IIM CAT 2022: క్యాట్ 2022 దరఖాస్తు.. దగ్గరపడుతున్న గడవు.. అప్లై చేసుకోండిలా
18 September 2022, 15:18 IST
- IIM CAT 2022 Registration:: ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ ప్రవేశాలకు సంబంధించిన కామన్ అడ్మిషన్ టెస్ట్ (CAT) 2022 దరఖాస్తు ప్రక్రియను సెప్టెంబర్ 21న ముగియనుంది. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్- iimcat.ac.in ద్వారా ఎగ్జామ్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు.
IIM CAT 2022
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (IIM Banglore) కామన్ అడ్మిషన్ టెస్ట్ (CAT) 2022 దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబర్ 21న ముగించనుందిని తెలిపింది. అభ్యర్థులు గడువు లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. అధికారిక వెబ్‌సైట్- iimcat.ac.in ద్వారా CAT 2022 కోసం దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. తాజా నోటిఫికేషన్‌లో "CAT 2022 రిజిస్ట్రేషన్ కోసం గడువు సెప్టెంబర్ 21, 5 PM వరకు పొడిగించారు.
CAT దరఖాస్తు ఫారమ్‌లో అభ్యర్థులు ప్రాధాన్యత క్రమంలో ఆరు నగరాల్లో పరీక్ష కేంద్రాన్ని ఎంచుకోవచ్చు. ఈ సారి ఇంఫాల్‌ను కూడా ఎగ్జామ్ సెంటర్ జాబితాలో చేర్చారు. సాధారణ కేటగిరీ అభ్యర్థులకు క్యాట్ దరఖాస్తు రుసుము రూ. 2,300 కాగా, రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులకు రూ. 1,150గా ఉంది.
CAT Registration 2022 : ఎలా దరఖాస్తు చేయాలి
Step 1- ముందుగా iimcat.ac.in అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లండి.
Step 2- "CAT Registration 2022" లింక్‌పై క్లిక్ చేయండి.
Step 3- మీ పేరు, చిరునామా, విద్యార్హత, ఇతర వివరాలను నమోదు చేయండి.
Step 4- దరఖాస్తు రుసుము చెల్లించి, ఫారమ్‌ను సమర్పించండి.
Step 5- డౌన్‌లోడ్ చేసి, తదుపరి సూచన కోసం ప్రింట్ అవుట్ తీసుకోండి.
స్కాన్ చేసిన 10వ తరగతి మార్క్‌షీట్- 10వ తరగతి, 12వ తరగతి మార్క్‌షీట్‌లు, బ్యాచిలర్ డిగ్రీ/మాస్టర్స్ డిగ్రీకి సంబంధించిన పత్రాలు, డిప్లొమా, పని అనుభవం, స్కాన్ చేసిన పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్‌తో పాటు డిజిటల్ సైన్‌ను అప్‌లోడ్ చేయాలి.
CAT పరీక్ష నవంబర్ 27న మూడు సెషన్లలో నిర్వహించబడుతుంది.పరీక్ష 2 గంటలు ఉంటుంది.
ప్రవేశ ప్రక్రియ గురించి తెలుసుకోండి
CAT ఫలితం విడుదలైన తర్వాత, IIMలు, ఇతర B-స్కూల్స్‌లో ప్రవేశానికి, రెండు-దశల ప్రక్రియ ఉంటుంది - (1) అనలిటికల్ రైటింగ్ టెస్ట్ (AWT), పర్సనల్ ఇంటర్వ్యూ (PI)
ముందుగా ప్రిలిమినరీ స్క్రీనింగ్ ఉంటుంది. అందులో, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ (QA), డేటా ఇంటర్‌ప్రిటేషన్, లాజికల్ రీజనింగ్ (DILR), వెర్బల్, రీడింగ్ కాంప్రహెన్షన్ (VARC) మెుత్తం మూడు విభాగాల సెక్షనల్, ఓవరాల్ పర్సంటైల్‌లో కటాఫ్‌ను క్లియర్ చేసిన అభ్యర్థి షార్ట్‌లిస్ట్ చేయబడతారు.