రూ. 20 వేల బడ్జెట్‌లో iQOO Z6 5G స్మార్ట్‌ఫోన్!
16 March 2022, 18:00 IST
- బడ్జెట్ ధరలో 5G స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకునే వారికి రూ. 15 నుంచి 18 వేల ధరల్లో iQOO మొబైల్స్ విడుదలయ్యాయి.
iQOO Z6 5G
చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీదారు iQ ఈరోజు తమ బ్రాండ్ నుంచి సరికొత్త iQOO Z6 5G స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. రూ. 15 వేల నుంచి 20 వేల బడ్జెట్ మీదైతే ఈ 5G స్మార్ట్‌ఫోన్ మీ ఎక్స్‌పెక్టేషన్లకు సరిపోతుంది. వివిధ వేరియంట్లలో విడుదలైన ఈ స్మార్ట్‌ఫోన్ లోని స్పెసిఫికేషన్లు, ఫీచర్లు ఎలా ఉన్నాయో ఇక్కడ వివరించాం.
Moto G71 అలాగే Redmi Note 11 Pro Plus స్మార్ట్‌ఫోన్లలో ఉన్నట్లుగానే ఈ iQOO Z6 5G స్మార్ట్‌ఫోన్ కూడా స్నాప్‌డ్రాగన్ 695 SoC ప్రాసెసర్ మీద పనిచేస్తుంది. అయితే ఈ స్మార్ట్‌ఫోన్ వేడెక్కకుండా ఇందులో 5-పొరల లిక్విడ్ కూలింగ్ వ్యవస్థను కలిగి ఉండటం విశేషం.
iQOO Z6 5Gని మూడు స్టోరేజ్ ఆప్షన్లలో లభిస్తుంది. 4GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.15,499 కాగా, 6GB + 128GB స్టోరేజ్ వేరియంట్ రూ. 16,999. అలాగే 8GB + 128GB వేరియంట్ ధర రూ.17,999గా నిర్ణయించారు. ఈ స్మార్ట్‌ఫోన్‌ను ఇండియాలో మార్చి 22 నుండి అమెజాన్ ఇండియా ద్వారా విక్రయించనున్నట్లు కంపెనీ తెలిపింది. లాంచింగ్ ఆఫర్‌లలో భాగంగా, HDFC బ్యాంక్ కార్డ్ ఉన్న కస్టమర్‌లు iQOO Z6 5G కొనుగోలుపై రూ. 2,000 డిస్కౌంట్ పొందవచ్చు. iQOO Z6 5G డైనమో బ్లాక్, క్రోమాటిక్ బ్లూ రెండు రంగుల్లో లభిస్తుంది.
QOO Z6 5G స్పెసిఫికేషన్స్
120Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 6.58-అంగుళాల ఫుల్ HD+ IPS LCD స్క్రీన్
స్నాప్‌డ్రాగన్ 695 చిప్‌సెట్
Funtouch OS 12 ఆధారిత ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్
వెనకవైపు 50 మెగాపిక్సెల్ కెమెరా
18W ఛార్జర్‌తో పాటు 5,000mAh బ్యాటరీ
వీటితో పాటు సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ స్కానర్, దిగువన హెడ్‌ఫోన్ జాక్ తదితర ఫీచర్లు కలిగి ఉంది.