తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Retirement | రిటైరవుతున్నారా? ఈ అలవాట్లతో మెరుగైన జీవితం..

Retirement | రిటైరవుతున్నారా? ఈ అలవాట్లతో మెరుగైన జీవితం..

30 January 2022, 18:31 IST

    • రిటైర్మెంట్‌కు దగ్గరలో ఉన్నా, రిటైరవబోతున్నా, ఇప్పటికే రిటైర్ అయిన వారి జీవితం మెరుగ్గా ఉండేందుకు అనుసరించాల్సిన కొన్ని అలవాట్లను ఈ కథనంలో తెలుసుకుందాం. ఇప్పుడున్న కాలంలో ఉద్యోగం నుంచి ఎప్పుడెప్పుడు బయటపడదామా? అని ఆలోచించే వాళ్లే ఎక్కువ. అయితే ఉద్యగో విరమణ అనంతరం సమయం గడవక ఇబ్బంది పడే వారూ ఉన్నారు.
రిటైర్మెంట్ తరువాత మెరుగైన జీవనశైలి
రిటైర్మెంట్ తరువాత మెరుగైన జీవనశైలి (unsplash)

రిటైర్మెంట్ తరువాత మెరుగైన జీవనశైలి

పుస్తక పఠనం:

వృత్తి, ఉద్యోగంలోనే మీ జీవితం అంతా గడిచిపోయింది కదా. ప్రపంచం గురించి తెలుసుకునే అవకాశం మీకు ఇప్పుడు లభిస్తుంది. చరిత్ర, సంస్కృతి, సంఘటనలు, జీవిత చరిత్రలు, సామాజిక అంశాలు, వ్యక్తిత్వ వికాసం, స్టార్టప్ విశేషాలు.. ఇలా ఏవైనా కావొచ్చు.. ఆయా నిజజీవిత కథలు, వాస్తవాలు, దృక్పథాలు తెలుసుకోవడం పుస్తకాలతోనే సాధ్యం. మీకు ఆసక్తి కలిగించే రంగాన్ని ఎంచుకుని, ప్రశాంతతను ఇచ్చే పుస్తకాలను వెతుక్కొని చదవడం మొదలు పెట్టండి. పుస్తక పఠనం ఇబ్బంది అనుకుంటే ఇప్పుడు పుస్తకాలను వినే వెసులుబాటు కూడా వచ్చింది. ఆడిబుల్ తదితర సాధనాల ద్వారా పుస్తకాల్లో రాసింది వినవచ్చు. అయితే వినేందుకు తెలుగు పుస్తకాలు అందుబాటులో లేవు.

ట్రెండింగ్ వార్తలు

Before Bed Tips : మంచి నిద్ర కోసం ముందుగా చేయాల్సినవి.. కచ్చితంగా గుర్తుంచుకోండి

Tight Belt Side Effects : ప్యాంట్ జారిపోతుందని టైట్‌గా బెల్ట్ పెడితే సమస్యలే.. వద్దండి బాబు

Green mirchi powder: ఎర్ర కారంలాగే పచ్చిమిరపకాయలను కూడా పొడిచేసి పెట్టుకోవచ్చు, వీటితో ఇగురు, కర్రీలు టేస్టీగా ఉంటాయి

Amla and Liver Health: రోజుకు రెండు ఉసిరికాయలు తినండి చాలు, మీ కాలేయానికి ఏ సమస్యా రాదు

మూవీస్, డాక్యుమెంటరీస్:

మీరు చూడాలనుకున్న, తెలుసుకోవాలనుకున్న అంశాలు ఎన్నో అలాగే పెండింగ్‌లో ఉండిపోయి ఉంటాయి. మీ ఉద్యోగ, వృత్తి జీవితం అంత బిజీగా ఉండొచ్చు. అందువల్ల పదవీ విరమణ అనంతరం ఇష్టమైన మూవీస్, డాక్యుమెంటరీస్, వెబ్ సిరీస్ చూడొచ్చు. వందలాది డాక్యుమెంటరీ మూవీస్ ఫ్రీగా కూడా చూడొచ్చు. అలాగే అనేక ఓటీటీల్లో ఫ్రీ మూవీస్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఒకవేళ మీరు ఓటీటీలకు చందా వెచ్చించగలిగితే అనేక కేటగిరీల్లో వేలాది సినిమాలు అందుబాటులో ఉన్నాయి. ఏవి చూడాలన్న గందరగోళం అసలే వద్దు. మీ అభిరుచిని బట్టి మీకు సిఫారసు చేయడానికి ఓటీటీ ప్లే వంటి యాప్‌లు కూడా అందుబాటులోకి వచ్చాయి.

ట్రావెల్:

ట్రావెలింగ్ అందరికీ ఇష్టమే. కానీ ఉద్యోగ జీవితంలో మీకు సెలవులు దొరకడం కష్టమే. అత్యవసర సమయాల్లో సెలవులు దొరకడం కూడా గగనమే. అలాంటిది ప్రయాణాలకు దొరకడం ఇంకా కష్టమే. అందుకే రిటైర్మెంట్ అనంతరం మీరు మీకు నచ్చిన ప్రదేశాలను సందర్శించవచ్చు. భారతీయ రైల్వేల్లో సీనియర్ సిటిజెన్లకు టికెట్‌పై రాయితీ కూడా ఉంది. మీరు ఎప్పటి నుంచో సందర్శించాలనుకున్న ప్రదేశాలను ఎంచుకుని సరిగ్గా ప్లాన్ చేసుకొని రెండు మూడు నెలలకో టూర్ ప్లాన్ చేయండి.

గార్డెనింగ్

ప్రస్తుత జీవనశైలిలో కల్తీలు, పురుగు మందుల బారిన పడి సరైన జీవితాన్ని అనుభవించడం లేదన్న ఫీలింగ్ అందరిలోనూ ఉంది. అందువల్ల ఆర్గానిక్ పద్ధతుల్లో కూరగాయలు పండించుకోవడం, పూల మొక్కలు పెంచడం వంటివాటిపై దృష్టి పెట్టండి. ప్రకృతిలో జీవిస్తే మీ మనసు చాలా ఆహ్లాదకరంగా మారుతుంది.

పెట్ యానిమల్స్

చిన్నప్పటి నుంచి ఒక కుక్క పిల్లను పెంచుకోవాలనో, ఆవును పెంచుకోవాలనో ఆశ చాలా మందిలో ఉంటుంది. కానీ బిజీ ప్రపంచంలో అది సాధ్యపడి ఉండకపోవచ్చు. పెంపుడు జంతువులతో స్నేహం కచ్చితంగా మీ జీవనశైలిని మెరుగుపరుస్తుంది.

పుస్తక రచన

మీ వృత్తిపరమైన, ఉద్యోగపరమైన అనుభవాలతో పుస్తక రచన చేయొచ్చు. మీ అనుభవాలు ఆయా రంగాల్లోని వారికి ఉపయోగపడవచ్చు. పుస్తక రచన ఇప్పుడు చాలా సులువు. డిజిటల్ ఫార్మాట్‌లో ప్రచురణ చాలా సులువైన పని. అమెజాన్ వంటి సైట్లలో ప్రచురణ ద్వారా ఆదాయం కూడా పొందవచ్చు. ఫ్రీలాన్సర్‌గా కూడా పనిచేయొచ్చు.

ఆన్‌లైన్ బోధన

మీరు చాలా అనుభవాన్ని గడించి ఉంటారు కదా.. మీ అనుభవాన్ని ఇతరులతో పంచుకోవాలన్న ఆసక్తి ఉంటే ఆన్‌లైన్‌లో బోధించవచ్చు. యూట్యూబ్ వంటి సాధనాలతో ఇది సులువు. యూట్యూబ్ ఇచ్చే వ్యాపార ప్రకటనల ద్వారా ఆదాయం కూడా ఆర్జించవచ్చు. అలాగే మీరు చందాదారుల నుంచి కొంత రుసుము కూడా వసూలు చేయవచ్చు.

చిరు వ్యాపారాలు

డబ్బు ఆర్జించగలిగే వ్యాపకాలు చాలా ఉంటాయి. అవి మన మనసును మరింత ఉత్తేజపరుస్తాయి. ఇలాంటి సందర్భాల్లో మీకున్న అనుభవంతో చిన్న వ్యాపారం కూడా చేయొచ్చు. ఒకవేళ తగిన స్థలం ఉంటే నాటు కోళ్ల పెంపకం వంటి చిన్న చిన్న వ్యాపారాలు కూడా చేయొచ్చు.

కొత్త కొత్త కోర్సులు నేర్చుకోండి.

ఒకవేళ మీరు గతంలో నేర్చుకోవాలని అనుకుని పెండింగ్‌లో ఉంటే వాటిని ఇప్పుడు నేర్చుకోండి. మీ అనుభవాలను బ్లాగ్ రూపంలోకి తేవాలనుకుంటే బ్లాగింగ్ కోర్సు నేర్చుకోండి. లేదంటే డిజిటల్ మీడియా సాధనాల గురించి తెలుసుకోండి. ఆన్‌లైన్‌లో వేలాది కోర్సులు ఉచితంగా కూడా లభిస్తాయి.

చిరు వ్యాయామాలు

చివరగా మీ ఆరోగ్యం చాలా ముఖ్యం. రోజూ 30 నిమిషాల పాటు నడక, 15 నిమిషాల పాటు తేలికైన వ్యాయామాలు మీ ఆరోగ్యాన్ని రక్షిస్తాయి. మీరు వ్యాధుల బారిన పడకుండా కాపాడుతాయి.

టాపిక్

తదుపరి వ్యాసం