షావోమి నుంచి 12 సిరీస్‌లో మూడు స్మార్ట్‌ఫోన్లు విడుదల
16 March 2022, 14:45 IST
- షావోమి ప్రపంచవ్యాప్తంగా Xiaomi 12, Xiaomi 12 Pro, Xiaomi 12X అనే మూడు స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేసింది. వివిధ వేరియంట్లను బట్టి ధరలు ఉన్నాయి.
Xiaomi 12 Series
చైనీస్ పాపులర్ మొబైల్ తయారీదారు షావోమి ప్రపంచవ్యాప్తంగా Xiaomi 12, Xiaomi 12 Pro, Xiaomi 12X అనే మూడు స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేసింది. ఇందులో మొదటి రెండు స్మార్ట్‌ఫోన్‌లు అధునాతనమైన Qualcomm స్నాప్‌డ్రాగన్ 8 Gen ప్రాసెసర్ తో పనిచేస్తాయి. డిజైన్ పరంగా ఈ రెండు ఫోన్‌లు ఒకేలా కనిపిస్తాయి, అయితే ప్రో మోడల్ మరింత అధునాతన కెమెరా, డిస్‌ప్లే ఫీచర్‌లను కలిగి ఉంది.
12 సిరీస్‌లోనే Xiaomi 12X అనే మరో వేరియంట్‌ను కూడా కంపెనీ విడుదల చేసింది. ఇది స్నాప్‌డ్రాగన్ 870 SoC ప్రాసెసర్ తో పనిచేస్తుంది.
Xiaomi 12 Pro ర్యామ్, స్టోరేజ్ ఆధారంగా రెండు వేరియంట్‌లలో లభిస్తుంది. 8GB RAM + 256GB స్టోరేజ్ అలాగే 12GB RAM +256GB స్టోరేజ్. వీటి ధరలు సుమారు రూ. 76,300 నుంచి ప్రారంభమవుతున్నాయి.
Xiaomi 12 మూడు వేరియంట్‌లలో లభించనుంది. 8GB RAM + 128GB స్టోరేజ్, 8GB RAM + 256GB స్టోరేజ్, అలాగే 12GB RAM + 256GB స్టోరేజ్ లుగా ఉన్నాయి. ధరలు రూ. 57,200 నుంచి ప్రారంభమవుతున్నాయి.
చివరగా, Xiaomi 12X రెండు వేరియంట్‌లలో వస్తుంది. 8GB RAM +128GB స్టోరేజ్ , 8GB RAM + 256GB స్టోరేజ్. దీని ధర రూ. 49,600 నుంచి ప్రారంభమవుతున్నాయి.
ఇందులో Xiaomi 12 Pro స్మార్ట్‌ఫోన్ విషయానికి వస్తే.. ఇది 120W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో కేవలం 18 నిమిషాల్లోనే ఫుల్ ఛార్జ్ అవుతుందని Xiaomi పేర్కొంది. షావోమి నుంచి 120W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వచ్చిన తొలి స్మార్ట్‌ఫోన్ ఇదే కావడం మరో విశేషం.
Xiaomi 12 , 12X స్మార్ట్‌ఫోన్‌లు 6.28-అంగుళాల ఫుల్-HD+ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉండగా, Xiaomi 12 Pro 6.73-అంగుళాల LTPO AMOLED డిస్‌ప్లేతో వచ్చింది.
ఇదిలా ఉంటే ఈ మూడు స్మార్ట్‌ఫోన్‌లు భారత మార్కెట్లో ఎప్పట్నించి లభ్యమవుతాయనే వివరాలపై కంపెనీ స్పష్టతనివ్వలేదు.