తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Iron Deficiency: తరచూ అలసటగా అనిపిస్తోందా?.. అయితే ఈ ఆహారాలను తీసుకోండి!

Iron Deficiency: తరచూ అలసటగా అనిపిస్తోందా?.. అయితే ఈ ఆహారాలను తీసుకోండి!

HT Telugu Desk HT Telugu

19 June 2022, 22:06 IST

    • తరచుగా అలసట, బలహీనత, వాకింగ్ చేసేటప్పుడు ఊపిరి ఆడకపోవడం, తలనొప్పి, వేగవంతమైన హృదయ స్పందన వంటి లక్షణాలతో చాలా మంది బాధపడుతుంటారు.
Iron Food
Iron Food

Iron Food

ఇనుము మన శరీరంలో అత్యంత ముఖ్యమైన ఖనిజం.  ఇది  లోపిస్తే అనేక అనారోగ్య సమస్యలు ఏర్పడుతాయి. ఈ సమస్య పురుషుల కంటే మహిళల్లోనే ఎక్కువగా కనిపిస్తుంది. ఐరన్ శరీరానికి అత్యవసరమైన మూలకం, ఇది హిమోగ్లోబిన్‌ను తయారు చేయడానికి సహాయపడుతుంది.

ట్రెండింగ్ వార్తలు

Kakarakaya Ullikaram: మధుమేహుల కోసం కాకరకాయ ఉల్లికారం కర్రీ, వేడివేడి అన్నంలో కలుపుకుంటే ఒక్క ముద్ద కూడా మిగల్చరు

Morning Habits : ఉదయం ఈ 5 అలవాట్లు చేసుకుంటే ఒక్క నెలలో కొలెస్ట్రాల్ తగ్గుతుంది

Godhuma Laddu: పిల్లలకు బలాన్నిచ్చే గోధుమ పిండి లడ్డూలు, ఇలా సులువుగా చేసేయండి

Two Flush Buttons : టాయిలెట్‌లో రెండు ఫ్లష్ బటన్లు ఉండటానికి కారణం ఏంటో మీరు తెలుసుకోవాలి

హిమోగ్లోబిన్ అనేది ఎర్ర రక్త కణాలలో కనిపించే ప్రోటీన్, ఇది ఊపిరితిత్తుల నుండి శరీరంలోని వివిధ కణజాలలకు, అవయవాలకు ఆక్సిజన్‌ను తీసుకువెళుతుంది. శరీరంలో ఇనుము లేకపోవడం వల్ల, కణజాలాలకు ఆక్సిజన్ సరఫరా తగ్గుతుంది, ఇది ఆనారోగ్యానికి కారణమవుతుంది. ఐరన్ లోపిస్తే, అలసట వంటి లక్షణాలు కనిపించడం ప్రారంభిస్తాయి.

కొన్ని పండ్లు ,కూరగాయలు ఐరన్ లోపాన్ని తీర్చడంలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయి. శరీరంలో ఐరన్ లోపం వల్ల కలిగే ఇబ్బందులు ఏమిటో, ఆ లోపాన్ని తీర్చవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.

ఐరన్ లోపం లక్షణాలు: శరీరంలో ఐరన్ లోపం ఉన్నప్పుడు, అలసట, బలహీనత, చర్మం పాలిపోవడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, మూర్ఛ, తలనొప్పి, గుండె చప్పుడు పెరగడం, చర్మం పాలిపోవడం, బలహీనత, ఛాతీ నొప్పి, చేతులతో పాటు కాళ్లు చల్లబడడం ఐరన్ లోపం వల్ల జుట్టు రాలడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. వాటితో నోరు పక్కల పగుళ్లు, ఫీలింగ్ వంటి లక్షణాలు ఉంటాయి. అలసట, ఆకలి లేకపోవడం, గొంతు నొప్పి, నాలుక వాపు వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి.

బీట్‌రూట్ తినండి: శరీరంలో ఐరన్ లోపాన్ని తీర్చడానికి, ప్రతిరోజూ ఒక బీట్‌రూట్ తినండి. బీట్‌రూట్ తీసుకోవడం వల్ల శరీరంలో హిమోగ్లోబిన్ పెరుగుతుంది. తరచుగా వైద్యులు మహిళల్లో రక్తం లేకపోవడాన్ని తీర్చడానికి బీట్రూట్ తినాలని సిఫార్సు చేస్తారు.

బచ్చలికూర తినండి: శరీరంలో ఐరన్ లోపాన్ని తీర్చడానికి, పాలకూర, బచ్చలికూర వంటివి ఎక్కువగా తినాలి. బచ్చలికూరలో కాల్షియం, సోడియం, ఖనిజ లవణాలు, క్లోరిన్, ఫాస్పరస్, ప్రోటీన్ వంటి పోషకాలు ఉంటాయి. ఇది శరీరంలోని రక్త హినతను తీరుస్తుంది.

దానిమ్మపండు: దానిమ్మ రుచికి మాత్రమే కాదు వీటి తినడం వల్ల ఆరోగ్యానికి ఎంత మేలు జరుగుతుంది. దానిమ్మపండు తీసుకోవడం ద్వారా శరీరంలో ఐరన్ లోపం తీరుతుంది. దానిమ్మ రసం తాగడం వల్ల రక్తహీనత వంటి వ్యాధులు దూరమవుతాయి.

జామపండు తినండి: జామపండు తినడం వల్ల శరీరంలో రక్తం హినత తగ్గుతుంది. ఐరన్, విటమిన్ సి పుష్కలంగా ఉన్న జామను తినడం వల్ల అరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది.

ఆకు కూరాలు తినండి: శరీరంలో ఐరన్ లోపాన్ని తీర్చడానికి, ఆకు కూరాలను తినండి. ఆకుపచ్చ కూరాలు శరీరంలో హిమోగ్లోబిన్‌ను పెంచడంలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయి.

తదుపరి వ్యాసం