మీరు SBI డెబిట్ కార్డ్ ఉపయోగిస్తున్నారా? అయితే ఈ విషయం తెలుసుకోండి!
30 May 2022, 22:47 IST
- వివిధ సందర్భాల్లో చాలా మంది ATM కార్డ్‌లను పోగొట్టుకుంటారు. దీని కారణంగా బ్యాంక్ ఖాతా ప్రమాదంలో పడే అవకాశం ఉంది. మీరు SBI డెబిట్ కార్డ్‌ను కలిగి ఉంటే దానిని ఎలా బ్లాక్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
sbi
అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన SBIకి దేశ వ్యాప్తంగా 45 కోట్ల మందిపైగా కస్టమర్‌లలు ఉన్నారు. వీరు బ్యాంక్ అందించే క్రెడిట్ కార్డు లేదా డెబిట్ కార్డు ద్వారా నిరంతరం ట్రాన్స్‌క్షన్స్ చేస్తునే ఉంటారు. అయితే పోరపాటున కార్డులను పోగొట్టుకున్నప్పుడు ఎలాంటి నష్టం జరగకుండా ఉండేందుకు సులువుగా కార్డును బ్లాక్ చేసే అవకాశాన్ని కల్పిస్తోంది. ఆర్థిక నష్టం జరగకుండా ఈజీగా కార్డును ఎలా బ్లాక్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
SMS
ఎస్‌ఎంఎస్ ద్వారా డెబిట్ కార్డ్‌ను సులువుగా బ్లాక్ చేయండి. డెబిట్ కార్డ్‌ని బ్లాక్ చేయడానికి, మీరు మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుండి "BLOCK<space>కార్డ్ చివరి 4 అంకెలు"ను అని టైప్ చేసి 567676కు సందేశం పంపాలి.
టోల్ ఫ్రీ నంబర్
టోల్ ఫ్రీ నంబర్‌కు కాల్ చేయడం ద్వారా డెబిట్ కార్డ్‌ని బ్లాక్ చేయండి. 1800-1234 లేదా 1800-2100కి డయల్ చేయండి.
2. SBI కార్డ్‌ని బ్లాక్ చేయడానికి మీరు 2ని నొక్కాలి.
3. తర్వాత మీరు కార్డ్‌ను బ్లాక్ చేయడానికి ఖాతా నంబర్‌లోని చివరి 5 అంకెలను నమోదు చేయాలి.
4. మీ కార్డ్ విజయవంతంగా బ్లాక్ చేయబడుతుంది. మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు SMS అందుతుంది.
ఆన్‌లైన్ ద్వారా డెబిట్ కార్డ్‌ని బ్లాక్ చేయడం
1. మీరు మీ యూజర్‌నేమ్, పాస్‌వర్డ్‌తో www.onlinesbi.comకి లాగిన్ అవ్వాలి.
2. “e-Services” ట్యాబ్ కింద “ATM Card Services>కి వెళ్లి బ్లాక్ ATM కార్డ్ లింక్‌ని ఎంచుకోండి.
3. మీరు మీ డెబిట్ కార్డ్‌ని బ్లాక్ చేయాలనుకుంటున్న ఖాతాను ఎంచుకోండి.
4. ఇప్పుడు అన్ని యాక్టివ్, డీయాక్టివ్ కార్డ్‌లు కనిపిస్తాయి. మీకు కార్డ్‌లోని మొదటి 4, చివరి 4 అంకెలు చూపబడతాయి.
5. మీరు బ్లాక్ చేయాలనుకుంటున్న కార్డ్‌ని ఎంచుకుని, "apply"పై క్లిక్ చేయండి.
6. ఇప్పుడు SMS OTP లేదా ప్రొఫైల్ పాస్‌వర్డ్ వీటిలో దేనినైనా ఎంచుకోండి.
7. తదుపరి స్క్రీన్‌పై, ముందుగా ఎంచుకున్న OTP పాస్‌వర్డ్/ప్రొఫైల్ పాస్‌వర్డ్‌ను నమోదు చేసి, "Confirm"పై క్లిక్ చేయండి.
8. మీ ATM/డెబిట్ కార్డ్ విజయవంతంగా బ్లాక్ చేయబడిన తర్వాత టికెట్ నంబర్‌తో సందేశం పంపబడుతుంది.
టాపిక్