Brain Diet: జ్ఞాపకశక్తిని పెంచుకోవాలా..? అయితే ఈ ఆహారాలను తీసుకోండి!
19 September 2022, 18:12 IST
- పని ఒత్తిడి. ఎక్కువగా ఆలోచించడం, సరైన డైట్ లేని కారణంగా చాలా మంది మతి మరుపు సమస్యతో బాధపడుతుంటారు.మరి జ్ఞాపకశక్తిని మెరుగుపర్చుకునేందుకు ఎలాంటి ఆహారాలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసకుందాం.
Brain Diet
జ్ఞాపకశక్తి మెరుగ్గా ఉండాలంటే హెల్తీ ఫుడ్ చాలా ముఖ్యం. నేటి ఉరుకుల పరుగుల జీవితంలో చాలా మంది ఆహారం విషయం అజాగ్రత్తగా ఉంటున్నారు. దీంతో మతి మరుపు (LOSS OF REMEMBRANCE) సమస్యను ఎదుర్కొంటున్నారు. మరి ఈ సమస్యను తగ్గించుకోవాలంటే ఏం చేయాలి. జ్ఞాపకశక్తి మెరుగవ్వాలంటే ఎలాంటి ఆహారాలను తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. జ్ఞాపకశక్తి పెరగాలంటే పౌష్టికాహారం తీసుకోవడం చాలా ముఖ్యం. ఆహారంలో అన్ని పోషకాలతో కూడిన ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడం వల్ల జ్ఞాపకశక్తిని బలోపేతం చేసుకోవచ్చు.
మీ రోజువారీ ఆహారంలో ఈ ఆహారాలను చేర్చుకోండి
చేపలు
సాల్మన్, ట్యూనా లేదా కాడ్ వంటి కొవ్వు చేపలు ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలకు మంచి మూలాలు. ఒమేగా-3 జ్ఞాపకశక్తిని పదును పెట్టడంలో, మానసిక స్థితిని మెరుగుపరచడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. శరీరం సహజంగా ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలను ఉత్పత్తి చేయదు. ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు మెదడుకు ముఖ్యమైన పోషకాలు.
గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ గ్రీన్
లీఫీ వెజిటేబుల్స్‌లో విటమిన్స్, ఐరన్, మినిరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలోని పోషకాల లోపాన్ని భర్తీ చేస్తాయి. బచ్చలికూర, బ్రోకలీ, పచ్చి ఆకు కూరలు, ఎరుపు రంగు కూరగాయలు జ్ఞాపకశక్తి చాలా మేలు చేస్తాయి. వీటిని ఎక్కువగా తినడం వల్ల మెుదడు పదును పెరుగుతుంది.
గుడ్లు
గుడ్లు పోషకాహార గని భావిస్తుంటాం. మెుదడు చురుకుగా పని చేయడానికి కావాల్సిన పోషకాలు వీటిలో చాలా ఉంటాయి. కాబట్టి ప్రతిరోజూ కనీసం ఒక గుడ్డు తినడం వల్ల జ్ఞాపకశక్తిని మెరుగుపరుచుకోవచ్చు. గుడ్లలో ప్రొటీన్లు, ఫోలేట్, కోలిన్, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. కోలిన్ మెదడుకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. దీని అధిక వినియోగం వల్ల జ్ఞాపకశక్తి, ఏకాగ్రతను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
గింజలు
బాదం, వాల్‌నట్‌లు, ఎండుద్రాక్షలలో కాల్షియం, విటమిన్లు ఎక్కువగా ఉంటాయి. ఈ ఆహారాలను రోజూ నానబెట్టి తినడం వల్ల జ్ఞాపకశక్తి మెరుగుపడుతుంది. గుమ్మడికాయ గింజలు మెుదడుకు పదును పెడుతుంది. తెలివికి పెంచుకోవడానికి ఇది ఉత్తమమైన ఆహారం.
సుగంధ ద్రవ్యాలు
ఆయుర్వేదంలో పసుపుకు చాలా ప్రాముఖ్యత ఉంది. పసుపులో కర్కుమిన్ అనే పదార్థం ఉంటుంది, ఇది మెదడు కణాలకు మేలు చేస్తుంది. ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది కాకుండా మసాలాలు కూడా మెదడుకు మంచివి. అనేక మూలికలు, సుగంధ ద్రవ్యాలు యాంటీఆక్సిడెంట్లకు మంచి మూలాలు, మెదడు పనితీరును పెంచడంలో సహాయపడతాయి.