Face Masks | కూలింగ్ ఫేస్ మాస్క్‌లతో.. సమ్మర్ కు హాయ్ చెప్పండి..
24 March 2022, 14:51 IST
- సమ్మర్ వచ్చేసింది. చెమట తెచ్చేసింది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఈ చెమట వల్ల చాలా చర్మ సమస్యలు రావడమే కాదు.. స్కిన్ టోన్ మారిపోతుంది. మరి వేసవిలో చర్మాన్ని ఎలా కాపాడుకోవాలని ఆలోచిస్తున్నారా? అయితే ఈ 5 కూలింగ్ ఫేస్ మాస్కులు.. మీ చర్మ సమస్యలను అధిగమించడానికి సహాయపడతాయి. అంతే కాకుండా మీ ముఖానికి నిగారింపు తెస్తాయి.
కూలింగ్ ఫేస్ మాస్క్
వేసవి రావడమే కాదు.. వస్తు చర్మ సమస్యలు కూడా తెస్తుంది. ఇది ఒప్పుకోవాల్సిన విషయం. చెమట వల్ల చర్మ సమస్యలు వస్తాయనేది అందరికీ తెలిసిన విషయమే. వేసవి తాపం తీర్చుకోవడానికి ఒక గ్లాసు చల్లటి నీరు లేదా చల్లని పానీయాలు తాగుతాం. మరి చర్మానికి ఏం చేస్తాం? వేసవి తాపం నుంచి చర్మాన్ని కాపాడుకోవాలంటే.. చర్మాన్ని ఎలా సిద్ధం చేసుకోవాలి? మీరు దీని గురించే ఆలోచిస్తున్నట్లయితే? మీకోసమే కూలింగ్ ఫేస్ మాస్క్‌లన్నాయి. వీటిని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చుద్దాం.
1. కలబంద, నిమ్మరసం ఫేస్ మాస్క్
నిమ్మరసం చర్మానికి తాజా సువాసనను ఇచ్చి టాన్ సమర్థవంతంగా తొలగిస్తుంది. కలబంద చర్మాన్ని తేమగా ఉంచుతుంది. ఈ ఫేస్ మాస్క్ చేయడానికి 2 టేబుల్ స్పూన్ల అలోవెరా జెల్ తీసుకొని... దానిలో 2 టేబుల్ స్పూన్ల తాజా నిమ్మరసం కలపండి. ఈ రెండు పదార్థాలను కలపండి. ఈ పేస్ట్‌తో మీ ముఖాన్ని కవర్ చేసి 20 నిమిషాల తర్వాత కడగాలి.
2. దోసకాయ, పుచ్చకాయ ఫేస్ మాస్క్
దోసకాయ, పుచ్చకాయ రెండూ అధిక నీటి కంటెంట్ మూలాలు. ఇవి మీ చర్మాన్ని హైడ్రేట్ గా, తేమగా, మురికి లేకుండా ఉంచుతాయి. చల్లగా, తాజాగా ఉంచుతాయి. ఈ ఫేస్ మాస్క్‌ను తయారు చేయడానికి... దోసకాయ రసం, పుచ్చకాయ గుజ్జును తీసుకుని.. వాటికి రెండు టీస్పూన్ల పాలు, గుడ్డులోని తెల్లసొనతో కలపండి. ఈ పదార్థాలను బ్లెండర్లో వేసి మెత్తగా పేస్ట్ చేయవచ్చు. ఈ పేస్ట్‌ను ముఖం, మెడ భాగంలో అప్లై చేసి అరగంట తర్వాత నీటితో శుభ్రం చేసుకోండి.
3. పుదీనా, ముల్తానీ మట్టి
పుదీనాలో శీతలీకరణ లక్షణాలు ఉన్నాయి. ఇది చికాకు కలిగించే చర్మాన్ని శాంతపరచడంలో సహాయపడుతుంది. ముల్తానీ మట్టి చర్మం నుంచి అదనపు నూనెను తొలగిస్తుంది. కడిగిన పుదీనా ఆకుల గుత్తిని తీసుకుని, మెత్తగా పేస్ట్ చేయాలి. అరకప్పు ముల్తానీ మట్టిని తీసుకుని అందులో పుదీనా పేస్ట్ వేసి పేస్ట్ లా తయారుచేయాలి. ఈ పేస్ట్‌ని ముఖం, మెడ భాగంలో రాసి ఆరిన తర్వాత కడిగేయాలి.
4. ఫ్రూట్ ఫేస్ మాస్క్
ఈ మాస్క్ చేయడానికి అరటి, యాపిల్, బొప్పాయి, పుచ్చకాయ వంటి పండ్లను తీసుకుని వాటిని కలిపి ముఖానికి పట్టించాలి. 20-30 నిమిషాలు అలాగే ఉంచండి. బొప్పాయిలో ఎంజైమ్‌లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మృత చర్మ కణాలను శుభ్రపరచడంలో సహాయపడతాయి. అరటిపండు చర్మాన్ని బిగుతుగా చేస్తుంది. యాపిల్ చర్మాన్ని శుభ్రపరచడంలో సహాయపడే పెక్టిన్ ఉంటుంది. నారింజలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది.
5. రోజ్ వాటర్, చందనం ఫేస్ మాస్క్
గంధం చర్మాన్ని చల్లబరచడానికి, దానికి మెరుపును తీసుకురావడానికి పురాతన భారతీయ ఔషధం. రోజ్ వాటర్ రిఫ్రెష్ నాణ్యతను కలిగి ఉంటుంది. 2 టేబుల్ స్పూన్ల స్వచ్ఛమైన గంధపు పొడిని తీసుకుని, దానికి రోజ్ వాటర్ వేసి పేస్ట్ లా చేయాలి. తక్షణ శీతలీకరణ, నిస్తేజమైన చర్మాన్ని పునరుద్ధరించడానికి ఈ మాస్క్ ఉపయోగపడుతుంది.