తెలుగు న్యూస్  /  ఫోటో  /  Food Crisis : చిన్నారుల ఆకలి చావులు.. పౌష్టికాహార లోపంతో మృత్యువాత

Food crisis : చిన్నారుల ఆకలి చావులు.. పౌష్టికాహార లోపంతో మృత్యువాత

14 June 2022, 15:29 IST

ఉగాండలోని కరామోజా ప్రాంతంలో ఆకలి చావులు మొదలయ్యాయి. ఆహారం లేక అలమటిస్తున్న అక్కడి ప్రజలు నిస్సహాయ స్థితిలో కాలం గడుపుతున్నారు. పౌష్ఠికాహార లోపంతో చిన్నారులు మృత్యువాత పడుతున్నారు. ‘పౌష్టికాహార లోపం కారణంగా మూడు నెలల్లో ఈ ప్రాంతంలో 25 మంది కంటే ఎక్కువ మంది పిల్లలను కోల్పోయాం..’ అని కాబాంగ్‌లోని జిల్లా ఆరోగ్య అధికారి డాక్టర్ షరీఫ్ నలిబే తెలిపారు.

  • ఉగాండలోని కరామోజా ప్రాంతంలో ఆకలి చావులు మొదలయ్యాయి. ఆహారం లేక అలమటిస్తున్న అక్కడి ప్రజలు నిస్సహాయ స్థితిలో కాలం గడుపుతున్నారు. పౌష్ఠికాహార లోపంతో చిన్నారులు మృత్యువాత పడుతున్నారు. ‘పౌష్టికాహార లోపం కారణంగా మూడు నెలల్లో ఈ ప్రాంతంలో 25 మంది కంటే ఎక్కువ మంది పిల్లలను కోల్పోయాం..’ అని కాబాంగ్‌లోని జిల్లా ఆరోగ్య అధికారి డాక్టర్ షరీఫ్ నలిబే తెలిపారు.
ఉగాండాలోని కరామోజా రీజియన్‌లో గల రూపా ప్రాంతంలో పాలరాతి క్వారీ వద్ద ఒక మహిళ నీటి కోసం వెతుకుతున్న దృశ్యం. ఉగాండాలోని కరామోజా ప్రాంతంలో దాదాపు 5 లక్షల మందికి పైగా ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు, దక్షిణ సూడాన్, కెన్యా మధ్య ఉండే ఈ ప్రాంతంలో ప్రకృతి వైపరీత్యాలు, మిడతలు, తెగుళ్లు, భారీగా ఆయుధాలు కలిగి ఉన్న పశువుల దొంగల దాడుల కారణంగా ఈ గ్రామీణ వాసులకు తినడానికి తిండి కూడా మిగలకుండా పోయింది. ఆహార కొరత ఏర్పడినందున కరామోజాలోని అత్యంత దుర్బలంగా ఉన్న ప్రజలు మనుగడ కోసం పోరాడుతున్నారు.
(1 / 6)
ఉగాండాలోని కరామోజా రీజియన్‌లో గల రూపా ప్రాంతంలో పాలరాతి క్వారీ వద్ద ఒక మహిళ నీటి కోసం వెతుకుతున్న దృశ్యం. ఉగాండాలోని కరామోజా ప్రాంతంలో దాదాపు 5 లక్షల మందికి పైగా ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు, దక్షిణ సూడాన్, కెన్యా మధ్య ఉండే ఈ ప్రాంతంలో ప్రకృతి వైపరీత్యాలు, మిడతలు, తెగుళ్లు, భారీగా ఆయుధాలు కలిగి ఉన్న పశువుల దొంగల దాడుల కారణంగా ఈ గ్రామీణ వాసులకు తినడానికి తిండి కూడా మిగలకుండా పోయింది. ఆహార కొరత ఏర్పడినందున కరామోజాలోని అత్యంత దుర్బలంగా ఉన్న ప్రజలు మనుగడ కోసం పోరాడుతున్నారు.(AFP)
ఉగాండాలోని కరామోజా ప్రాంతంలో ఉన్న నడుంగెట్ హెల్త్ సెంటర్‌లో పోషకాహార లోపం ఉన్న పిల్లలను ఒక నర్సు పరిశీలిస్తున్న దృశ్యం. ఉగాండాలోని కరామోజా ప్రాంతంలో దాదాపు 40 శాతం మంది ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు. దక్షిణ సూడాన్, కెన్యా మధ్య ఎవరూ పట్టించుకోని ప్రాంతంలో మనుగడ సాగిస్తున్న ప్రజలు ఆకలితో పోరాడుతున్నారు.
(2 / 6)
ఉగాండాలోని కరామోజా ప్రాంతంలో ఉన్న నడుంగెట్ హెల్త్ సెంటర్‌లో పోషకాహార లోపం ఉన్న పిల్లలను ఒక నర్సు పరిశీలిస్తున్న దృశ్యం. ఉగాండాలోని కరామోజా ప్రాంతంలో దాదాపు 40 శాతం మంది ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు. దక్షిణ సూడాన్, కెన్యా మధ్య ఎవరూ పట్టించుకోని ప్రాంతంలో మనుగడ సాగిస్తున్న ప్రజలు ఆకలితో పోరాడుతున్నారు.(AFP)
ఉగాండాలోని కరామోజా ప్రాంతంలో మోరోటోలోని ఒక చెరువు నుంచి నీటిని తీసుకొస్తున్న అమ్మాయి
(3 / 6)
ఉగాండాలోని కరామోజా ప్రాంతంలో మోరోటోలోని ఒక చెరువు నుంచి నీటిని తీసుకొస్తున్న అమ్మాయి(AFP)
ఉగాండాలోని కరామోజా ప్రాంతంలో మార్బుల్ క్వారీలో పనిచేస్తున్న వ్యక్తి. 
(4 / 6)
ఉగాండాలోని కరామోజా ప్రాంతంలో మార్బుల్ క్వారీలో పనిచేస్తున్న వ్యక్తి. (AFP)
ఉగాండాలోని కరామోజా ప్రాంతంలోని నడుంగెట్ హెల్త్ సెంటర్‌లో పోషకాహార పరీక్ష సమయంలో శిశువు బరువును చూస్తున్న నర్సు
(5 / 6)
ఉగాండాలోని కరామోజా ప్రాంతంలోని నడుంగెట్ హెల్త్ సెంటర్‌లో పోషకాహార పరీక్ష సమయంలో శిశువు బరువును చూస్తున్న నర్సు(AFP)
కరామోజా ప్రాంతంలోని పాలరాయి క్వారీలో రాళ్లను కాల్చడానికి మహిళలు కట్టెలను తీసుకువెళుతున్న దృశ్యం 
(6 / 6)
కరామోజా ప్రాంతంలోని పాలరాయి క్వారీలో రాళ్లను కాల్చడానికి మహిళలు కట్టెలను తీసుకువెళుతున్న దృశ్యం (AFP)

    ఆర్టికల్ షేర్ చేయండి