మీ థైరాయిడ్ హెల్త్ కోసం తీసుకోవాల్సిన ఆహారాలు ఇవే  

pexels

By Bandaru Satyaprasad
Feb 13, 2024

Hindustan Times
Telugu

యోగర్ట్ -  ముఖ్యంగా పాల ఉత్పత్తుల్లో ఒక కప్పుకు సగటున 85 mcg అయోడిన్‌ను కలిగి ఉంటాయి. యోగర్ట్ లో మీ రోజు వారీ అవసరమయ్యే అయోడిన్ లో 50 శాతం కలిగి ఉంటుంది.  

pexels

బ్రెజిల్ నట్స్- బ్రెజిల్ నట్స్ లోని సెలీనియం థైరాయిడ్ హార్మోన్లను నియంత్రించడంలో సహాయపడతాయి. హషిమోటోస్, గ్రేవ్స్ డిసీజ్ వంటి థైరాయిడ్ సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులకు సెలీనియం ఉపశమనం కలిగిస్తుంది.  

pexels

చికెన్- జింక్ మీ థైరాయిడ్‌కు కీలక పోషకం. జింక్ తక్కువైతే హైపో థైరాయిడిజం సమస్యకు దారితీస్తుంది. చికెన్ , బీఫ్ లోని జింక్ థైరాయిడ్ ఆరోగ్యానికి సహాయపడుతుంది.    

pexels

చేపలు- సముద్రపు నీటిలోని చేపలు అయోడిన్ పోషకానికి మంచి మూలం. సముద్రానికి దూరంగా ఉన్న వారిలో గాయిటర్ సమస్యలు ఎక్కువగా ఉంటున్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి.    

pexels

షెల్ ఫిష్- పీతలు, రొయ్యల వంటి షెల్ ఫిష్ లు అయోడిన్‌కు మంచి మూలాలు. కేవలం 3 ఔన్సుల రొయ్యల్లో మీ శరీరానికి అవసరమయ్యే దాదాపు 10 శాతం అయోడిన్ ఉంటుంది.  

pexels

గుడ్లు- గుడ్డులో మీకు రోజువారీ అవసరమయ్యే అయోడిన్‌లో 16 శాతం ఉంటుంది. సెలీనియం 20 శాతం ఉంటుంది. గుడ్లను థైరాయిడ్ సూపర్‌ఫుడ్‌గా చెప్తారు.   

pexels

బెర్రీస్- థైరాయిడ్‌కు అయోడిన్, సెలీనియం, విటమిన్ డి కంటే అవసరమైన ఆహారం ఇలిక్ అని చెప్పారు. యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండే ఆహారాలు థైరాయిడ్‌కు మంచివి.  అన్ని రకాల బెర్రీస్ యాంటీఆక్సిడెంట్లతో సమృద్ధిగా ఉంటాయి.   

pexels

గ్లూటెన్, ప్రాసెస్డ్ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్ ఆహారాలకు ఎంత దూరంగా ఉండే అంత మంచింది. ఇవి థైరాయిడ్ ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయి.   

pexels

లక్ష్మీదేవికి  ఈ పూలతో పూజ చేస్తే మీ ఇంట సిరుల పంట 

pinterest