తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Thyroid: థైరాయిడ్ వల్ల పిల్లలు పుట్టడం లేదా? ఈ జాగ్రత్తలు తీసుకుంటే గర్భం దాల్చే అవకాశం

Thyroid: థైరాయిడ్ వల్ల పిల్లలు పుట్టడం లేదా? ఈ జాగ్రత్తలు తీసుకుంటే గర్భం దాల్చే అవకాశం

Haritha Chappa HT Telugu

18 February 2024, 13:47 IST

  • థైరాయిడ్ సమస్య ఎంతో మంది మహిళలను తల్లి కాకుండా అడ్డుకుంటోంది. వారి గర్భం ధరించే సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తోంది. కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా థైరాయిడ్ ఉన్నా గర్భం దాల్చవచ్చు.

థైరాయిడ్ సమస్యలు
థైరాయిడ్ సమస్యలు (Photo by cottonbro)

థైరాయిడ్ సమస్యలు

పెళ్లయిన ప్రతి స్త్రీ పిల్లల్ని కనాలని ఆశపడుతుంది. కొంతమంది వెంటనే గర్భం దాలుస్తారు. కొందరు మాత్రం థైరాయిడ్ సమస్య వల్ల గర్భం దాల్చలేకపోతారు. థైరాయిడ్ సమస్యా ఉన్నా కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా గర్భాన్ని ధరించవచ్చు.

ట్రెండింగ్ వార్తలు

Before Bed Tips : మంచి నిద్ర కోసం ముందుగా చేయాల్సినవి.. కచ్చితంగా గుర్తుంచుకోండి

Tight Belt Side Effects : ప్యాంట్ జారిపోతుందని టైట్‌గా బెల్ట్ పెడితే సమస్యలే.. వద్దండి బాబు

Green mirchi powder: ఎర్ర కారంలాగే పచ్చిమిరపకాయలను కూడా పొడిచేసి పెట్టుకోవచ్చు, వీటితో ఇగురు, కర్రీలు టేస్టీగా ఉంటాయి

Amla and Liver Health: రోజుకు రెండు ఉసిరికాయలు తినండి చాలు, మీ కాలేయానికి ఏ సమస్యా రాదు

థైరాయిడ్ గ్రంథి, మెడలో కొద్దిగా సీతాకోకచిలుక ఆకారంలో ఉండే అవయవం. మహిళల పునరుత్పత్తి ఆరోగ్యాన్ని నియంత్రించే హార్మోన్ల సమతుల్యతను రక్షించడంలో ఇది ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. థైరాయిడ్ గ్రంధి సరిగా పని చేస్తేనే గర్భం ధరించడం సులువవుతుంది. మహిళలలో థైరాయిడ్ ఆరోగ్యం వారి సంతానోత్పత్తి సామర్థ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది.

థైరాయిడ్-ఫెర్టిలిటీ కనెక్షన్

గుర్గావ్ లోని ఆరా స్పెషాలిటీ క్లినిక్ డైరెక్టర్ డాక్టర్ రీతూ సేథీ హిందూస్థాన్ టైమ్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో థైరాయిడ్ సంతానోత్పత్తిని ఎలా ప్రభావితం చేస్తుందో వివరించారు. థైరాక్సిన్ (టి 4), ట్రైయోడోథైరోనిన్ (టి 3).. అనే హార్మోన్లను థైరాయిడ్ గ్రంథి ఉత్పత్తి చేస్తుంది. ఇవి శరీరంలోని జీవక్రియలను, శక్తి ఉత్పత్తిని నియంత్రిస్తాయి. థైరాయిడ్ అతి చురుకుగా పనిచేస్తున్నా, లేక మందకొడిగా పనిచేస్తున్నా కూడా సమస్యే. హార్మోన్ల సమతుల్యత దెబ్బతింటుంది.

థైరాయిడ్ గ్రంథి

థైరాయిడ్ గ్రంధి తగినంత హార్మోన్లను ఉత్పత్తి చేయనప్పుడు హైపోథైరాయిడిజం సమస్య వస్తుంది. దీనివల్ల శరీర కార్యకలాపాలు సరిగా సాగవు. అలాగే హార్మోన్లు అధికంగా ఉత్పత్తి అయితే హైపర్ థైరాయిడిజం వస్తుంది. వీటి వల్ల రుతుచక్రం, అండోత్సర్గము, గర్భాశయ పొర పనులకు ఆటంకం కలుగుతుంది. మహిళలకు గర్భం ధరించడాన్ని కష్టతరం చేస్తుంది.

హైపర్ థైరాయిడిజం - సంతానోత్పత్తి

హైపర్ థైరాయిడిజం… థైరాయిడ్ అది చురుకుగా పనిచేయడం వల్ల వస్తుంది. దీని వల్ల నెలసరులు సరిగా రావు. అండోత్సర్గము సరిగా జరగదు. గర్భం ధరించినా కూడా గర్భస్రావం అయ్యే అవకాశం పెరుగుతుంది.

థైరాయిడ్ సంబంధిత సంతానోత్పత్తి సమస్యలను ఎదుర్కోవటానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.

1. రెగ్యులర్ థైరాయిడ్ టెస్టింగ్

గర్భం ధరించడానికి ప్రయత్నిస్తున్న మహిళలకు క్రమం తప్పకుండా థైరాయిడ్ పరీక్ష అవసరం. థైరాయిడ్ పనితీరు కాలంతో పాటూ మారుతుంది. థైరాయిడ్ సమస్యలను ముందుగానే గుర్తించడం వల్ల చికిత్స సులభం అవుతుంది.

2. సరైన థైరాయిడ్ స్థాయిలు

సంతానోత్పత్తికి తగినంత థైరాయిడ్ హార్మోన్ స్థాయిలను నిర్వహించడం చాలా ముఖ్యం. హైపోథైరాయిడిజం ఉంటే హార్మోన్ల సమతుల్యతను కాపాడుకోవాలి. ఇందుకోసం థైరాయిడ్ హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీని సిఫారసు చేస్తారు. హైపర్ థైరాయిడిజం ఉంటే థైరాయిడ్ పనితీరును మాడ్యులేట్ చేయడానికి మందులు వాడాల్సి వస్తుంది.

3. ఒత్తిడి నిర్వహణ

దీర్ఘకాలికంగా ఉన్న ఒత్తిడి వల్ల థైరాయిడ్ పనితీరు మారిపోతుంది. దీనివల్ల సంతానోత్పత్తిపై ప్రభావం పడుతుంది. ధ్యానం, యోగా వంటివి చేయడం ద్వారా ఒత్తిడిని తగ్గించుకోవాలి.

4. క్రమం తప్పకుండా వ్యాయామం

ప్రతిరోజూ వ్యాయామం చేయడం అలవాటు చేసుకోవాలి. థైరాయిడ్ ఆరోగ్యానికి, సంతానోత్పత్తికి వ్యాయామం సహాయపడుతుంది. అలా అని అధికంగా వ్యాయామం చేయకూడదు. ఇది వ్యతిరేక ప్రభావాన్ని చూపుతుంది.

5. రుతుచక్రం ట్రాకింగ్

థైరాయిడ్ సమస్యలున్న మహిళల్లో రుతుచక్రం సక్రమంగా ఉండదు. అండోత్సర్గము ఎప్పుడవుతుందో తెలుసుకునేందుకు కిట్స్ వంటి పరికరాలు దొరుకుతాయి. దాని ద్వారా అండోత్సర్గమును ట్రాక్ చేయడం చేయాలి. అప్పుడు మీరు గర్భధారణ అవకాశాలను పెంచుకోవచ్చు.

థైరాయిడ్ ఆరోగ్యం, సంతానోత్పత్తి మధ్య సంబంధాన్ని అర్థం చేసుకోవడం వల్ల మహిళలు వారి సంతానోత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకోగలరు. వీరు క్రమం తప్పకుండా థైరాయిడ్ పరీక్షలు చేయించుకోవాలి. థైరాయిడ్ ఉందని తెలిశాక తేలికగా తీసుకోకూడదు. వైద్యుడు చెప్పిన విధంగా మందులు వేసుకుని వ్యాయామాలు చేయాలి. ముఖ్యంగా అధిక బరువును తగ్గించుకోవాలి.

టాపిక్

తదుపరి వ్యాసం