DIY Onion Shampoo। ఇంట్లోనే సులభంగా ఇలా ఉల్లి షాంపూను తయారు చేసుకోండి, మీ జుట్టుకు ఇది చాలా మేలు!
15 July 2023, 12:05 IST
- DIY Onion Shampoo: ఎర్ర ఉల్లిపాయలలో జుట్టు పెరుగుదలను ప్రోత్సహించే, ఫోలికల్స్‌ను బలోపేతం చేసే సమ్మేళనాలు నిండుగా ఉంటాయి. జుట్టు కోసం ఉల్లి షాంపూను ఎలా చేయాలో ఇక్కడ చూడండి.
DIY Onion Shampoo
Hair Fall Prevention: వర్షాకాలంలో జుట్టు సంరక్షణ ఒక పెద్ద టాస్క్. వర్షంలో తడిసినపుడు మీ తలను తడిలేకుండా మృదువైన గుడ్డతో తుడుచుకోవాలి. జుట్టు తడిగా ఉన్నప్పుడు చాలా సున్నితంగా మారుతుంది. వర్షపు నీరు మీ జుట్టుకు చాలా నష్టం కలిగిస్తుంది. మీ జుట్టు డ్యామేజ్ కాకుండా ఉండటానికి, జుట్టు రాలడాన్ని నివారించడానికి మనకు ఇంటి వద్దనే అద్భుతమైన నివారణలు అందుబాటులో ఉన్నాయి. మీ వంటగదిలో లభించే కొన్ని పదార్థాలతో జుట్టుకు పోషణ అందించవచ్చు. ఉదాహహరణకు ఎర్ర ఉల్లిపాయలలో జుట్టు పెరుగుదలను ప్రోత్సహించే, ఫోలికల్స్‌ను బలోపేతం చేసే సమ్మేళనాలు నిండుగా ఉంటాయి. ఇందులో అధిక సల్ఫర్ కంటెంట్ తలపై రక్త ప్రసరణను మెరుగుపరచడంలో సహాయపడుతుంది, జుట్టు కుదుళ్లను ప్రేరేపిస్తుంది, తలలో చికాకు మంటను తగ్గిస్తుంది. అదనంగా, ఎర్ర ఉల్లిపాయలో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి, ఇవి ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుండి జుట్టును రక్షిస్తాయి.
మీ జుట్టు సంరక్షణ కోసం ఎర్ర ఉల్లిపాయలను ఏ విధంగా ఉపయోగించవచ్చో కొన్ని DIY హెయిర్ కేర్ విధానాలను ఇక్కడ తెలుసుకోండి.
ఉల్లినూనెతో జుట్టుకు పోషణ
అర కప్పు కొబ్బరి నూనె లేదా ఆలివ్ నూనెను తీసుకొని వేడిచేయండి, అందులో రెండు ఎర్ర ఉల్లిపాయలను ముక్కలుగా కట్ చేసి వేయండి, రంగు మారేంత వరకు వేడిచేసి ఆపై స్టవ్ ఆఫ్ చేసి చల్లార్చండి. ఈ నూనెను (DIY Red Onion Hair Oil) వడకట్టి మీ జుట్టుకు రాసుకోండి, ఒక అరగంట తర్వాత షాంపూ లేదా కండీషనర్ తో కడిగేసుకోండి. ఇలా రోజూ మీ జుట్టుకు పోషణ ఇవ్వండి.
DIY Onion Shampoo Recipe- ఉల్లిపాయ షాంపూ
- ఒక మీడియ సైజ్ ఎర్ర ఉల్లిపాయ
- షాంపూను నిల్వ చేసే కంటైనర్ లే షాంపూ బాటిల్
- 3-4 చుక్క ఏదైనా ఎసెన్షియల్ ఆయిల్
- సరిపడా షాంపూ
తయారీ:
- ఉల్లిపాయ షాంపూ చేయడానికి, ఉల్లిపాయలు ఒలిచి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
- తరువాత, వాటిని షాంపూ బాటిల్‌లో వేయండి
- అలాగే కొన్ని చుక్కల ఎసెన్షియల్ ఆయిల్ కలపండి.
- షాంపూను బాగా కలిపి మంచి మిశ్రమాన్ని రూపొందించండి.
- మీ ఆనియన్ షాంపూ రెడీ అయినట్లే.. దీనిని చల్లని, పొడి ప్రదేశంలో నిల్వ చేయండి. ఫ్రిజ్‌లో నిల్వచేస్తే తాజాగా ఉంటుంది.
ఈ ఉల్లి షాంపూను మీ తడి జుట్టుకు అప్లై చేసి, 3-4 నిమిషాల పాటు అలాగే ఉంచి గోరువెచ్చని నీటితో మెల్లగా కడిగేయండి.
వారానికోసారి హెయిర్ మాస్క్
జుట్టుకు క్రమం తప్పకుండా నూనె పెట్టడం, అవసరమైనప్పుడు షాంపూ చేసుకోవడంతో , కనీసం వారానికి ఒకసారి మీ జుట్టుకు హెయిర్ మాస్క్ అప్లై చేసుకోవాలి. ఈ హెయిర్ మాస్కులు మీ జుట్టును శుభ్రంగా, ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి.