తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Creamy Tomato Pasta: చీజీగా క్రీమీగా టమటా పాస్తా.. ఒక్కసారి తింటే వదలరు

Creamy Tomato Pasta: చీజీగా క్రీమీగా టమటా పాస్తా.. ఒక్కసారి తింటే వదలరు

HT Telugu Desk HT Telugu

12 September 2023, 6:30 IST

google News
  • Creamy Tomato Pasta: మామూలు పాస్తా కాకుండా ఒకసారి చీజీగా, క్రీమీగా ఉండే క్రీమీ టమాటా పాస్తా ప్రయత్నించండి. అల్పాహారంలోకి అదిరిపోతుంది. 

క్రీమీ టమాటా పాస్తా
క్రీమీ టమాటా పాస్తా (freepik)

క్రీమీ టమాటా పాస్తా

అల్పాహారంలోకి ఇడ్లీ, దోశలే కాకుండా వెరైటీగా ఏమైనా తినాలనుకుంటున్నారా? అయితే సులభంగా, ఇండియన్ స్టైల్ పాస్తా ప్రయత్నించి చూడండి. చీజీగా, క్రీమీగా, పుల్లగా ఉండే ఈ పాస్తా చాలా రుచిగా ఉంటుంది. కావాల్సిన పదార్థాలు ఒక్కసారి తెచ్చి పెట్టుకుంటే ఎప్పుడైనా సులభంగా ఈ పాస్తా చేసుకోవచ్చు.

కావాల్సిన పదార్థాలు:

1 కప్పు పాస్తా, ఏ రకమైనా తీసుకోవచ్చు

2 చెంచాల ఆలివ్ నూనె

1 ఉల్లిపాయ, పొడవాటి ముక్కలు

4 వెల్లుల్లి రెబ్బలు, తురుము

1 చెంచా చిల్లీ ఫ్లేక్స్

పావు చెంచా మిరియాల పొడి

1 చెంచా ఆరిగానో

1 చెంచా మిక్స్డ్ హర్బ్స్

2 టమాటాలు, ముక్కలు

1 కప్పు ఫ్రెష్ క్రీం

సగం కప్పు తులసి ఆకులు

సగం కప్పు చీజ్ తురుము

తయారీ విధానం:

  1. ముందుగా పాస్తాను ఉడికించుకోవాలి. ఒక పెద్ద పాత్రలో నీళ్లు, ఉప్పు వేసుకుని మరిగించుకోవాలి. నీళ్లు మరుగుతున్నప్పుడు పాస్తా వేసుకుని ఒక పదినిమిషాలు ఉడకనివ్వాలి.
  2. ఉడికిన పాస్తాను నీళ్ల నుంచి తీసి పక్కన పెట్టుకోవాలి. మరీ మెత్తగా కాకుండా చూసుకోవాలి.
  3. ఇప్పుడు మరొక కడాయి పెట్టుకుని ఆలివ్ నూనె వేసుకోవాలి. అది వేడెక్కాక ఉల్లిపాయ ముక్కలు వేసుకుని వేగనివ్వాలి. వెల్లుల్లి ముద్ద, చిల్లీ ఫ్లేక్స్ వేసుకుని కలపాలి.
  4. ఒక నిమిషం అయ్యాక టమాటా ముక్కలు కూడా వేసుకుని మూత పెట్టి మగ్గనివ్వాలి. ఇవి మెత్తబడ్డాక మిరియాల పొడి, ఉప్పు, ఆరిగానో, మిక్స్డ్ హర్బ్స్ వేసుకొని ఒక నిమిషం పాటు ఉడకనివ్వాలి.
  5. నీరు ఇంకిపోయాక ఫ్రెష్ క్రీం వేసుకోవాలి. మూత పెట్టకుండా 5 నిమిషాల పాటూ కలుపుతూ ఉండాలి. దీంట్లో ఉడికించుకున్న పాస్త వేసుకొని క్రీం అంతా పట్టేలాగా కలుపుకోవాలి.
  6. చివరగా రుచి ఇష్టం ఉంటే తులసి వేసుకుని ఒక సారి కలుపుకుని, చీజ్ కూడా వేసుకోవాలి. చీజ్ కరిగిపోగానే దింపేసుకుంటే సరి. క్రీమీ టమాటా పాస్త సిద్ధం.

తదుపరి వ్యాసం