Kidneys Cleaning: మీ కిడ్నీలు నేచురల్‌గా క్లీన్ అవ్వాలంటే ఈ ఆహారాలను తినండి
02 December 2024, 13:15 IST
- Kidneys Cleaning: మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉండాల్సిన అవసరం ఉంది. మూత్ర పిండాల్లో రాళ్లు, ఇన్ఫెక్షన్లు ఇతర వ్యాధులు రాకుండా ఉండాలంటే అవి పరిశుభ్రంగా ఉండాలి. అందుకోసం ఏం తినాలో తెలుసుకోండి.
కిడ్నీల ఆరోగ్యం
మన శరీరంలోని ముఖ్యమైన అవయవాల్లో మూత్రపిండాలు ఒకటి. ఇవి పని చేయడం మానేస్తే మన ఆరోగ్యం తీవ్ర ఇబ్బందుల్లోకి పడిపోతుంది. మనం తినే ఆహారం వల్ల కొన్ని సార్లు ఈ మూత్రపిండాలలో వ్యర్థ పదార్థాలు పేరుకుపోతాయి. మూత్రపిండాలను నేచురల్ గా క్లీన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది.
మన శరీరంలోని వ్యర్ధాలను అదనపు ద్రవాలను తొలగించే పని మూత్రపిండాలతో అంతేకాదు రక్తంలో నీరు లవణాలు సోడియం భాస్వరం క్యాల్షియం పొటాషియం కనిజాల సమతుల్యతను కూడా మూత్రపిండాలని నిర్వహిస్తాయి అలాంటి మూత్రపిండాలను శుభ్రపరచుకోవడం చాలా అవసరం కిడ్నీలు శుభ్రం చేయడంలో కొన్ని రకాల ఆహారాలు ఎంతో మేలు చేస్తాయి
ఇవి తినకండి
కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాంటే క్యాబేజీ, ఖర్జూరం, పాలకూర, సెలరీ వంటి వాటిలో ఆక్సలిక్ యాసిడ్ అధికంగా ఉంటుంది. ఇలాంటి ఆక్సాలిక్ యాసిడ్ అధికంగా ఉండే ఆహారాన్ని తక్కువగా తీసుకోవాలి. ఇవి కిడ్నీలో రాళ్ల ప్రమాదాన్ని పెంచుతాయి. కాబట్టి వీటి వినియోగాన్ని తగ్గిస్తే సరిపోతుంది.
గుమ్మడికాయ గింజలు, అవకాడోలు వంటి వాటిలో మెగ్నీషియం అధికంగా ఉంటుంది. వీటిని అధికంగా తినడం వల్ల మూత్రపిండాలపై ఫాస్పేట్ చూపించే విష ప్రభావాలను ఎదుర్కొనే శక్తిని అందిస్తుంది. ఫాస్పేట్ అధికంగా ఉంటే మూత్రపిండాలు దెబ్బతింటాయి. కాబట్టి మెగ్నీషియం అధికంగా తీసుకుంటే ఫాస్పేట్ వల్ల కలిగే నష్టాన్ని పూరించవచ్చు.
మూత్రపిండాల కోసం చేపలను కూడా అధికంగా తినాలి. చేపల్లో ప్రోటీన్ అధికంగా ఉంటుంది. మూత్రపిండాల వ్యాధులతో బాధపడే వారికి చేపలు ఎంతో మేలు చేస్తాయి. చేపల్లో ఉండే ఒమేగా త్రీ కొవ్వు ఆమ్లాలు కూడా కిడ్నీలను కాపాడతాయి. ఇవి రక్తపోటు, ట్రైగ్లిజరైడ్ స్థాయిలను తగ్గించడానికి సహాయపడతాయి.
మూత్రపిండాలను శుభ్రపరిచే మార్గాలు
రక్తంలో ఉన్న వ్యర్థ పదార్థాలను తొలగించడానికి ఎక్కువగా నీటిని తాగాలి. నీరు ఎంత ఎక్కువ తాగితే మూత్రపిండాలు అంత ఆరోగ్యంగా ఉంటాయి. మూత్రపిండాలకు రక్త ప్రవాహాన్ని సులభతరం చేయడానికి కూడా నీరు ఎంతో ఉపయోగపడుతుంది. అలాగే ఉప్పు వినియోగాన్ని చాలా తగ్గించాలి. ఉప్పు వినియోగం పెరిగితే మూత్రపిండాలు, గుండె జబ్బులు వంటివి వచ్చే అవకాశం ఉంది. ప్రాసెస్ చేసిన ఆహారాలను తక్కువగా తినాలి. తేలికపాటి ఆహారాన్ని అధికంగా తినడం వల్ల మూత్ర పిండాలు ఆరోగ్యంగా ఉంటాయి.
కిడ్నీ డిటాక్సిఫికేషన్ చేయడం చాలా సులువు. మీరు ఆహారాన్ని జాగ్రత్తగా ఎంపిక చేసుకుంటే సరిపోతుంది. తక్కువ ఆక్సాలేట్ ఉన్న ఆహారాలు తినడం, నీరు ఎక్కువగా తాగడం, పండ్లు తాజా కూరలో తినడం అలవాటు చేసుకుంటే ఎలాంటి కిడ్నీ సమస్యలు రాకుండా ఉంటాయి.
మీ బరువు కూడా మీ కిడ్నీలపై ఎంతో ప్రభావాన్ని చూపిస్తుంది. శరీర బరువు పెరిగే కొద్దీ కిడ్నీలో ఆరోగ్యం క్షీణించే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఎత్తుకు తగ్గ బరువు ఉడేలా చూసుకోవాలి.
తినే ఆహారం నూనె నిండినవి, ఉప్పుగా ఉండే పదార్థాలు లేకుండా చూసుకుంటే శరీరంలోని ప్రతి అవయవం ఎక్కువ కాలం పాటూ ఆరోగ్యంగా ఉంటుంది.