తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Carrot Mysore Pak: క్యారెట్ మైసూర్ పాక్ రెసిపీ, ఇలా చేస్తే అదిరిపోతుంది పిల్లలకు నచ్చే సింపుల్ స్వీట్ ఇది

Carrot Mysore pak: క్యారెట్ మైసూర్ పాక్ రెసిపీ, ఇలా చేస్తే అదిరిపోతుంది పిల్లలకు నచ్చే సింపుల్ స్వీట్ ఇది

Haritha Chappa HT Telugu

19 June 2024, 15:42 IST

google News
    • Carrot Mysorepak: ఇంట్లో సులువుగా చేసుకునే స్వీట్లలో క్యారెట్ మైసూర్ పాక్ ఒకటి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. పండగల సమయంలోనే కాదు తీపి తినాలనుకున్నప్పుడు ఇవి వండుకోండి.
క్యారెట్ మైసూర్ పాక్ రెసిపీ
క్యారెట్ మైసూర్ పాక్ రెసిపీ

క్యారెట్ మైసూర్ పాక్ రెసిపీ

Carrot Mysore pak: క్యారెట్‌తో చేసే వంటకాలు టేస్టీగా ఉంటాయి. స్వీట్లలో క్యారెట్ ను మిక్స్ చేయడం అనేది పాకశాస్త్రంలో ఎప్పటి నుంచో భాగమైపోయింది. ఇక్కడ మేము క్యారెట్ మైసూర్ పాక్ రెసిపీ ఇచ్చాము. సాధారణ మైసూర్ పాక్ కంటే క్యారెట్ మైసూర్ పాక్ చాలా స్వీట్ గా ఉంటుంది. నోట్లో పెడితేనే కరిగిపోయేలా ఉంటుంది. ఒక్కసారి ఈ స్వీట్ తిన్నారంటే మర్చిపోలేరు. మీకు ఇది నచ్చడం ఖాయం. దీన్ని చేయడం చాలా సులువు. ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకోండి.

క్యారెట్ మైసూర్ పాక్ రెసిపీకి కావాల్సిన పదార్థాలు

క్యారెట్లు - అయిదు

శెనగపిండి - అరకప్పు

నూనె - అరకప్పు

చక్కెర - అరకప్పు

నెయ్యి - అరకప్పు

నీరు - సరిపడినంత

క్యారెట్ మైసూర్ పాక్ రెసిపీ

1. క్యారెట్ లను శుభ్రంగా కడిగి పైన తొక్కను తీసేయాలి.

2. దాన్ని చిన్న తురుముగా కట్ చేసుకుని మిక్సీలో వేసి పేస్ట్ లా చేసుకోవాలి.

3. స్టవ్ మీద కళాయి పెట్టి అందులో చక్కెర, పావు కప్పు నీరు వేయాలి.

4. అందులోనే మెత్తగా చేసుకున్న క్యారెట్ పేస్టును కూడా వేసి చిన్న మంట మీద ఉడికించాలి.

5. ఇది బాగా ఉడికి తీగపాకం వచ్చినట్టు తయారవుతుంది.

6. ఆ సమయంలో శనగపిండిని వేసి బాగా కలుపుకోవాలి.

7. అలా కలుపుతూ మధ్య మధ్యలో మూడు నాలుగు సార్లు నెయ్యిని వేస్తూ కలుపుతూ ఉండాలి.

8. ఆ మిశ్రమం నురుగులాగా మారుతుంది.

9. కళాయి నుంచి అడుగంటకుండా వచ్చేస్తూ ఉంటుంది.

10. ఆ సమయంలో స్టవ్ ఆఫ్ చేయాలి.

11. ఒక ప్లేటుపై ఈ మొత్తం మిశ్రమాన్ని వేసి చల్లారనివ్వాలి.

12. తర్వాత ముక్కలుగా కట్ చేసుకుని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది.

13. ఇది చాలా రుచిగా ఉంటుంది. నోట్లో పెడితేనే కరిగిపోయేలా ఉంటుంది.

ఈ స్వీట్ ను ఫ్రిడ్జ్ లో పెట్టాల్సిన అవసరం లేదు. ఫ్రిజ్లో పెడితే గట్టిగా మారే అవకాశం ఉంది. కాబట్టి బయట ఉంచే తినడం మంచిది. సాధారణ ఉష్ణోగ్రత వద్ద ఇది రెండు మూడు రోజులు పాటు టేస్టీగా ఉంటుంది.

తదుపరి వ్యాసం