Sleeping With Socks : సాక్స్ ధరించి నిద్రపోతున్నారా? ఈ సమస్యలకు దగ్గరగా ఉన్నట్టే
29 August 2023, 20:00 IST
- Sleeping With Socks Problems : నిద్రపోయేటప్పుడు సాక్స్ ధరించే అలవాటు కొంతమందికి ఉంటుంది. ఎక్కువ సేపు సాక్స్ వేసుకుంటే పాదాలు బిగుతుగా మారి రక్తప్రసరణ తగ్గుతుంది. అప్పుడు రక్తపోటు పెరుగుతుంది.
ప్రతీకాత్మక చిత్రం
చల్లనీ గాలి, ప్రశాంతమైన వాతావరణం.. ఇలానే చాలా మంది నిద్రపోవాలి అనుకుంటారు. కొందరు పడుకునే ముందు చాలా నీట్‌గా తయారవుతారు. మరికొందరు సాక్స్ వేసుకుని పడుకోవడంలో కొంత ఆనందం పొందుతారు. కానీ ఇది సరైనది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇటీవలి పరిశోధనల ప్రకారం సాక్స్ నిద్ర నాణ్యతపై సానుకూల ప్రభావాలను చూపుతాయి... అలాగే కొన్ని ప్రతికూల ప్రభావాలను కూడా చూపుతాయి.. అని చెబుతున్నాయి.
సాక్స్ ధరించడం వల్ల ఎక్కువసేపు నిద్రపోవచ్చని, రాత్రి సమయంలో తక్కువ మేల్కొనవచ్చని పరిశోధనలో తేలింది. రాత్రిపూట సాక్స్ ధరించడం వల్ల శరీర ఉష్ణోగ్రత తగ్గుతుంది. అయితే మరోవైపు ఎవరైనా బిగుతుగా సాక్స్ వేసుకుంటే కొన్ని శారీరక సమస్యలు కూడా రావచ్చు.
నిద్రపోతున్నప్పుడు సాక్స్ ధరించడం వల్ల రక్త ప్రసరణ పెరుగుతుంది. అయితే ఎక్కువ సేపు సాక్స్ వేసుకుంటే పాదాలు బిగుతుగా మారి రక్తప్రసరణ తగ్గుతుంది. మీ డాక్టర్ సాక్స్ ధరించమని సలహా ఇస్తే తప్ప, మీరు నిద్రిస్తున్నప్పుడు సాక్స్ ధరించకూడదు. బాగా బిగుతుగా ఉండే సాక్స్ పాదాలకు రక్తప్రసరణను తగ్గిస్తుందని అంటారు.
రోజూ సాక్స్ వేసుకోవాలని భావించే వారి శరీర ఉష్ణోగ్రత కూడా ఎక్కువగానే ఉంటుందని చెబుతున్నారు. ముఖ్యంగా మీ సాక్స్ బిగుతుగా ఉన్నప్పుడు, గాలి వాటి గుండా వెళ్లకపోతే, ఆ వ్యక్తి పాదాలు చాలా వేడిగా, చెమటతో ఉంటాయి. ఇది ఫంగల్ ఇన్ఫెక్షన్లకు కారణమవుతుంది.
నేషనల్ హెల్త్ సర్వీస్ ప్రకారం, ఫంగల్ నెయిల్ ఇన్‌ఫెక్షన్లు సాధారణంగా గోరు అంచున ప్రారంభమై తర్వాత వ్యాప్తి చెందుతాయి. ఫంగల్ నెయిల్ ఇన్ఫెక్షన్ వల్ల గోరు రంగు మారుతుంది. ఫంగల్ నెయిల్ ఇన్ఫెక్షన్ చుట్టుపక్కల చర్మంలో నొప్పి, వాపు, అసౌకర్యాన్ని కలిగిస్తుంది. మీరు సాక్స్ ధరించి నిద్రపోవడం వలన ఈ సమస్య వస్తే.. చికిత్స కోసం వైద్యుడిని సంప్రదించండి.
నెయిల్ ఇన్ఫెక్షన్లు స్త్రీల కంటే పురుషులలో ఎక్కువగా కనిపిస్తాయి. ఈ ఇన్ఫెక్షన్ పిల్లల కంటే పెద్దవారిలో ఎక్కువగా కనిపిస్తుంది. మీ కుటుంబ సభ్యులకు ఈ రకమైన ఫంగస్ సోకినట్లయితే, మీకు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. వృద్ధులకు రక్త ప్రసరణ తక్కువగా ఉన్నందున ఫంగల్ నెయిల్ ఇన్ఫెక్షన్లకు ఎక్కువ అవకాశం ఉంది. సాక్స్ ధరించి నిద్రించే ముందు ఆలోచించడి. బాగా బిగుతుగా ఉండే సాక్స్ ధరించి.. నిద్రపోకండి.