తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Soya Upma : అల్పాహారంగా సోయా ఉప్మా.. హెల్తీ కూడా..

Soya Upma : అల్పాహారంగా సోయా ఉప్మా.. హెల్తీ కూడా..

HT Telugu Desk HT Telugu

19 March 2023, 6:30 IST

google News
    • Soya Upma : ప్రతి రోజూ ఉదయం బ్రేక్ ఫాస్ట్ తప్పకుండా చేయాలి. లేదంటే అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. ప్రోటీన్ ఫుడ్ తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది.
సోయా ఉప్మా
సోయా ఉప్మా

సోయా ఉప్మా

ఉదయం అల్పాహారం కచ్చితంగా తీసుకోవాలి. లేదంటే అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. దీనిప్రభావం రోజంతా ఉంటుంది. ప్రోటీన్ అధికంగా ఉండే.. ఆహారం ఉదయం తీసుకుంటే బెటర్. అందుకే తప్పనిసరిగా బ్రేక్ ఫాస్ట్ లోకి సోయా ఉప్మాను తీసుకోవాలి. ఇందులో ప్రోటీన్ సమృద్ధిగా ఉంటుంది. శరీరాన్ని ఫిట్ గా ఉంచడంలో సహాయపడుతుంది. ఎలా తయారు చేయాలో ఇక్కడ తెలుసుకోండి.

మూడు నుంచి 4 కప్పుల సోయా గింజలు లేదా సోయా పొడి తీసుకోండి. ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక టేబుల్ స్పూన్ ఉసిరి పప్పు, టేబుల్ స్పూన్ నూనె, కప్పు తరిగిన ఉల్లిపాయ, టీస్పూన్ అల్లం, పచ్చి మిర్చి పేస్ట్, అర కప్పు తురిమిన క్యారెట్, మెత్తగా తరిగిన కప్పు క్యాబేజీ, ఒక టీస్పూన్ నిమ్మరసం, ఉప్పు రుచికి తగినంత, 1/2 కప్పు తరిగిన కొత్తిమీర ఆకులు తీసుకోవల్సి ఉంటుంది.

సోయా ఉప్మా చేసేందుకు సోయాబీన్ పౌడర్ లేదా సోయా గింజలను వేడి నీటిలో 15 నిమిషాలు నానబెట్టాలి. దీని తరువాత దాన్ని పిండి పక్కన పెట్టుకోవాలి. నీటిని పారవేయండి. ఇప్పుడు గ్యాస్ మీద పాన్ పెట్టి నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడిగా ఉన్నప్పుడు జీలకర్ర వేసి మినప పప్పు జోడించుకోవాలి. రంగు మారిన తర్వాత దానికి అల్లం, పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవాలి.

తరిగిన ఉల్లిపాయను వేసి లేత గోధుమ రంగు వచ్చేవరకు వేయించుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు క్యాబేజీ, క్యారెట్లు వేసి తక్కువ మంట మీద రెండు మూడు నిమిషాలు ఉడికించుకోవాలి. తర్వాత సోయా పౌడర్ లేదా గింజలను వేసి బాగా కలపాలి.

ఇప్పుడు రుచి కోసం నిమ్మరసం, ఉప్పు వేసుకోవాలి. అన్ని పదార్థాలను బాగా కలుపుకోవాలి. సుమారు రెండు నిమిషాలు ఉడికించుకోవాలి. తర్వాత.. పచ్చి కొత్తిమీరతో అలంకరించుకోండి. వేడి సోయా ఉప్మా తయారీ అయినట్టే. వేడి వేడిగా తినండి. అందులో కరివేపాకులు, ఆవాలు కూడా వేసుకోవచ్చు. సోయా ఉప్మా రుచితోపాటు ఆరోగ్యానికి కూడా మంచిది.

టాపిక్

తదుపరి వ్యాసం