తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Rain Proof Home: బాల్కనీలు, కిటికీల్లోంచి వర్షం నీళ్లు ఇంట్లోకి వస్తున్నాయా? బెస్ట్ సొల్యూషన్స్ ఇవే..

Rain proof home: బాల్కనీలు, కిటికీల్లోంచి వర్షం నీళ్లు ఇంట్లోకి వస్తున్నాయా? బెస్ట్ సొల్యూషన్స్ ఇవే..

25 June 2024, 12:30 IST

google News
  • Rain proof home: వర్షాకాలంలో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా బాల్కనీలో నీళ్లు వచ్చి ఇబ్బంది పెడుతుంటాయి. అలాకాకుండా కొన్ని సులభమైన పద్దతులతో నీళ్లు రాకుండా చేయొచ్చు. అవేంటో చూసేయండి..

వర్షం నీళ్లు రాకుండా పరిష్కారాలు
వర్షం నీళ్లు రాకుండా పరిష్కారాలు (pinterest)

వర్షం నీళ్లు రాకుండా పరిష్కారాలు

వర్షాకాలం వస్తోందంటే నీళ్లు ఇంట్లోకి వచ్చే సమస్య మొదలవుతుంది. ముఖ్యంగా అపార్ట్‌మెంట్ బాల్కనీలలో నుంచి నీళ్లు లోపలికి వచ్చి ఇబ్బందిగా ఉంటుంది. ఇళ్లలో కూడా కిటికీల నుంచి నీళ్ల లీకేజీ మొదలవుతుంది. వీటన్నింటికీ చాలా ట్రెండీ పరిష్కారాలున్నాయి. వాటివల్ల ఇంటి లుక్ మారిపోతుంది. నీళ్లు లోపలికి రావు. అవేంటో చూడండి.

1. బ్యాంబూ బ్లైండ్స్:

ఇవి వర్షం నీళ్ల నుంచి పూర్తిగా రక్షణ ఇవ్వకపోవచ్చు. కానీ కొంతవరకూ నీళ్లు రాకుండా ఆపగలవు. బయట వైపు వాటర్ ప్రూఫ్ కోటింగ్ ఉన్న బ్యాంబూ బ్లైండ్స్ వాడితే ఫలితం ఉండొచ్చు. వీటివల్ల మీ బాల్కనీకి కొత్త లుక్ కూడా వస్తుంది. వీటిని అవసరం లేనప్పుడు పైకి చేసుకునే వీలుంటుంది కూడా. అలాగే ఎండాకాలంలో కూడా వేడిని తగ్గిస్తాయివి.

2. రెయిన్ కర్టెన్లు:

పీవీసీతో చేసిన రెయిన్ కర్టెన్లు వర్షం నుంచి పూర్తి రక్షణ ఇస్తాయి. వీటిని బాల్కనీకే కాకుండా టెర్రాస్, కిటికీలు,వరండాలకు కూడా నీళ్లు రాకుండా అడ్డుగా వాడుకోవచ్చు. చూడ్డానికి కూడా ఆకర్షణీయంగా ఉండి, ఇంటికి మంచి లుక్ ఇస్తాయి.

3. గ్లాస్ స్క్రీన్స్:

ఈ గ్లాస్ స్క్రీన్స్ ఏర్పాటు చేసుకోవడం కాస్త ఖర్చుతో కూడుకన్న పనే. కానీ ఒక్కసారి ఖర్చు పెడితే వర్షం నుంచి ఏ ఇబ్బందీ ఉండదు. అలాగే చూడ్డానికి ట్రెండీగా ఉంటుంది. అలాగే ఇవి పారదర్శకంగా ఉంటాయి కాబట్టి లోపలికి వెలుతురు చక్కగా వస్తుంది. చీకటిగా అనిపించదు.బయటి పరిసరాలు కూడా కనిపిస్తాయి.

4. వాటర్ ప్రూఫ్ ఫ్యాబ్రిక్స్:

నీళ్లను పీల్చుకోకుండా, వాటిమీద వర్షం నీళ్లు పడ్డప్పుడు కిందికి జారిపోయేలా చేస్తాయీ వాటర్ ప్రూఫ్ ఫ్యాబ్రిక్స్. ఎన్ని నీళ్లు పడ్డా వీటికి నాచు చేరే అవకాశం ఉండదు. ఈ వాటర్ ప్రూఫ్ ఫ్యాబ్రిక్స్ తో బాల్కనీలో అడ్డుగా ఏర్పాటు చేసుకుంటే చాలా వరకు నీరు లోపలికి రాకుండా అడ్డుకుంటాయి. అయితే వీటివల్ల పూర్తిగా నీళ్లు పడకుండా ఆపలేం.

5. రూఫ్ కవర్:

రూఫ్ కవర్ ఏర్పాటు మనం సొంతంగా చేసుకోలేం. దీనికోసం ప్రొఫెషనల్స్ సహాయం తప్పనిసరి. పై భాగంలో కాస్త పొడవుగా, నీళ్లు బయట పడేలా రూఫ్ కవర్ ఏర్పాటు చేసుకోవాలి. ఇది పీవీసీ మెటీరియల్ తో తయారీ చేస్తారు. వీటిలోనే పారదర్శకంగా ఉండే పీవీసీతో పైకప్పు పెట్టుకుంటే మరింత కొత్త లుక్ ఇస్తుంది.

మీ బాల్కనీకి ఎలాంటి పద్ధతిలో నీళ్లు రాకుండా ఏర్పాటు చేసుకోవాలో నిర్ణయించుకునే ముందు కొన్ని విషయాలు పరిగణలోకి తీసుకోవాలి. ముందుగా మీ బాల్కనీ ఎత్తూ, వెడల్పు, పొడవులకు సంబంధించిన కొలతలు తీసి పెట్టుకుంటే మంచిది. దాన్ని బట్టి మీకయ్యే ఖర్చు, ఎలాంటి పద్ధతి ఎంచుకుంటే మేలు అని అవగాహన వస్తుంది.అలాగే ఎక్కువ కాలం మన్నిక ఉండేలా మంచి నాణ్యత ఉన్న మెటీరియల్స్ ఎంచుకోవడం ఉత్తమం.

తదుపరి వ్యాసం