫోన్ తయారీదారు వివో తమ బ్రాండ్ నుంచి Vivo T1,  Vivo T1 ప్రో 5G అనే రెండు కొత్త స్మార్ట్‌ఫోన్‌లను భారత మార్కెట్లో విడుదల చేసింది.
Vivo T1 Pro 5G
Vivo T1 Pro 5G

Vivo T1 Pro 5G

చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీదారు వివో తమ బ్రాండ్ నుంచి T1-సిరీస్‌లో రెండు కొత్త స్మార్ట్‌ఫోన్‌లను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఇందులో ఒక మోడల్ Vivo T1 కాగా మరొకటి Vivo T1 ప్రో 5G. ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లు ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటాయి. ప్రారంభోత్సవ ఆఫర్ లో భాగంగా సుమారు రూ. 2500 వరకు డిస్కౌంట్ కూడా అందిస్తున్నారు. ఏ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు, స్పెసిఫికేషన్లు ఉన్నాయి. వీటి ధరలు ఎంత మొదలగు అన్ని వివరాలు ఇక్కడ కింద పేర్కొన్నాం.

ట్రెండింగ్ వార్తలు

Tired After Sleeping : రాత్రి బాగా నిద్రపోయినా.. ఉదయం అలసిపోవడానికి కారణాలు

Foxtail Millet Benefits : మీకు ఉన్న అనేక ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టేందుకు కొర్రలు చాలు

Egg potato Fry: పిల్లలకు నచ్చేలా కోడిగుడ్డు ఆలూ ఫ్రై రెసిపీ, చిటికెలో వండేయచ్చు

Mango eating: ఆయుర్వేదం ప్రకారం మామిడిపండ్లను తినాల్సిన పద్ధతి ఇది, ఇలా అయితేనే ఆరోగ్యానికి ఎంతో మంచిది

Vivo T1 స్మార్ట్‌ఫోన్‌ ఫీచర్స్, స్పెసిఫికేషన్స్

60Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 6.44 అంగుళాల AMOLED డిస్‌ప్లే

4GB/ 6GB/8GB RAM, 128 GB ఇంటర్నల్ స్టోరేజ్ సామర్థ్యం 

స్నాప్‌డ్రాగన్ 680 ప్రాసెసర్

వెనకవైపు 50-2+2 మెగా పిక్సెల్ కెమెరా, ముందు భాగంలో 16 MP సెల్ఫీ షూటర్‌

ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్

5000 mAh బ్యాటరీ సామర్థ్యం, 44W ఛార్జర్

4 GB RAM, 128 GB స్టోరేజ్ వేరియంట్ ధర, రూ. 14,499/-

6 GB RAM, 128 GB స్టోరేజ్ వేరియంట్ ధర, రూ. 15,999/-

8 GB RAM, 128 GB స్టోరేజ్ వేరియంట్ ధర, రూ. 17,999/-

ఈ ఫోన్ మిడ్‌నైట్ గెలాక్సీ, స్టార్రీ స్కై, ఐస్ డాన్ అనే మూడు కలర్ ఆప్షన్‌లలో లభిస్తుంది.

Vivo T1 Pro 5G స్మార్ట్‌ఫోన్‌ ఫీచర్స్, స్పెసిఫికేషన్స్

90Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 6.44 అంగుళాల ఫుల్ HD+ AMOLED డిస్‌ప్లే

6GB/8GB RAM, 128 GB ఇంటర్నల్ స్టోరేజ్ సామర్థ్యం

 క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 778G ప్రాసెసర్

వెనకవైపు 64+8+2 మెగా పిక్సెల్ కెమెరా, ముందు భాగంలో 16 MP సెల్ఫీ షూటర్‌

ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్

4700 mAh బ్యాటరీ సామర్థ్యం, 66W ఛార్జర్

6 GB RAM, 128 GB స్టోరేజ్ వేరియంట్ ధర, రూ. 23,999/-

8 GB RAM, 128 GB స్టోరేజ్ వేరియంట్ ధర, రూ. 24,999/-

ఈ ఫోన్ టర్బో బ్లాక్, టర్బో సియాన్ కలర్ అనే రెండు కలర్ ఆప్షన్‌లలో లభిస్తుంది.

ICICI/SBI/IDFC ఫస్ట్ బ్యాంక్/OneCard కార్డ్‌లతో కొనుగోలు చేసేవారికి Vivo T1 Pro 5G పై రూ. 2500 తగ్గింపు అలాగే T1 44Wపై రూ. 1500 ప్రయోజనాలు లభిస్తాయి. ఈ ఆఫర్ మే 31, 2022 వరకు మాత్రమే చెల్లుబాటు అవుతుంది.

టాపిక్

తదుపరి వ్యాసం