తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Bedtime Drinks | నిద్రపోయే ముందు ఈ 5 పానీయాలు తాగితే ఎన్నో అద్భుతాలు!

Bedtime Drinks | నిద్రపోయే ముందు ఈ 5 పానీయాలు తాగితే ఎన్నో అద్భుతాలు!

HT Telugu Desk HT Telugu

14 April 2022, 21:29 IST

google News
    • రాత్రి భోజనం తర్వాత వెంటనే పడుకోకూడదు.. కొంత విరామం ఇవ్వాలి. అయితే నిద్రించే ముందు కొన్ని రకాల పానీయాలు తాగితే నాణ్యమైన నిద్రతో పాటు బరువును నియంత్రించుకోవచ్చు.
Bedtime drinks
Bedtime drinks (Pixabay)

Bedtime drinks

బరువు పెరగడం సులభమే, కానీ ఆ పెరిగిన బరువును నియంత్రించుకోవాలంటే మాత్రం ఎంతో శ్రమించాల్సి ఉంటుంది. ఎన్నో రకాల రుచికరమైన ఆహార పదార్థాలను త్యాగం చేయాల్సి ఉంటుంది. మీకు ఇష్టం లేకపోయినా, కష్టమనిపించినా ఉపవాసాలు చేయాల్సి ఉంటుంది. ఒక ప్రణాళిక ప్రకారం వ్యాయామాలు చేయాలి, ఆరోగ్యకరమైన డైట్ తీసుకోవాలి. ఇవన్నీ చేయడానికి ఎంతో ఓపిక అవసరం.

వీటితో పాటు రాత్రి పూట నిద్రపోయే ముందు కొన్ని పానీయాలు స్వీకరించడం ద్వారా అధిక బరువును తగ్గించుకోవచ్చు.

మీ బతువును తగ్గించే, మీకు బాగా నిద్రపుచ్చే 5 అద్భుతమైన పానీయాల జాబితాను ఇక్కడ అందిస్తున్నాం. వీలైతే తాగిచూడండి డ్యూడ్స్.. పోయేదేముంది.. మహా 

నిద్రించే ముందు తాగాల్సిన 5 రకాల పానీయాలు

ఈ 5 పానీయాలు మీకు రోజుకో ప్రత్యామ్నాయంగా ఉంతాయి. కాబట్టి నిద్రించే ముందు ఇందులో ఏదో ఒకటి తాగితే చాలు.

గోరువెచ్చని నిమ్మరసం

గోరువెచ్చని నీటిలో నిమ్మరసం కలుపుకొని తాగటం మన తాతల కాలం నుంచి చూస్తున్నాం. ఇది అధిక బరువును నియంత్రించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. గోరువెచ్చని నిమ్మరసం జీర్ణశక్తిని పెంపొందిస్తుంది, జీవక్రియ రేటును మెరుగుపరుస్తుంది. దీంతో రాత్రి ఎక్కువగా భోజనం చేసినా కూడా.. మీరు పడుకునే ముందు రోజూ ఒక గ్లాసు ఈ లెమొనేడ్ తీసుకోవడం ఎంతో మంచింది. ఈ పానీయం శరీరంలోని మలినాలను, అవసరం లేని కొవ్వును తీసేస్తుంది, కాలేయాన్ని శుభ్రపరుస్తుంది.

దోసకాయ జ్యూస్

బరువు తగ్గించుకోవాలనుకునే వారికి దోసకాయ జ్యూస్ బెస్ట్ ఛాయిస్. ఈ దోసకాయలో నీటి శాతం ఎక్కువ ఉంటుంది, క్యాలరీలు తక్కువ ఉంటాయి. డైటరీ ఫైబర్‌ ఎక్కువ ఉంటుంది. కాబట్టి రాత్రి పడుకునే ముందు దోసకాయ జ్యూస్ తాగితే అది మీ శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుతుంది, జీవక్రియను వేగవంతం చేస్తుంది, మలినాలను తొలగిస్తుంది, కడుపు ఉబ్బరం తగ్గిస్తుంది. ఈ క్రమంలో బరువు నియంత్రణలోకి వస్తుంది. ఈ జ్యూస్ ఎండాకాలంలో మిమ్మల్ని చల్లగా కూడా ఉంచుతుంది.

గ్రీన్ టీ

బరువు తగ్గించుకునే ప్రణాళిక కలిగిన వారు కచ్చితంగా గ్రీన్ టీ తాగుతూనే ఉంటారు. అయితే ఒక అధ్యయనం ప్రకారం రాత్రిపూట గ్రీన్ టీ తాగడం వల్ల మంచి నిద్రతో పాటు అదనపు ఆరోగ్య ప్రయోజనాలుంటాయని తేలింది. అవేంటంటే గీన్ టీలో యాంటీఆక్సిడెంట్‌లు పుష్కలంగా ఉంటాయి. ఇవి కణ విచ్ఛితిని నివారిస్తాయి, జీవక్రియను మెరుగుపరుస్తాయి. తద్వారా కొవ్వును కరిగిస్తాయి.

చమోమిలే టీ

గ్రీన్ టీతో పాటుగా చమోమిలే టీ మరొక ప్రత్యామ్నాయంగా ఉంటుంది. ఇందులో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటిడిప్రెసెంట్ గుణాలు నాణ్యమైన నిద్రను ప్రోత్సహిస్తాయి. నిద్రించే ముందు తాగితే ప్రశాంతత కలుగుతుంది. ఒత్తిడి తగ్గిస్తుంది. ఒత్తిడి కూడా అధిక బరువుకు కారణమే అని తెలిసిందే కదా. అలాగే చమోమిలే టీ ఉబ్బరం, ఆయాసం లాంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

పాలు

పాలు తాగితే బరువు పెరుగుతారనే అపోహ చాలామందిలో ఉంది. కానీ వాస్తవాలు ఇందుకు భిన్నంగా ఉన్నాయి. పాలల్లో కాల్షియం ఎక్కువగా ఉంటుంది కాబట్టి అది ఎముకల దృఢత్వాన్ని పెంచుతుంది. అంతేకాకుండా పాలలోని ప్రొటీన్, జింక్, విటమిన్ బి లాంటి ఇతర ముఖ్యమైన పోషకాలు బరువు తగ్గడానికి సహాయపడతాయి. పాలు తాగడం వలన నిండుగా అనిపిస్తుంది. అతిగా తినలేరు, కాబట్టి అతిగా బరువు పెరగరు.

టాపిక్

తదుపరి వ్యాసం