తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Smart Tv | స్మార్ట్‌ టీవీ కొంటున్నారా? ఆడియో ప్రాబ్లెమ్‌ లేకుండా చూసుకోండిలా..

Smart TV | స్మార్ట్‌ టీవీ కొంటున్నారా? ఆడియో ప్రాబ్లెమ్‌ లేకుండా చూసుకోండిలా..

28 February 2022, 17:56 IST

google News
    • Smart TV | స్మార్ట్‌ టీవీ కొన్న తరువాత చాలా మంది ఎదుర్కొనే ముఖ్యమైన సమస్య డీటీహెచ్‌ ఛానెల్స్‌లో కొన్ని ఛానెల్స్‌కు సౌండ్‌ రాకపోవడం. కొత్త టీవీలో సౌండ్‌ ఎందుకు రాదని డౌట్‌ వచ్చిందా? అయితే ఇది మీకోసమే..
ప్రతీకాత్మక చిత్రం: స్మార్ట్ టీవీ
ప్రతీకాత్మక చిత్రం: స్మార్ట్ టీవీ (Unsplash)

ప్రతీకాత్మక చిత్రం: స్మార్ట్ టీవీ

మీరు డీటీహెచ్‌ ద్వారా ఇన్నాళ్లూ టీవీ చూశారు కదా.. అందులో మీది హెచ్‌డీ డీటీహెచ్‌ అయి, హెచ్‌డీ ఛానెళ్లు సబ్‌స్క్రిప్షన్‌ చేసుకున్నారనుకోండి.

ఆయా ఛానెళ్లు అత్యాధునిక సౌండ్‌ సిస్టమ్, పిక్చర్‌ క్వాలిటీతో పనిచేస్తాయి. అయితే మీరు కొన్న ఆండ్రాయిడ్‌ ఆధారిత స్మార్ట్‌ టీవీలో ఆ సౌండ్‌ సిస్టమ్‌ ఉందా? లేదా పరిశీలించండి.

మీ స్మార్ట్‌ టీవీలో కేవలం డీటీఎస్‌ సౌండ్‌ ఆప్షన్‌ ఉందనుకుందాం. కానీ మీ హెచ్‌డీ ఛానెళ్లు డాల్బీ ప్లస్‌ టెక్నాలజీతో నడుస్తున్నాయనుకుందాం.

ఇలాంటి పరిస్థితుల్లో మీ స్మార్ట్‌ టీవీ ఆన్‌ చేశాక ఆయా హెచ్‌డీ ఛానెల్స్‌లో బొమ్మ వస్తుంది కానీ ఆడియో రాదు.

పరిష్కారం ఏంటి?

ముందుగా చెప్పుకున్నట్టుగా కంపాటబులిటీ ఉండేలా చూసుకోవాలి. మీ హెచ్‌డీ ఛానెల్స్‌ నడుస్తున్నప్పుడు మీ ప్రసుత టీవీలో ఆయా ఛానెల్‌ నెంబర్‌ పక్కన అది ఏ సౌండ్‌ సిస్టమ్‌తో పనిచేస్తుందో ఒక సింబల్ కనిపిస్తుంది.

దానికి తగ్గట్టుగా మీ కొత్త స్మార్ట్‌ టీవీలో ఆయా ఆప్షన్‌ ఉందో లేదో కొనేటప్పుడు పరిశీలించి కొనుక్కోవాలి.

ఇక రెండో ఆప్షన్‌ ఏంటంటే.. మీరు ఒకవేళ ఇవి చూడకుండా కొనుకున్నప్పుడు టీవీలో కొన్ని సెట్టింగ్స్‌ మార్చుకోవాలి. అయితే ఈ సెట్టింగ్‌లో మీరు సాధారణ సౌండ్‌ మాత్రమే వినగలరు. మీ హెచ్‌డీ ఛానెల్‌ ఒరిజినల్‌ సౌండ్‌ను వినలేరు.

సెట్టింగ్స్‌ ఎలా చేయాలంటే.. డీటీహెచ్‌ మెనూలోకి వెళ్లి సెట్టింగ్స్‌ సెలెక్ట్‌ చేసుకోవాలి. అందులో యూజర్‌ సెట్టింగ్స్‌ ఎంచుకోవాలి. దానిలో తిరిగి ఆడియో అనే ఆప్షన్‌ ఎంచుకోవాలి.

ఇక్కడ మీకు ప్రిఫర్‌డ్‌ ఆడియో ఆన్‌ హెచ్‌డీఎంఐ అన్న ఆప్షన్‌ కనిపిస్తుంది.

అందులో డాల్బీ డిజిటల్, డాల్బీ డిజిటల్‌ ప్లస్, స్టీరియో అన్న ఆప్షన్లు ఉంటాయి. డాల్బీ డిజిటల్, డాల్బీ డిజిటల్‌ ప్లస్‌ ఫీచర్లు మీ కొత్త స్మార్ట్‌ టీవీలో లేనందున.. మీరు స్టీరియో అన్న ఆప్షన్‌ ఎంచుకుంటే ఆయా హెచ్‌డీ ఛానెల్స్‌లో కూడా సౌండ్‌ వస్తుంది.

చాాలా వరకు ఈ సమస్యకు అటు డీటీహెచ్ సంస్థలు గానీ, టీవీ సర్వీస్ సెంటర్ గానీ చెప్పవు. సమస్యను ఒకరిపై మరొకరు నెట్టేసుకుంటారు. దీనిని పై టిప్స్ ఉపయోగించి మీరే సులువుగా సెట్టింగ్స్ మార్చుకుంటే సరిపోతుంది.

 

టాపిక్

తదుపరి వ్యాసం