Amazon Prime Day Sale : Lenovo ThinkPad E14 ల్యాప్‌టాప్‌పై బంపర్ ఆఫర్.. సుమారు రూ.50,000 తగ్గింపు
21 July 2022, 12:01 IST
- Amazon Prime Day Sale 2022 : అమెజాన్ ప్రైమ్ మెంబర్స్‌కి అద్భుతమైన డీల్స్ ఇస్తుంది. అమెజాన్ ప్రైమ్ డేలో భాగంగా Lenovo ThinkPad E14 ల్యాప్‌టాప్‌పై రూ. 30,940 తగ్గించింది. అంతేకాకుండా మరో 18,000 తగ్గించుకునే అవకాశం కూడా ఇస్తుంది. పూర్తి వివరాల కోసం దీనిని చదివేయండి.
Lenovo ThinkPad E14
Amazon Prime Day Sale 2022 : అమెజాన్ ప్రైమ్ డే సేల్ వస్తుందంటే చాలు.. అందరూ తమకు కావాల్సిన గాడ్జెట్లు, ఎలక్ట్రిక్ వస్తువులపై ఆఫర్లు చూసి కొనుగోలు చేస్తారు. అయితే మీరు కొత్తగా ల్యాప్‌టాప్ కొనుక్కోవాలంటే ఇదే మంచి సమయం. ఎందుకంటే అమెజాన్ Lenovo ThinkPad E14 ల్యాప్‌టాప్‌పై రూ. 30,940 తగ్గింపు ఇచ్చింది.
ఆకర్షణీయమైన ముఖభాగం, ఫీచర్లతో కూడిన ఈ ల్యాప్‌టాప్ మీకు ఉత్తమమైన ఎంపిక అవుతుంది. ఆఫీస్‌కు సంబంధించిన కార్యకలాపాలతో పాటు.. రోజువారీ పనులు చేయడంలో మీకు సహాయపడుతుంది. Lenovo ThinkPad E14 సిరీస్ ల్యాప్‌టాప్ 11వ తరం ఇంటెల్ కోర్ i3 ప్రాసెసర్‌తో వస్తుంది. ప్రస్తుతం ఇది అమెజాన్‌లో రూ. 33,759 తగ్గింపు, భారీ ఎక్స్ఛేంజ్ ఆఫర్లతో వస్తుంది.
మరో రూ.18,000 తగ్గించుకోవచ్చు
దీని అసలు ధర రూ. 1,05,900 ఉండగా.. అమెజాన్ రూ. 30,940 డిస్కౌంట్ ఇచ్చింది. డిస్కౌంట్ తీసివేయగా.. రూ. 74,960కి వస్తుంది. అంతేకాకుండా దీని మీద మరో ఆఫర్ కూడా ఉందండోయ్. అది మీకు మరో 18,000 తగ్గిస్తుంది. కొనుగోలుదారులు వారి పాత ల్యాప్‌టాప్‌ను ఎక్స్ఛేంజ్ చేస్తే.. బదులుగా మరో రూ.18,100 తగ్గింపు ఇస్తుంది. పలు కార్డులతో బుక్ చేసుకుంటే.. నో కాస్ట్ EMIని అందుబాటులో ఉంచింది.
Lenovo ThinkPad E14 విశేషాలు..
ల్యాప్‌టాప్ పూర్తి-HD LCD స్క్రీన్‌ను అందిస్తుంది. Lenovo థింక్‌ప్యాడ్ E14 (20TAS18U00) ఎర్గోనామిక్, తేలికపాటి డిజైన్‌ను కలిగి ఉంది. ఇది అల్యూమినియం ఛాసిస్, సన్నని బెజెల్స్, బ్యాక్‌లిట్ కీబోర్డ్, HD వెబ్‌క్యామ్, పవర్ బటన్-ఎంబెడెడ్ ఫింగర్ ప్రింట్ రీడర్‌ను కలిగి ఉంది.
పరికరం 14.0-అంగుళాల పూర్తి-HD (1080x1920 పిక్సెల్‌లు) LCD డిస్‌ప్లే, ఇంటెల్ UHD గ్రాఫిక్‌లతో గ్రాఫికల్ అవుట్‌పుట్‌ను పెంచడానికి డైరెక్ట్‌ఎక్స్ 12కి మద్దతునిస్తుంది. ఇది డాల్బీ ఆడియోకు మద్దతు ఇచ్చే హర్మాన్ స్పీకర్లను కూడా కలిగి ఉంది. అంతేకాకుండా ఇది బహుళ స్లాట్‌లను కలిగి ఉంది.
Lenovo ThinkPad E14 (20TAS18U00) ఒక USB 2.0 పోర్ట్, ఒక USB 3.2 పోర్ట్, ఒక థండర్ బోల్ట్ 4 స్లాట్, ఒక USB4 పోర్ట్, ఒక HDMI పోర్ట్, ఒక ఈథర్నెట్ పోర్ట్, 3.5mm హెడ్‌ఫోన్ జాక్‌ను అందిస్తుంది. వైర్‌లెస్ కనెక్టివిటీ కోసం, ఇది Wi-Fi 6, బ్లూటూత్ 5.2కి మద్దతు ఇస్తుంది.
Lenovo ThinkPad E14 (20TAS18U00) 11వ తరం ఇంటెల్ కోర్ i3-1115G4 ప్రాసెసర్‌తో ఆధారితం. 4GB RAM, 256GB SSDతో వస్తుంది. ల్యాప్‌టాప్ విండోస్ 11 హోమ్‌తో ముందే లోడ్ చేసి ఉంటుంది. మీ డేటాను గుప్తీకరించి, సురక్షితంగా ఉంచడానికి ఇది TPM 2.0 చిప్‌ను కలిగి ఉంది. పరికరం 45Wh బ్యాటరీని కలిగి ఉంది. ఇది ఒక్కో ఛార్జీకి 11.9 గంటల వినియోగాన్ని అందించగలదు.
టాపిక్