తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Steps Decor: మీ ఇంటి మెట్ల అందం పెంచే డెకార్ ఐడియాలు

Steps Decor: మీ ఇంటి మెట్ల అందం పెంచే డెకార్ ఐడియాలు

06 October 2024, 16:30 IST

google News
  • Steps Decor: మెట్లను అలంకరించాలనే ఆలోచన చాలా తక్కువ మందికే వస్తుంది. సరిగ్గా వాడుకోవాలే కానీ మీ ఇంట్లోనే అందమైన ప్రదేశం రెడీ అవుతుంది. మెట్లను అలంకరించే మార్గాలేంటో చూడండి.

మెట్లను అలంకరించుకునే మార్గాలు
మెట్లను అలంకరించుకునే మార్గాలు (freepik)

మెట్లను అలంకరించుకునే మార్గాలు

ఇండిపెండెంట్ ఇళ్లలో సాధారణంగా బయటవైపు మెట్లుంటాయి. లేదా ఇంటి లోపలి నుంచీ ఉండొచ్చు. అయితే వాటినలా వదిలేయడం కంటే ఇంటి అందాన్ని పెంచేలా అలంకరించుకోవడం వల్ల ఎంతో బాగుంటాయి. వాటిని సరిగ్గా వాడుకుంటే మీ ఇంట్లో ఒక బ్యూటీ స్పాట్ రెడీ అవుతుంది. మీ ఇంటి మెట్ల లుక్‌ని మార్చేసే అద్భుతమైన ఐడియాలు ఇక్కడ కొన్ని ఉన్నాయి

మెట్ల రైలింగ్‌ మీద :

మెట్లకు రెండు వైపులా చాలా మంది పూల కుండీలను ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. మెట్లు ఎంత ఖాళీగా ఉన్నాయి? అన్న దాన్ని బట్టి ఇవి పెట్టుకోవాలా? వద్దా? అనే దాన్ని నిర్ణయించుకోవాలి. మెట్టు చిన్నగా ఉంటే అలా కుండీలు పెడితే మెట్లెక్కడం కష్టం అవుతుంది. అప్పుడు మెట్లకు రెండు వైపులా పడిపోకుండా ఉండేందుకు రైలింగ్‌ని ఏర్పాటు చేసుకుంటారు కదా. దాన్ని వాడొచ్చు .చిన్న మెట్ల దారి ఉన్న వారు ఈ రైలింగ్‌ని పచ్చగా మార్చుకోవచ్చు. వీటి మీదకు మంచి పూల తీగల్ని పాకించుకోండి. ఆ ప్రదేశానికే అందం వచ్చేస్తుంది.

సెన్సార్‌ లైట్లు :

ఈ మధ్య కాలంలో రకరకాల స్ట్రిప్‌ లైట్లు మార్కెట్లో అందుబాటులో ఉంటున్నాయి. వాటర్‌ ప్రూఫ్‌ స్ట్రిప్‌ లైట్లను ఎంపిక చేసుకుని మెట్ల పక్క భాగంలో వరుసగా అంటించేసుకోవచ్చు. రాత్రి పూట అలాంటి కాంతులు మనకు ఎంతగానో ఆహ్లాదాన్ని పంచుతాయి. అలాగే మెట్లకు ఇంటర్నల్ వైరింగ్‌తో ఉండే సెన్సార్‌ లైట్లు అందుబాటులో ఉంటున్నాయి. అంటే మన పాదాలు అలికిడి అయినప్పుడు ఆ లైట్లు బ్లింక్‌ అవుతూ మనకు వెలుతురును ఇస్తాయి. ఈ మధ్య కాలంలో వీటిని వాడటం చాలా మంది మొదలు పెట్టారు. ఇంకా ఏదైనా ప్రత్యేకమైన పండుగ దినాల్లో మెట్ల పక్కన ఉండే రైలింగ్‌కి సీరియల్‌ లైట్లను ఏర్పాటు చేసుకోవచ్చు. ఇవి ఫెస్టివ్‌ లుక్‌ని చక్కగా తీసుకొచ్చేస్తాయి.

కట్టించుకునే సమయంలో :

మీరు గనుక ఇల్లు కట్టించుకునే దశలో ఉంటే మెట్లను ఆకర్షణీయంగా కట్టించుకునే ప్రయత్నం చేయవచ్చు. నిదానంగా ఉన్న మెట్లు కాకుండా రకరకాల ఆకారాల్లో వీటిని డిజైన్‌ చేయించుకోవచ్చు. గుండ్రంగా, అసమానంగా ఉండే మెట్లను ఎంచుకోవచ్చు. అయితే ఆకారాన్ని ఎంచుకునేప్పుడు సౌకర్యాన్నీ దృష్టిలో పెట్టుకోవాలి. 

మెట్లకు ఇరువైపులా :

మెట్ల దగ్గర రెండు వైపులా పెద్ద పెద్ద రెండు కుండీలను పెట్టి చూడండి. అందులో విరగబూసే పూల మొక్కలను వేయండి. ఇవి ఎక్కువ పూలను పూసి మెట్ల దగ్గరకు వచ్చే వారందరికీ ఆహ్వానం పలుకుతాయి. ఆహ్లాదాన్ని పంచుతాయి. ఈ నాలుగింటినీ దృష్టిలో పెట్టుకుని మెట్లను అలంకరించుకోండి. అందరూ వాటిని చూసి మిమ్మల్ని మెచ్చుకోకుండా ఉండరు.

తదుపరి వ్యాసం