తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Mind The Malhotras Season 2: మైండ్‌ ద మల్హోత్రాస్‌ కామెడీ సిరీస్‌ సీజన్‌ 2 వచ్చేసింది

Mind the Malhotras Season 2: మైండ్‌ ద మల్హోత్రాస్‌ కామెడీ సిరీస్‌ సీజన్‌ 2 వచ్చేసింది

HT Telugu Desk HT Telugu

12 August 2022, 11:12 IST

  • Mind the Malhotras Season 2: సిచువేషనల్‌ కామెడీ సిరీస్‌ మైండ్‌ ద మల్హోత్రాస్‌ సీజన్‌ 1 వచ్చి మూడేళ్లు పూర్తయింది. ఇప్పుడు అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో రెండో సీజన్‌ను అనౌన్స్‌ చేసింది.

అమెజాన్ ప్రైమ్ వీడియోలో వచ్చిన మైండ్ ద మల్హోత్రాస్ రెండో సీజన్
అమెజాన్ ప్రైమ్ వీడియోలో వచ్చిన మైండ్ ద మల్హోత్రాస్ రెండో సీజన్

అమెజాన్ ప్రైమ్ వీడియోలో వచ్చిన మైండ్ ద మల్హోత్రాస్ రెండో సీజన్

అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో ఓటీటీలో మరో కొత్త కామెడీ సిరీస్‌ వచ్చేసింది. మైండ్‌ ద మల్హోత్రాస్‌ పేరుతో సక్సెస్‌ సాధించిన ఈ సిరీస్‌.. ఇప్పుడు రెండో సీజన్‌తో ప్రేక్షకులను అలరించడానికి వచ్చింది. శుక్రవారం (ఆగస్ట్‌ 12) నుంచే ఈ సిరీస్‌ అందుబాటులో ఉంటుందని ప్రైమ్‌ వీడియో అనౌన్స్‌ చేసింది. అప్లౌజ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌, మడీబా ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా ఈ సిరీస్‌ను నిర్మించాయి.

ట్రెండింగ్ వార్తలు

Kiara Advani: గేమ్‍ ఛేంజర్ ‘జరగండి’ పాటపై ఇంట్రెస్టింగ్ విషయాలు చెెప్పిన కియారా.. ఈ సాంగ్‍కు ఎన్ని రోజుల షూటింగ్ అంటే..

OTT Telugu Movies This week: ఈవారంలో ఓటీటీల్లోకి వచ్చిన 3 తెలుగు సినిమాలు ఇవే.. రెండు డబ్బింగ్ చిత్రాలు కూడా..

Tollywood: బాలయ్య - అమితాబ్ కాంబో కాస్తలో మిస్.. పట్టాలెక్కని సినిమా.. వివరాలివే

Nagababu Twitter: ట్విట్టర్‌లోకి నాగబాబు రీఎంట్రీ .. ఆ వివాదాస్పద ట్వీట్ డిలీట్

మినీ మాథుర్‌, సైరస్‌ సాహుకర్‌, సుష్మితా ముఖర్జీ, ఆనందితా పగ్నిస్‌, నిక్కీ శర్మ ఇందులో నటించారు. ఇజ్రాయెల్‌కు చెందిన లా ఫామిగ్లియా అనే షోను అడాప్ట్‌ చేసుకొని ఈ మైండ్‌ ద మల్హోత్రాస్‌ నిర్మించారు. మూడేళ్ల కిందట 2019, జూన్‌ 7న ఈ కామెడీ సిరీస్‌ తొలి సీజన్‌ ప్రైమ్‌ వీడియోలో రిలీజైంది. అయితే ఆ సిరీస్‌కు పెద్దగా ఆదరణ లభించలేదు.

ఆడియెన్స్‌ కూడా 5.9 రేటింగ్‌ మాత్రమే ఇచ్చారు. అయితే మూడేళ్ల తర్వాత ఇప్పుడు ఈ కామెడీ సిరీస్‌ రెండో సీజన్‌ను తీసుకురానుండటం విశేషం. మరి ఇది ఎంత వరకూ సక్సెస్‌ అవుతుందన్నది చూడాలి. ఇండియన్‌ ఓటీటీ స్పేస్‌లో ప్రైమ్‌ వీడియో చాలా దూకుడుగా వెళ్తోంది. వచ్చే ఐదేళ్లలో తమ ఇన్వెస్ట్‌మెంట్‌ను రెట్టింపు చేయనున్నట్లు ఈ మధ్యే ప్రకటించింది.

పైగా వచ్చే రెండేళ్లలో కొత్తగా 40 ఒరిజినల్స్‌ తీసుకువస్తామనీ చెప్పింది. దీంతోపాటు ప్రైమ్‌ సబ్‌స్క్రైబర్లు, నాన్‌ సబ్‌స్క్రైబర్లకు కూడా వేరే ప్లాట్‌ఫామ్స్‌లోని మూవీలను రెంట్‌పై ఇస్తోంది. పే పర్‌ వ్యూ సర్వీస్‌ కింద రూ.69 నుంచి రూ.499 వరకూ రెంట్‌తో మూవీస్‌ అందుబాటులో ఉన్నాయి. ప్రైమ్‌ వీడియోకు ఇండియాలో నెట్‌ఫ్లిక్స్‌, హాట్‌స్టార్‌, సోనీలివ్‌లాంటి ఓటీటీల నుంచి గట్టి పోటీ ఉంది.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం