తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Parenting Twins: కవల పిల్లల పెంపకంలో మెళకువలు!

parenting twins: కవల పిల్లల పెంపకంలో మెళకువలు!

HT Telugu Desk HT Telugu

12 June 2022, 22:59 IST

google News
    • పిల్లల పెంచడం అంటే మాటలు కాదు. వారిని చిన్నప్పుడు నుండి జాగ్రత్తగా చూసుకుంటేనే క్రమశిక్షణ గల పిల్లలుగా ఎదుగుతారు. ముఖ్యంగా చిన్న పిల్లలను చూసుకోవడం చాలా కష్టమైన పని.  ఒకరు ఉంటేనే చాలా ఇబ్బందంటే అదే కవలలైతే ఎలా.. 
twins
twins

twins

పేరెంటింగ్ అనేది మన జీవితంలో చాలా భిన్నమైన అనుభవాలలో ఒకటి. చిన్న పిల్లల సంరక్షణ చాలా ఛాలెంజింగ్‌తో కూడుకున్నది. సాధరణంగా మెుదటి బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత కొంత కాలం వేచి చూసి మరో బిడ్డ కోసం ప్లాన్ చేసుకుంటారు. లయితే అకుకోకుండా ఓకే సారి కవలలకు జన్మనిస్తే వారి చూసుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. ఇది రెండింతలు శ్రమతో కూడుకున్న పని. అయితే కవలలను పెంచడానికి తల్లిదండ్రులు కొన్ని చిట్కాలను ఫాలో అవ్వడం ద్వారా ఈజీగా వారికి చూసుకోవచ్చు.

టైం టెబుల్ సెటప్ చేయండి

ప్రెగ్నెన్సీ నుండి ప్రీస్కూల్ వరకు కవలలను కొన్ని రొటీన్‌ పనులను అలవాటు చేయండి. ఇలా చేయడం వల్ల సమయానికి అనుగుణంగా చేసే పనులకు ప్రిపేర్ అవుతారు.

రాత్రి సమయంలో పిల్లలు నిద్ర పోయేలా చేయడం, సరైన భోజనం.. ఇలా అన్నింటికి ఒక టైంను సెట్ చేయడం.తద్వారా పిల్లలు పెద్దయ్యాక ఒక షెడ్యూల్‌ను అనుసరిస్తారు.

 

2) నాణ్యమైన సమయాన్ని సెటప్ చేసుకోండి

పిల్లలిద్దరితో నాణ్యమైన సమయాన్ని గడపండి. మీరు కూడా పిల్లలతో కొన్ని ఆటలు ఆడండి లేదా వారికి కబుర్లు చెబుతూ ఉండండి. పిల్లలకు పుస్తకాలు చదివే అలవాటు చేయండి. వారితో ఎక్కువ సమయం గడపడం వల్ల మీరు చెప్పేది వినే అవకాశం ఉంటుంది.

: 3) కవలలను పోల్చడానికి ముందు ఆలోచించండి

కవలలను పోల్చడం సరికాదు.చిన్నపిల్లలు వారికే ఏం చేయాలో తెలియదు. మీరు వారిని పోల్చినప్పుడు పిల్లలను సులభంగా నిరుత్సాహపడుతారు. ఈ ధోరణి వల్ల అన్యోన్యత తగ్గుతుంది.

4) ఇతర కవల తల్లిదండ్రులతో కనెక్ట్ అవ్వండి

నవజాత కవలలను పెంచడంపై కవలలను కలిగి ఉన్న తల్లిదండ్రుల అనుభవాలను పంచుకోండి. దీంతో మీ పిల్లలను పెంచడం సులభమవుతుంది

5) తల్లిదండ్రుల సహాయం నుండి సహాయం పొందండి

పిల్లలను పెంచే విషయంలో మీరు మీ స్నేహితులు, కుటుంబ సభ్యులు లేదా పొరుగువారిని కూడా సహాయం కోసం అడగవచ్చు.ఇలా చేయడం వల్ల మీకు కొంత టైం లభిస్తోంది

తదుపరి వ్యాసం