తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Pizza Dosa : అల్పాహారంలోకి యమ్మీ.. యమ్మీగా పిజ్జా దోసె చేసేయండి

Pizza Dosa : అల్పాహారంలోకి యమ్మీ.. యమ్మీగా పిజ్జా దోసె చేసేయండి

HT Telugu Desk HT Telugu

24 April 2023, 6:30 IST

google News
    • Pizza Dosa Breakfast : చాలా మందికి దోసెలు తినడం అంటే ఇష్టం. ఒకటి తినేసి.. అమ్మా.. ఇంకోటి అని ప్లేటు పట్టుకొని వెళ్తారు. అలాంటి వారు కొత్తగా పిజ్జా దోసె ట్రై చేయండి. ఇది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు.
ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

మీ పిల్లలు తరచుగా పిజ్జా అడుగుతారా? సాధారణంగా పిజ్జా రుచికరమైన ఆహారం అయినప్పటికీ, అనారోగ్యకరమైనది కూడా. మీరు పిజ్జాను ఇంట్లోనే ఆరోగ్యకరమైన రీతిలో తయారు చేసుకోవచ్చు. దోసె పిండితో ఇంట్లో ఆరోగ్యకరమైన పిజ్జాని రెడీ చేసుకోవచ్చు. ఈ పిజ్జా దోసె శరీరానికి ఆరోగ్యకరమైనది, పిల్లలు దీన్ని ఇష్టపడతారు. పిజ్జా దోస ఎలా చేయాలో తెలుసుకోవాలనుకుంటున్నారా? మీకోసం కింద తయారీ విధానం ఇచ్చాం.

కావాల్సిన పదార్థాలు

దోస పిండి - 1 కప్పు, మిరపకాయలు - 1/4 కప్పు (పొడవు ముక్కలుగా తరిగినవి), ఉల్లిపాయ - 2 టేబుల్ స్పూన్లు (సన్నగా తరిగినవి), ఉడికించిన స్వీట్ కార్న్ - 1/4 కప్పు, పిజ్జా సాస్ - 2 టేబుల్ స్పూన్లు, చీజ్ - 1/4 కప్పు (తురిమినది), నూనె - 2 టేబుల్ స్పూన్లు, చిల్లీ ఫ్లేక్స్ - 1 చిటికెడు,

ముందుగా స్టౌవ్ మీద ఓ గిన్నె పెట్టి అందులో ఒక టీస్పూన్ నూనె పోసి వేడయ్యాక అందులో ఉల్లిపాయ, మిరియాలపొడి వేసి 2 నిమిషాలు వేయించాలి. తర్వాత తర్వాత మరోవైపు దోసె పాన్ పెట్టి.. వేడిచేసిన తర్వాత దాని మీద దోసె వెసుకోవాలి. దాని చుట్టూ నూనె పోసి మూతపెట్టి తక్కువ మంటపై కాసేపు ఉడికించాలి.

తర్వాత దోసె పైన 1 టేబుల్‌స్పూను పిజ్జా సాస్‌ను పరచి, దాని పైన ఉల్లిపాయలు, మిరపకాయలు, స్వీట్ కార్న్ చల్లి, చివరగా తురిమిన చీజ్‌ను స్ప్రెడ్ చేసి ఒక నిమిషం పాటు మూతపెట్టాలి. పన్నీర్ కరిగిపోయేలా మరిగించాలి. తర్వాత మూత తెరిచి, ప్లేటులో దోసె ఉంచి, పైన చిల్లీ ఫ్లేక్స్, ఒరేగానో చల్లితే, పిజ్జా దోస రెడీ.

పిజ్జా దోస అనేది ఉదయం అల్పాహారంగా తీసుకోవచ్చు. లేదంటే.. పాఠశాల నుండి ఆకలితో తిరిగి వచ్చే పిల్లలకు సులభమైన, అద్భుతమైన చిరుతిండి. పిజ్జా దోస అనేది సాస్, చీజ్ వేసి తయారుచేసే ఒక హోమ్లీ, టేస్టీ డిష్. ఆరోగ్యకరమైనది. తక్కువ ఖర్చుతో కూడినది. ఇంట్లోనే ఇది తయారుచేసుకోవచ్చు. పిల్లలు కూడా పిజ్జా అంటూ ఎంజాయ్ చేస్తూ తింటారు.

తదుపరి వ్యాసం