తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Eggs: ఇకపై గుడ్లు రోజూ తినేయండి, అవి మీ కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచవని తేల్చిన కొత్త అధ్యయనం

Eggs: ఇకపై గుడ్లు రోజూ తినేయండి, అవి మీ కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచవని తేల్చిన కొత్త అధ్యయనం

Haritha Chappa HT Telugu

30 March 2024, 13:25 IST

google News
    • Eggs: గుడ్లు తినాలంటే ఎంతో మంది భయపడుతూ ఉంటారు. అవి బరువును పెంచుతాయని, వాటిలో కొలెస్ట్రాల్ అధికంగా ఉంటుందని భావిస్తారు. కొత్త అధ్యయనం ప్రకారం కోడిగుడ్లు తినడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు పెరగవు.
గుడ్లు తింటే కొలెస్ట్రాల్ పెరగదు
గుడ్లు తింటే కొలెస్ట్రాల్ పెరగదు (pexels)

గుడ్లు తింటే కొలెస్ట్రాల్ పెరగదు

Eggs: రోజూ కోడిగుడ్డు తినమని ఎంత చెబుతున్నా చాలామంది వాటిని పక్కన పెడుతూ ఉంటారు. కోడిగుడ్లు తినడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయని తద్వారా బరువు పెరుగుతామని ఎంతోమంది భయం. అయితే ఇప్పుడు ఒక కొత్త అధ్యయనం ఆ భయం అవసరం లేదని చెబుతోంది. గుడ్లు తినడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు పెరగవని ఈ అధ్యయనం వివరిస్తోంది. గుడ్లు బలవర్ధకమైన ఆహారంలోకి వస్తాయి. ప్రతిరోజూ తినాల్సిన ఆహారాలలో ఇవి ఒకటి. గుడ్లలో ఉండే పచ్చ సొన తినడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగిపోతాయని, అవి గుండెకు మంచిది కాదని ఎంతోమంది అభిప్రాయం. అయితే గుడ్లలో ఉండే పచ్చ సొన తినడం వల్ల కొలెస్ట్రాల్ అధికంగా పెరగదని, గుడ్లను ఎలాంటి భయం లేకుండా తినవచ్చని ఈ కొత్త అధ్యయనం వివరిస్తోంది.

ప్రతిరోజూ గుడ్లు తినేయండి

ఈ అధ్యయనాన్ని అమెరికాలోని కార్డియాలజీ శాస్త్రవేత్తలు నిర్వహించారు. ఈ అధ్యయనంలో భాగంగా 50 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయసు ఉన్న 140 మంది వ్యక్తులను ఎంపిక చేసుకున్నారు. వారంతా హృదయ సంబంధ వ్యాధులు లేదా ఆ వ్యాధి వచ్చే ప్రమాదం అంచున ఉన్నవారే. వారందరి చేత ప్రతిరోజూ గుడ్లను తినిపించారు. వారికి నచ్చినట్టుగా గుడ్లు తినడానికి అనుమతించారు. నాలుగు నెలల పాటూ అలా ప్రతిరోజూ గుడ్లను తినిపించాక వారిపై పరిశోధన చేశారు. వారానికి 12 గుడ్లు తిన్న వ్యక్తుల్లో కొలెస్ట్రాల్ స్థాయిలు సాధారణంగానే ఉన్నాయని, అవి హృదయ నాళ ఆరోగ్యం పై ఎటువంటి ప్రతికూల ప్రభావాన్ని చూపలేదని అధ్యయనంలో తేలింది. వారానికి రెండు గుడ్లు తిన్నవారి శరీరంలో ఎంత కొలెస్ట్రాల్ ఉందో, వారానికి 12 గుడ్లు తిన్నవారి శరీరంలో కూడా అంతే కొలెస్ట్రాల్ ఉందని గుర్తించారు. దీన్ని బట్టి గుడ్లు తినడం వల్ల రక్తంలోని కొలెస్ట్రాల్ స్థాయిలు పెరగవని నిర్ధారించారు.

ఎవరైతే ప్రతిరోజూ గుడ్లను తిన్నారో వారిలో ఇన్సులిన్ నిరోధకత కూడా పెరిగినట్టు గుర్తించారు. అలాగే విటమిన్ బి నిల్వలు కూడా మెరుగుపడ్డాయి. దీన్ని బట్టి గుడ్లు అధికంగా తినడం వల్ల వారికి మేలే జరిగింది. గుడ్లు తినడం సురక్షితం కాదని, గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉందనే అభిప్రాయం తప్పని అధ్యయనం తేల్చింది.

ఒక ఉడికించిన గుడ్డులో పొటాషియం, ఐరన్, జింక్, విటమిన్ ఈ అధికంగా ఉంటాయి. ఇవన్నీ కూడా మన శరీరానికి అత్యవసరమైనవి. అలాగే ఒక గుడ్డు తినడం వల్ల ఆరు గ్రాముల ప్రోటీన్‌తో పాటు 78 కేలరీలు శరీరానికి అందుతాయి. రోజుకు ఒకటి నుంచి మూడు గుడ్ల వరకు తినవచ్చు. గుడ్లు తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పుష్కలంగా శరీరానికి అందుతాయి. కొంతమంది రోజుకు ఐదు నుంచి ఆరు గుడ్లు కూడా తినేవారు ఉన్నారు. అయితే అంత మొత్తంలో తినడం మంచి పద్ధతి కాదు. ఒకటి నుంచి మూడు గుడ్ల వరకు రోజులో తినవచ్చు. అది మీ జీర్ణక్రియ శక్తి పై ఉంటుంది. కొంతమందికి రెండు గుడ్లు తింటేనే పొట్ట నిండిన ఫీలింగ్ వస్తుంది. ఆ ఫీలింగ్ రాగానే ఆపేయవచ్చు.

గుడ్లలో విటమిన్ డి అధికంగా ఉంటుంది ఈ విటమిన్ దీని సన్ షైన్ విటమిన్ అంటారు ఎందుకంటే ఇది సూర్యరసం నుంచి లభిస్తుంది అలాగే గుడ్ల పచ్చతనలో కూడా ఇది అధికంగా ఉంటుంది వీటి కోసం గుడ్లను కచ్చితంగా తినాల్సిందే విటమిన్ టి చాలా తక్కువ ఆహారాల్లోనే లభిస్తుంది కోడిగుడ్లు సూర్యరశ్మి కొన్ని రకాల పుట్టగొడుగుల్లో మాత్రమే లభిస్తుంది కాబట్టి విటమిన్ డి కోసం మీరు కోడిగుడ్లను తినడం అలవాటు చేసుకోవాలి

టాపిక్

తదుపరి వ్యాసం