తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  కీళ్ల నొప్పుల్లో ఇన్ని రకాలా? వీటిని ఎలా అధిగమించాలి? సప్లిమెంట్లు పనిచేస్తాయా?

కీళ్ల నొప్పుల్లో ఇన్ని రకాలా? వీటిని ఎలా అధిగమించాలి? సప్లిమెంట్లు పనిచేస్తాయా?

HT Telugu Desk HT Telugu

08 February 2024, 11:59 IST

google News
    • కీళ్ళ నొప్పులు కీళ్ళ పనితీరును ప్రభావితం చేయవచ్చు. చిన్నపాటి పనులు కూడా చేయలేకపోవచ్చు. తీవ్రమైన కీళ్ళ నొప్పి, బాధ, జీవన శైలికి ఆటంకం కలిగిస్తాయి.
కీళ్ల నొప్పులు ఎన్ని రకాలు? వీటిని ఎలా అధిగమించాలి? సప్లిమెంట్లు పనిచేస్తాయా?
కీళ్ల నొప్పులు ఎన్ని రకాలు? వీటిని ఎలా అధిగమించాలి? సప్లిమెంట్లు పనిచేస్తాయా?

కీళ్ల నొప్పులు ఎన్ని రకాలు? వీటిని ఎలా అధిగమించాలి? సప్లిమెంట్లు పనిచేస్తాయా?

ఈ రోజుల్లో చాలా మందిని వేధించే సమస్య కీళ్ళ నొప్పులు. నేల పైన కూర్చోలేకపోవడం, కూర్చున్నా లేవలేకపోవడం ముఖ్యంగా కనిపిస్తాయి. చేతులు, పాదాలు, మోకాళ్ళు, వెన్నెముకలో నొప్పిగా అనిపిస్తూ ఉంటుంది. కీళ్ళ నొప్పులు ఎల్లకాలం అలానే ఉండవచ్చు లేదంటే వచ్చి పోతూ ఉండవచ్చు. కొన్నిసార్లు, కీళ్ళు పట్టేసినట్లుగా నొప్పిగా అనిపించవచ్చు. కొందరికి మంట, తట్టుకోలేని నొప్పిగా ఉంటోందని చెప్తారు. 

అలాగే కీళ్ళు ఉదయాన్నే పట్టేసినట్లు అనిపించవచ్చు, కానీ నడిచి కదిలే కొద్దీ నొప్పి తగ్గి మెరుగ్గా అనిపిస్తుంది. అయినప్పటికీ, చాలా ఎక్కువ పనిచేస్తే ఎక్కువ నొప్పిగా అనిపిస్తుంది. కీళ్ళ నొప్పులు కీళ్ళ పనితీరును ప్రభావితం చేయవచ్చు. చిన్నపాటి పనులు కూడా చేయలేకపోవచ్చు. తీవ్రమైన కీళ్ళ నొప్పి, బాధ, జీవన శైలికి ఆటంకం కలిగిస్తాయి.

ఇటువంటి సమస్యలను అధిగమించడానికి, దగ్గరకు రానివ్వకుండా ఉండటానికి సమతులాహారం తీసుకోవడం చాలా ముఖ్యం. అయితే, మనం తీసుకొనే ఆహారంలో అన్ని రకాల పోషకాలూ మనకి అందకపోవచ్చు. అందుకోసం కొన్ని రకాల సప్లిమెంట్లు తీసుకోవడం అవసరం. ఈ కీళ్ళ నొప్పులను అధిగమించడానికి కొన్ని సింపుల్ సప్లిమెంట్స్ సహాయపడతాయి. మల్టీవిటమిన్లు, కొలాజెన్ biotin tablets, బయోటిన్ వంటి సప్లిమెంట్లు శరీరంలో పోషకాలు సరైన మోతాదులో ఉంచి, కీళ్ళ నొప్పులను దూరం చేయడంలో సహాయపడతాయి.

సాధారణంగా ఈ రోజుల్లో వచ్చే కీళ్ళ నొప్పులలో రకాలు

కీళ్ళ నొప్పులు ఎన్నో రకాలు. వాటిలో కొన్ని:

ఆస్టియో ఆర్థరైటిస్: ఆస్టియో ఆర్థరైటిస్, ఇది ఒక సాధారణ రకమైన ఆర్థరైటిస్, కాలక్రమేణా మృదులాస్థి - ఎముకల మధ్య ఉండే మెత్తని భాగం క్షీనిస్తుంది. కీళ్ళు నొప్పిగా అనిపిస్తాయి. పట్టేసినట్లుంటాయి. ఆస్టియో ఆర్థరైటిస్ నెమ్మదిగా పెరుగుతుంది. సాధారణంగా 45 ఏళ్ళ వయసు తర్వాత వస్తుంది.

రుమటాయిడ్ ఆర్థరైటిస్: రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది కీళ్ళలో వాపు మయు నొప్పిని కలిగించే దీర్ఘకాలిక వ్యాధి. సాధారణంగా వేళ్ళు మరియు మణికట్టులో నొప్పి ఉంటుంది. చేతిని కదపటం కూడా కష్టంగా అనిపిస్తుంది.

గౌట్: గౌట్ అనేది శరీరంలోని ఆమ్ల స్ఫటికాలు కీళ్ళలోనికి చేరి, తీవ్రమైన నొప్పి, వాపును కలిగించే బాధాకరమైన సమస్య. ఈ సమస్య సాధారణంగా బొటనవేలులో సంభవిస్తుంది.

టెండినిటిస్: టెండినిటిస్ అనేది స్నాయువులలో వాపు - ఇవి ఎముకలు, కండరాలను కలిపే సౌకర్యవంతమైన బ్యాండ్లు. ఇది సాధారణంగా మోచేయి, మడమ లేదా భుజంలో కనిపిస్తుంది. మితిమీరిన వినియోగం తరచుగా కారణమవుతుంది.

అదనంగా, వైరల్ ఇన్ఫెక్షన్లు, దద్దుర్లు లేదా జ్వరం కదలికను బాధాకరంగా చేస్తాయి. విరిగిన ఎముకలు లేదా బెణుకులు వంటి గాయాలు కూడా కీళ్ళ నొప్పులకు కారణమవుతాయి.

మల్టీవిటమిన్ సప్లిమెంట్లు:

ఎముకలు మరియు కీళ్ళను జాగ్రత్తగా చూసుకోవడానికి మీరు చేయగలిగే అతి ముఖ్యమైన పని ఏమిటంటే, ఆరోగ్యకరమైన జీవనశైలికి ప్రాధాన్యత ఇవ్వడం -- సమతులాహారం తీసుకోవడం, మల్టీవిటమిన్ Multivitamin tablets సప్లిమెంట్లు తీసుకుంటూ ఉండటం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వంటివి చేయడం. అలాగే, మీకు నొప్పిగా గానీ పట్టేసినట్టు గానీ అనిపిస్తున్నట్లయితే తప్పకుండా డాక్టర్‌‌ని కలవడం చాలా ముఖ్యం.

కానీ బోనస్‌గా, మీరు ఆరోగ్యంగా ఉండటానికి సప్లిమెంట్‌లను ఎంచుకోవచ్చు. మీ ఆహారంలో భాగంగా ఏదైనా మల్టీవిటమిన్ సప్లిమెంట్‌ను తీసుకోవాలనుకుంటే, మీ ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకోవడానికి ముందుగా డాక్టర్‌‌ని సంప్రదించాలి. మల్టీవిటమిన్లు ఆహారంలో ఉండే వివిధ విటమిన్స్, మినరల్స్ యొక్క కలయిక. 

ప్రతిరోజూ మల్టీవిటమిన్‌లను తీసుకోవడం ద్వారా మన ఆరోగ్యాన్ని సహజంగా పెంచే పోషకాహారాలను మనం ఒకవేళ తీసుకోకపోతే ఏర్పడే లోపాలను అధిగమించవచ్చు. మన రోజువారీ పోషకాహార అవసరాలను తీర్చడానికి, రోజూ మనకు అవసరమయ్యే విటమిన్లు మరియు మినరల్స్ పొందడానికి ఒక తక్షణ మార్గం మల్టీవిటమిన్లు.

శరీరంలోని కీళ్ళను ఆరోగ్యంగా ఉంచడానికి విటమిన్లు ఎంత అవసరమో, కొలాజెన్ కూడా అంతే అవసరం. శరీరంలో ఈ కొలాజెన్ ప్రోటీన్ సరిపడా ఉండేలా చూసుకోవాలి.

కొలాజెన్ అంటే ఏమిటి?

శరీరంలో అత్యంత సమృద్ధిగా ఉండే ప్రోటీన్ కొలాజెన్. ఇది శరీరంలోని మొత్తం ప్రోటీన్‌లో 30% ఉంటుంది. కొలాజెన్ అనేది మీ శరీరం యొక్క చర్మం, కండరాలు, ఎముకలు, ఇతర కణజాలాలకు ప్రాథమిక పునాది. ఇది శరీర అవయవాలు, రక్త నాళాలు, పేగుల గోడలలో కూడా కనిపిస్తుంది.

ప్రోటీన్లు అమైనో ఆమ్లాల నుండి తయారవుతాయి. కొలాజెన్‌ను తయారు చేసే ప్రధాన అమైనో ఆమ్లాలు ప్రోలిన్, గ్లైసిన్ మరియు హైడ్రాక్సీప్రోలిన్. ఈ అమైనో ఆమ్లాలు కలిసి ట్రిపుల్ హెలిక్స్ నిర్మాణంలో ప్రోటీన్ ఫైబ్రిల్స్‌ను ఏర్పరుస్తాయి. ట్రిపుల్ హెలిక్స్ చేయడానికి మీ శరీరానికి సరైన మొత్తంలో విటమిన్ సి, జింక్, కాపర్ మరియు మాంగనీస్ అవసరం.

కొలాజెన్ ప్రధానంగా ఐదు రకాలు:

  • టైప్ I. ఈ రకం కొలాజెన్ శరీరంలోని మొత్తం కొలాజెన్‌లో 90% ఉంటుంది. టైప్ I మీ చర్మం, ఎముకలు, కీళ్ళ మధ్య నిర్మాణాన్ని అందించడానికి ఉపయోగించబడుతుంది.
  • టైప్ II. ఈ టైప్ సాగే మృదులాస్థిలో కనిపిస్తుంది. ఇది ఎముకలకు సపోర్ట్ అందిస్తుంది.
  • టైప్ III. ఈ రకం కొలాజెన్ కండరాలు, ధమనులు మరియు అవయవాలలో కనిపిస్తుంది.
  • IV టైప్. ఈ టైప్ మీ చర్మం పొరలలో కనిపిస్తుంది.
  • టైప్ V. ఈ టైప్ మీ కళ్ళలోని కార్నియా, చర్మం యొక్క కొన్ని పొరలు, వెంట్రుకలు మరియు మాయ యొక్క కణజాలంలో కనిపిస్తుంది.

కొలాజెన్‌ ఎలా మారుతుంది?

వయసు పెరిగే కొద్దీ కొలాజెన్‌ ఉత్పత్తి తగ్గుతుంది. అప్పటికే శరీరంలో ఉండే కొలాజెన్ కూడా వేగంగా క్షీణిస్తుంది. చిన్న వయస్సులో ఉన్నప్పటి కంటే కొలాజెన్ నాణ్యత కూడా వయసు పెరిగే కొద్దీ తగ్గుతూ ఉంటుంది. అందువల్ల కొలాజెన్‌ సప్లిమెంట్లు కూడా శరీరానికి ఎన్నో విధాలుగా ఉపయోగపడతాయి.

బయోటిన్

కీళ్ళ నొప్పుల విషయంలో ఉపయోగపడే మరొక సప్లిమెంట్ బయోటిన్. బయోటిన్ ఆహారాన్ని ఉపయోగించగల శక్తిగా మార్చడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది (విటమిన్ H మరియు B7 అని కూడా అంటారు). ఈ B కాంప్లెక్స్ విటమిన్ గింజలు, చిక్కుళ్ళు, బయోటిన్ కాలీఫ్లవర్, తృణధాన్యాలు, పుట్టగొడుగులు, గుడ్లతో పాటు అనేక రకాల ఆహార పదార్థాలలో పుష్కలంగా ఉంటుంది.

బయోటిన్ అనేక ఆహార పదార్థాలలో ఉన్నప్పటికీ, అందరూ వాటిని రోజూ తగినంత తీసుకోలేరు. ఇటువంటి సందర్భంలో బయోటిన్ సప్లిమెంట్ తీసుకోవడం అనేది బయోటిన్ యొక్క ప్రయోజనాలను పొందడానికి ఒక తెలివైన మార్గం. ఆరోగ్యకరమైన సమతులాహారంలో బయోటిన్ సప్లిమెంట్‌ను జోడించడం వలన ఈ బి కాంప్లెక్స్ విటమిన్ అందించే అన్ని ప్రయోజనాలను పూర్తిగా ఉపయోగించుకోవచ్చు. ఈ బయోటిన్ సప్లిమెంట్ తీసుకోవడం ద్వారా కీళ్ళ నొప్పుల వంటి శారీరిక సమస్యలెన్నింటికో చెక్ పెట్టవచ్చు.

కీళ్ళ నొప్పులకు చికిత్స ఏమిటి?

కీళ్ళ నొప్పులకు చికిత్స లేనప్పటికీ, వాటిని మేనేజ్ చేయడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. కొన్నిసార్లు, అప్పటికప్పుడు నొప్పిని తగ్గించే పెయిన్ కిల్లర్స్ తీసుకోవడం ద్వారా లేదా సాధారణ రోజువారీ వ్యాయామాలు చేయడం ద్వారా నొప్పి తగ్గిపోవచ్చు. అయితే, కొన్ని సందర్భాలలో పూర్తి చికిత్స తీసుకోవడమో, లేదా సర్జరీ చేయించడమే తరుణోపాయం కావచ్చు.

కీళ్ళనొప్పిని తగ్గించడానికి ఇవి కూడా సహాయపడతాయి:

ఇంట్లోనే సులభమైన నివారణలు: నొప్పిగా ఉన్నచోట్ల ప్రతిరోజూ హీటింగ్ ప్యాడ్, వేడినీళ్ళ కాపడం లేదా ఐస్‌ని అప్లై చేయమని డాక్టర్ సలహా ఇవ్వవచ్చు. వెచ్చని బాత్‌టబ్‌లో కాసేపు కూర్చోవడం కూడా ఎంతో ఉపశమనం కలిగిస్తుంది.

వ్యాయామం: వ్యాయామం బలం మరియు పనితీరును తిరిగి పొందడానికి సహాయపడుతుంది. నడక, స్విమ్మింగ్ లేదా మరొక తక్కువ-ప్రభావ ఏరోబిక్ వ్యాయామం ఉత్తమం. కఠోరమైన వర్కవుట్‌లు లేదా స్పోర్ట్స్ యాక్టివిటీస్‌లో చేసేవాళ్ళు వాటిని మార్చవలసి ఉంటుంది, లేదా తేలికపాటి వర్కవుట్ రొటీన్‌ను ప్రారంభించాలి. సున్నితమైన స్ట్రెచింగ్ ఎక్సర్‌‌సైజులు కూడా ఉపయోగకారమే. ఏవైనా వ్యాయామాలు చేయడం ప్రారంభించే ముందు గానీ కొనసాగించే ముందు గానీ డాక్టర్‌‌ని సంప్రదించండి.

బరువు తగ్గడం: కీళ్ళపై ఒత్తిడిని తగ్గించడానికి, అవసరమైతే, బరువు తగ్గమని సూచించవచ్చు.

కీళ్ళ నొప్పులకు డాక్టర్ చికిత్స ఎప్పుడు అవసరం?

నొప్పి రోజువారీ జీవితానికి అంతరాయం కలిగిస్తుంటే, డాక్టర్‌‌ని కలిసి సమస్య గురించి వివరించాలి. నొప్పికి కారణాన్ని త్వరగా నిర్ధారించి, నొప్పిని తగ్గించుకోవడం, ఆరోగ్యకరంగా చలాకీగా పనిచేసే కీళ్ళ కోసం చికిత్స ప్రారంభించడం చాలా ముఖ్యం.

ఈ క్రింది లక్షణాలు ఉంటే తప్పక డాక్టర్‌‌ని కలవాలి:

  • జ్వరంతో కూడిన నొప్పి
  • చాలా ఎక్కువగా బరువు పెరగడం - 4.5 కిలోగ్రాములు లేదా అంతకంటే ఎక్కువ.
  • నడవలేనంత నొప్పి

సర్జరీలు:

కొన్నిసార్లు పరిస్థితి మరీ చేయి దాటిపోతే సర్జరీ చేయవలసి వస్తుంది. కొన్ని సర్జరీలకు సంబంధించిన వివరాలు మీకోసం.

ఆర్థ్రోస్కోపీ

ఈ ఆర్థ్రోస్కోపీలో డాక్టర్లు ఆర్థ్రోస్కోప్‌ని కీళ్ళలోపలికి తీసుకొనివెడతారు - ఆర్థ్రోస్కోప్‌ అంటే ఒక సన్నని, ఫైబర్‌ఆప్టిక్ డివైస్ - ఇది మృదులాస్థిని రిపేర్ చేస్తుంది లేదా కీళ్ళలోలేదా సమీపంలోని బోన్ చిప్‌లను తొలగిస్తుంది.

జాయింట్ ఫ్యూజన్

జాయింట్ ఫ్యూజన్ అనేది ఒక సర్జన్ ఎముకల చివరలను ఒకదానితో ఒకటి కలపడం. ఎముకలు నయం అవుతున్నప్పుడు వాటిని పట్టి ఉంచడానికి సర్జన్ ప్లేట్లు, స్క్రూలు, పిన్స్ లేదా రాడ్‌లను ఉపయోగించవచ్చు. సాధారణంగా చేతులు, చీలమండలు మరియు వెన్నెముకపై ఈ ఫ్యూజన్‌లను చికిత్స చేస్తారు.

ఆస్టియోటమీ

ఆస్టియోటమీ సమయంలో, ఒక సర్జన్ కీలులోని దెబ్బతిన్న భాగంలోని ఒత్తిడిని తగ్గించడానికి చెయ్యి, కాలులోని పొడవాటి ఎముకలను తిరిగి అమర్చుతారు లేదా మళ్ళీ నిర్మిస్తారు. ఇది నొప్పిని తగ్గించడానికి, కదలికలు మెరుగుపడటానికి సహాయపడుతుంది.

జాయింట్ రీప్లేస్‌మెంట్

ఇతర చికిత్సల వల్ల ఉపయోగం లేకపోతే, ఎముకల చివరలను మెత్తగా ఉంచి, రక్షించే మృదులాస్థి క్షీణించినప్పుడు జాయింట్ రీప్లేస్‌మెంట్ సర్జరీ అవసరం కావచ్చు. తుంటి, మోకాలు, భుజం కీళ్ళకు ఇది చేయవచ్చు. ఎముకలోని భాగాలను తీసివేసి, మెటల్ లేదా ప్లాస్టిక్‌తో చేసిన కృత్రిమ కీలును అమర్చుతారు. ఈ ప్రక్రియ వల్ల అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. కానీ చాలామందికి ఈ రకమైన సర్జరీ తర్వాత చాలా కాలం పాటు నొప్పి ఉంటుంది.

ముగింపు

అదండీ. తెలుసుకున్నారు కదా కీళ్ళ నొప్పుల గురించి, మల్టీవిటమిన్, బయోటిన్ collagen, కొలాజెన్ సప్లిమెంట్ల గురించి!! మరి కీళ్ళ నొప్పులను మేనేజ్ చేయడానికి జాగ్రత్తలు మొదలుపెట్టండి మరి!!

ఈ కథనం మీకు కొంత సమాచారాన్ని అందించడం కోసం మాత్రమే. ఏవైనా సప్లిమెంట్లు తీసుకొనే ముందు డాక్టర్ ని సంప్రదించడం ఎల్లప్పుడూ క్షేమదాయకం. ఆరోగ్యంగా ఉండండి!! ఆనందంగా ఉండండి!!

తదుపరి వ్యాసం