తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Snow Fall In November। హిమపాతం చూడాలా? నవంబర్‌లో ఈ ప్రదేశాలకు విహారయాత్ర చేయండి!

Snow Fall in November। హిమపాతం చూడాలా? నవంబర్‌లో ఈ ప్రదేశాలకు విహారయాత్ర చేయండి!

HT Telugu Desk HT Telugu

15 November 2022, 18:58 IST

google News
    • Snow Fall in November: ఈ నవంబర్ నెలలో హిమపాతం చూడాలనుకుంటే, భారతదేశంలోని కొన్ని అద్భుతమైన ప్రదేశాలు ఇక్కడ జాబితా చేశాం, మీ ప్లాన్ సిద్ధం చేసుకోండి.
Shimla- India
Shimla- India (istock)

Shimla- India

శీతాకాలం ప్రారంభమైంది, ఇప్పటికే నవంబర్ నెల సగం గడిచిపోయింది, మంచుకురిసే సమయం వచ్చేసింది. ఇప్పుడు ఉత్తర భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో హిమపాతం కూడా మొదలైంది. మీరు శీతాకాలం విహారయాత్రలను ఇష్టపడే వారైతే మీ ట్రావెల్ ప్లాన్‌లను సిద్ధం చేసుకోండి. ఈ నగరానికి ఏమైంది అని మీ రోజూవారీ గందరగోళం గురించి చింతించకుండా, కాలుష్యం నుండి దూరంగా నీలాకాశానికి దగ్గరగా అద్భుతమైన హిల్ స్టేషన్లు మన భారతదేశంలో ఎన్నో ఉన్నాయి.

మీరు హిమపాతాన్ని ఆస్వాదించాలి, అడ్వెంచర్లు చేయాలి అనుకుంటే ఢిల్లీకి చుట్టుపక్కల కొన్ని ప్రసిద్ద ప్రదేశాలు ఉన్నాయి. ఇక్కడకు చేరుకోవడం కూడా సులువుగా ఉంటుంది. ఈ నవంబర్- డిసెంబర్ నెలల్లో ఏ ప్రదేశాలు మీరు విహారయాత్ర చేసేందుకు ఉత్తమమో ఇక్కడ తెలుకోండి.

షిమ్లా

హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని షిమ్లా శీతాకాలంలో విహరయాత్రకు అనువైన ఒక ప్రసిద్ధ గమ్యస్థానం. హిమపాతం, ఎత్తైన హిమాలయా పర్వతాలను చూసేందుకు ఇష్టపడే చాలా మంది యాత్రికుల మొదటి ఎంపిక. ఈ ప్రాంతం ఢిల్లీ నుండి సుమారు 350 కి.మీ దూరంలో ఉంటుంది. నవంబర్‌లో సిమ్లా ఉష్ణోగ్రత 21 నుండి 16 డిగ్రీల వరకు ఉంటుంది.

ఎలా చేరుకోవాలి?

మీరు విమానంలో వెళ్లాలనుకుంటే, సమీపంలోని విమానాశ్రయం చండీగఢ్ విమానాశ్రయం. ఢిల్లీ నుంచి రైలు మార్గం ద్వారా కూడా చండీగఢ్ రైల్వే స్టేషన్ చేరుకోవచ్చు, అక్కడి నుండి బస్సులో సిమ్లా చేరుకోవచ్చు.

ఔలి

ఔలి కూడా శీతాకాలపు విహారానికి గొప్ప ప్రదేశం. ఇక్కడ నవంబర్ నెలలో ఉష్ణోగ్రత 4 నుండి 14 డిగ్రీలకు చేరుకుంటుంది. ఢిల్లీ నుండి ఔలీ దూరం 375 కి.మీ దూరంలో ఉంటుంది. మీరు ఔలీకి విమానంలో వెళ్లాలనుకుంటే, సమీపంలోని విమానాశ్రయం జాలీ గ్రాంట్. లేదా రైలు మార్గం ద్వారా హరిద్వార్ చేరుకోవాలి. లేదా ఢిల్లీ, హరిద్వార్ నుండి నేరుగా ఔలి వెళ్లే బస్సులు ఉంటాయి.

మనాలి

రొమాంటిక్ ట్రిప్ వేయాలనుకునే జంటలకు మనాలి అద్భుతమైన ప్రదేశం. ఈ ప్రదేశం జంటలకు వెచ్చని అనుభూతులను అందిస్తుంది. స్నేహితులు, కుటుంబ సభ్యులతో కూడా మనాలి వెళ్లి ఎంజాయ్ చేయవచ్చు. ఢిల్లీ నుండి మనాలి 537 కి.మీ. దూరం ఉంటుంది. నవంబర్ నెలలో ఇక్కడ ఉష్ణోగ్రత 10 నుండి 5 డిగ్రీల వరకు ఉంటుంది. మీరు విమానంలో ఇక్కడికి చేరుకోవాలనుకుంటే , సమీపంలో భుంటార్ విమానాశ్రయంలో దిగాలి. రైలు మార్గం ద్వారా సమీప రైల్వే స్టేషన్ జోగిందర్ నగర్. అదే సమయంలో, మీరు ఢిల్లీ, చండీగఢ్ , షిమ్లాల నుండి నేరుగా బస్సుల్లో కూడా చేరుకోవచ్చు.

లాన్స్‌డౌన్

ఉత్తరాఖండ్‌లోని లాన్స్‌డౌన్ అనే ప్రాంతం ఢిల్లీకి చాలా దగ్గరగా ఉండే అందమైన హిల్ స్టేషన్. నవంబర్ నెలలో, ఇక్కడ ఉష్ణోగ్రత 15 నుండి 5 డిగ్రీల వరకు ఉంటుంది. ఈ ప్రదేశానికి సమీపంలో జాలీగ్రాంట్ విమానాశ్రయం ఉంది. రైలు మార్గంలో అయితే కోట్‌ద్వార్ రైల్వే స్టేషన్లో దిగాలి. అదే సమయంలో, ఢిల్లీ , డెహ్రాడూన్ నుండి బస్సులలో లాన్స్‌డౌన్ చేరుకోవచ్చు.

టాపిక్

తదుపరి వ్యాసం