తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Corn Fritters । తక్కువ నూనెతో క్రంచీ కార్న్ ఫ్రిట్టర్స్, చాయ్‌తో చెప్పండి చీర్స్

Corn Fritters । తక్కువ నూనెతో క్రంచీ కార్న్ ఫ్రిట్టర్స్, చాయ్‌తో చెప్పండి చీర్స్

HT Telugu Desk HT Telugu

26 July 2022, 17:28 IST

google News
    • వర్షాకాలంలో వేడివేడిగా స్నాక్స్ తినాలని ఉంటుంది. అయితే నూనె ఎక్కువ ఉంటుందని కొంతమంది వాటి జోలికి వెళ్లరు. తక్కువ నూనెతో కరకరలాడేలా రుచికరమైన కార్న్ ఫ్రిటర్స్ ఇలా చేసుకోవచ్చు.
Corn Fritters Recipe
Corn Fritters Recipe (Unsplash)

Corn Fritters Recipe

వర్షాకాలంలో సాయంత్రం వేళ వేడివేడి చాయ్‌తో పాటు కమ్మగా, క్రంచీగా ఉండే స్నాక్స్ తింటుంటే ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మాన్‌సూన్ అంటే మనసుకు నచ్చిన స్నాక్స్ తినమని అర్థం అని ఒక మహానుభావుడు చెప్పాడు. అయితే ఇది నమ్మాల్సిన అవసరం లేకపోయినా, స్నాక్స్ తినడం మాత్రం మనందిరికీ ఇష్టమే. మరి మాన్‌సూన్ ప్రారంభమై చాలాకాలమే అయింది. మీరందరూ కూడా మిర్చీబజ్జీలు, పకోడీలు, కొంతమంది రొమాంటిక్ ఫెల్లోలు ఐస్ క్రీమ్ లాంటివి తినే ఉంటారు. మరి కొత్తగా ఇంకేమైనా తినాలని అనుకుంటున్నారా? మీకోసమే మాన్ సూన్ స్పెషల్ 'కార్న్ ఫ్రిట్టర్స్ రెసిపీని పరిచయం చేస్తున్నాం.

కార్న్ ఫ్రిట్టర్స్ చాలా రుచిగా ఉంటాయి, క్రంచీగా ఉంటాయి. వేడివేడి చాయ్ తో పాటు తీసుకుంటే అద్భుతంగా ఉంటాయి. ఇవి నూనెతో చేసే స్నాక్స్ అయినప్పటికీ నూనె తక్కువగా పీల్చుకునే తయారీ విధానాన్ని ఇక్కడ అందిస్తున్నాం. మరి ఆలస్యం చేయకుండా కార్న్ ఫ్రిట్టర్స్ తయారీకి కావాల్సిన పదార్థాలు, ఎలా చేయాలో ఇక్కడ తెలుసుకోండి.

కావాల్సిన పదార్థాలు

  • 200 గ్రాముల మొక్కజొన్న
  • 1 ఉల్లిపాయ
  • 2 వెల్లుల్లి రెబ్బలు
  • 2 పచ్చిమిర్చి
  • 1 టీస్పూన్ బేకింగ్ పౌడర్
  • ½ టీస్పూన్ బేకింగ్ సోడా
  • 1 టేబుల్ స్పూన్ మొక్కజొన్న రవ్వ
  • 1 టేబుల్ స్పూన్ శనగ పిండి
  • 1 టేబుల్ స్పూన్ మైదా
  • ½ టీస్పూన్ జీలకర్ర పొడి
  • 1 టేబుల్ స్పూన్ నూనె
  • 2 టేబుల్ స్పూన్ల పాలు
  • 1 టీస్పూన్ కారం
  • కాల్చిన మిరపపొడి చిటికెడు
  • వేయించడానికి 4-5 టేబుల్ స్పూన్ల నూనె

తయారీ విధానం

  1. ముందుగా ఒక బాణలిలో 1 టేబుల్ స్పూన్ నూనె వేడిచేసి తరిగిన ఉల్లిపాయలు ముక్కలు, తరిగిన వెల్లుల్లి, మొక్కజొన్న గింజలు, పచ్చిమిర్చి 2 నిమిషాలు వేయించాలి.
  2. మరోవైపు మొక్కజొన్న రవ్వ, మైదా, శనగపిండి, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, జీలకర్ర పొడి, కారం పొడి అన్ని కలిపి ఫుడ్ ప్రాసెసర్‌లో వేసి బాగా బ్లెండ్ చేయాలి. పిండి ముద్దలాగా చేయాలి. పొడిగా అనిపిస్తే కొన్ని పాలు (మిల్క్) కలపండి.
  3. ఇప్పుడు మెత్తటి ఈ పిండిముద్దతో పైన చేసుకున్న మొక్కజొన్న మిశ్రమాన్ని కలిపి చిన్నచిన్న కట్ లెట్లలాగా/ వడలలాగా చేసుకోండి.
  4. వేయించటానికి నూనె వేడి చేసి వడలను వేడిచేయండి. బ్రౌన్ కలర్ వచ్చేవరకు డీప్ ఫ్రై చేయండి.

అంతే, కార్న్ ఫ్రిట్టర్స్ సిద్ధం అయ్యాయి. సర్వింగ్ ప్లేట్లలోకి తీసుకొని వేడివేడిగా వీటి రుచిని ఆస్వాదించండి.

టాపిక్

తదుపరి వ్యాసం