pancharathan dal: రుచికరమైన పంచరతన్ దాల్.. 5 రకాల పప్పులతో..
18 May 2023, 13:00 IST
pancharathan dal: 5 రకాల పప్పులని కలిపి వండే పంచరతన్ దాల్ ఎలా చేసుకోవాలో చూడండి.
పంచరతన్ పప్పు (freepik)
పంచరతన్ పప్పు
ఆకుకూరలతో, కూరగాయలతో వివిధ రకాల పప్పులు చేసుకుంటాం. ఒకసారి పంచరతన్ పప్పు ట్రై చేయండి. అయిదు రకాల పప్పులతో కాస్త భిన్నంగా చేసే ఈ పప్పు రుచిగా ఉంటుంది. రోజూ ఒకేరకమైన పప్పు బోర్ కొడితే ఇది ప్రయత్నించి చూడండి.
కావాల్సిన పదార్థాలు:
5 రకాల పప్పులు( కందిపప్పు, మినప్పప్పు, పెసరపప్పు, మసూర్ పప్పు, శనగపప్పు)- ప్రతిదీ పావుకప్పు
1 టీస్పూన్ పసుపు
2 బిర్యానీ ఆకులు
1 టేబుల్ స్పూన్ నెయ్యి
1 ఎండుమిర్చి
2 లవంగాలు
1 చెంచా జీలకర్ర
1 చెంచా కారం
1 సన్నగా తరిగిన ఉల్లిపాయ
1 చెంచా అల్లం వెల్లుల్లి ముద్ద
1 చెంచా జీలకర్ర, ధనియాల పొడి
2 టమాటాలు
పావు చెంచా గరం మసాలా
1 చెంచా కసూరి మేతీ
కొత్తిమీర కొద్దిగా
ఉప్పు తగినంత
తయారీ విధానం:
- ముందుగా అయిదు రకాల పప్పుల్ని కడిగి అరగంట నానబెట్టుకోవాలి. కుక్కర్ లో 3 కప్పుల నీళ్లు పోసుకుని, ఒక బిర్యానీ ఆకు, నెయ్యి, కొంచెం పసుపు వేసుకుని 5 కూతలు వచ్చేదాకా ఉడికించుకోవాలి.
- ఇప్పుడు ఒక కడాయిలో రెండు చెంచాల నెయ్యి వేసుకుని, 1 బిర్యానీ ఆకు, 2 లవంగాలు, 1 చెంచా జీలకర్ర, 1 ఎండుమిర్చి వేసుకోవాలి. వేగాక, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి ముద్ద కూడా వేసుకోవాలి.
- ఇప్పుడు పావు చెంచా పసుపు, 1 చెంచా కారం, 1 చెంచా ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఉప్పు వేసుకోవాలి. టమాటా ముక్కలు కూడా వేసుకోవాలి.
- టమాటా మెత్తబడ్డాక ఉడికించిన పప్పు వేసుకోవాలి. ఒక పది నిమిషాలు మూత పెట్టి ఉడకనివ్వాలి.
- ఇప్పుడు గరం మసాలా, కసూరీ మేతీ వేసుకుని కలుపుకోవాలి. పప్పు రెడీ అయినట్లే. కావాలనుకుంటే ఇంకోసారి నూనె, ఆవాలు, ఇంగువ వేసి నూనె తాలింపు పెట్టుకోవచ్చు. దీన్ని చపాతీ లేదా జీరారైస్, వైట్ రైస్ లోకి తినొచ్చు.
టాపిక్