తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Diabetes: డయాబెటిస్ ఉన్నవారు భోజనానికి అరగంట ముందు ఈ నట్స్ తినండి, రక్తంలో చక్కెర స్థాయిలు పెరగవు

Diabetes: డయాబెటిస్ ఉన్నవారు భోజనానికి అరగంట ముందు ఈ నట్స్ తినండి, రక్తంలో చక్కెర స్థాయిలు పెరగవు

Haritha Chappa HT Telugu

05 October 2024, 9:30 IST

google News
    • Diabetes: డయాబెటిస్‌తో బాధపడుతున్న వారు భోజనానికి ముందు బాదం పప్పులు తినడం వల్ల వారిలో రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగే అవకాశం తగ్గుతుంది. ఎలాగో తెలుసుకోండి.
డయాబెటిస్ ఉన్న వారు తినాల్సిన నట్స్
డయాబెటిస్ ఉన్న వారు తినాల్సిన నట్స్ (Pixabay)

డయాబెటిస్ ఉన్న వారు తినాల్సిన నట్స్

మధుమేహం, ప్రీ డయాబెటిస్ ఉన్నవారు రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. వీరికి ఆహారం తినగానే రక్తంలో గ్లూకోజ్ అమాంతం పెరుగుతుంది. అలా పెరగకుండా ఉండాలంటే బాదం గింజలను భోజనానికి ముందు తినాలి. ముందుగానే వాటిని నానబెట్టుకొని భోజనం తినడానికి అరగంట ముందు వాటి పొట్టు తీసి తినాలి. ఆ తర్వాతే భోజనం చేయాలి. ఇలా తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా ఉంటాయని చెబుతోంది కొత్త అధ్యయనం.

బాదంపప్పులో విటమిన్ ఈ, మాంగనీస్‌తో కలిపి విటమిన్లు, ఖనిజాలు ఎన్నో ఉంటాయి. అలాగే ప్రోటీన్, ఫైబర్, రాగి, క్యాల్షియం, మెగ్నీషియం కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా టైప్ 2 డయాబెటిస్ ను అభివృద్ధి చేయకుండా తగ్గిస్తాయి. మీరు భోజనానికి ముందు బాదం పప్పును తినడం వల్ల ఇన్సులిన్ విడుదలకు సహాయపడుతుంది. ఈ గింజల్లో ఉండే ఫైబర్ కంటెంట్ గ్లూకోజ్ వ్యాప్తిని అడ్డుకుంటుంది. గింజల్లోని మంచి కొవ్వులు గ్లూకోజ్ శోషణను నెమ్మదించేలా చేస్తాయి.

బాదంలో జింక్, మెగ్నీషియం పుష్కలంగా ఉంటుందని చెప్పుకున్నాము. కొవ్వు కణజాలాల్లో ఉండే టైరోసిన్ కినేర్ రిసెప్టర్‌ను ఈ జింక్, మెగ్నీషియం కలిసి ప్రేరేపిస్తాయి. దీనివల్ల ఇన్సులిన్ సెన్సిటివిటీ కూడా మెరుగుపడుతుంది. నిజానికి మధుమాహ వ్యాధిగ్రస్తుల్లో మెగ్నీషియం లోపం ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడైతే బాదంలో ఉండే మెగ్నీషియం శరీరంలో చేరుతుందో అది వారి ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతుంది.

మధుమేహం ఉన్నవారు ప్రతిరోజూ నానబెట్టిన నాలుగు బాదం గింజలను తినాల్సిన అవసరం ఉంది. టైప్ 2 డయాబెటిస్ తో బాధపడుతున్న వారిలో గుండె సమస్యలు వచ్చే అవకాశం పెరుగుతుంది. బాదంలో మన శరీరానికి అత్యవసరమైన పోషకాలు ఉంటాయి. వీటిని అల్పాహారంలో చేర్చుకుంటే ఇంకా మంచిది. ప్రతిరోజు రాత్రి భోజనం మధ్యాహ్న భోజనానికి అరగంట ముందు మూడు బాదం గింజలను తినడం అలవాటు చేసుకోండి. ఇది డయాబెటిస్ రోగులకు ఎంతో మేలు చేస్తుంది.

బాదం పప్పును ప్రతి రోజూ తినడం వల్ల మెదడు ఆరోగ్యంగా ఉంటుంది. బాదం పప్పులో విటమిన్ ఇ అధికంగా ఉంటుంది. ఇది మెదడుకే కాదు, చర్మాన్ని మెరిపిస్తుంది. చెడు కొలెస్ట్రాల్ పేరుకుపోకుండా అదుపులో ఉంటుంది.

ప్రతిరోజూ నాలుగు నానబెట్టిన బాదం పప్పులను తినడం వల్ల బరువు త్వరగా తగ్గవచ్చు. ఇందులో ఉండే కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు పొట్ట నిండుగా ఉంచేలా చేస్తాయి. అందువల్ల మీరు ఇతర ఆహారాలను తక్కువగా తింటారు.

మన శరీరానికి అత్యవసరమైన పోషకాలు ఇందులో ఉన్నాయి. విటమిన్ ఇ, మెగ్నీషియం, ఫైబర్ అధికంగా ఉంటాయి. వీటన్నింటి వల్ల చర్మానికి ఎంతో మేలు జరుగుతుంది. డయాబెటిస్ ఉన్న వారు బాదం పప్పులను తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది.

టాపిక్

తదుపరి వ్యాసం