తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Diwali Outfits For Ladies: దీపావళికి స్టైల్​గా కనిపించాలంటే.. ఇలాంటివి ఎంచుకోండి..

Diwali Outfits for Ladies: దీపావళికి స్టైల్​గా కనిపించాలంటే.. ఇలాంటివి ఎంచుకోండి..

11 October 2022, 15:36 IST

    • Outfit Ideas For Diwali : దసరా వెళ్లిపోయింది.. ఇప్పుడు దీపావళి సెలబ్రేషన్స్ మొదలైపోయాయి. ఈ పండుగ దగ్గర్లోనే ఉంది. కాబట్టి పండుగకు మంచి డ్రెస్​ వేసుకోవాలని అందరూ కోరుకుంటారు. అయితే పండుగ సమయంలో మీ స్టైల్, మీ మార్కును ప్రతిబింబించేలా కొన్ని ఔట్​ఫిట్​లను ఎంచుకోండి. 
దీపావళి ఔట్​ఫిట్​లు
దీపావళి ఔట్​ఫిట్​లు

దీపావళి ఔట్​ఫిట్​లు

Outfit Ideas For Diwali : దీపావళి సమీపిస్తోంది. మీకు ఇష్టమైన దుస్తులను ధరించి.. అందరినీ ఆశ్చర్యపరిచేందుకు ఇదే సరైన సమయం. పండుగలంటే గుర్తొచ్చేవి సంప్రదాయ దుస్తులు. అయితే మీరు సంప్రదాయానికి.. ట్రెండ్​ని జోడిస్తే.. అవి మీకు ఓ ప్రత్యేకతను, కొత్త స్టైల్​ని ఇస్తాయి. దానికోసం మీరు స్టైలిష్ ఇండో వెస్ట్రన్​ లుక్​ని కూడా ప్రయత్నించవచ్చు. అయితే మీకోసం కొన్ని సూపర్ స్టైలిష్ అవుట్‌ఫిట్ ఐడియాలు ఇక్కడున్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ట్రెండింగ్ వార్తలు

Green Dosa: కొత్తిమీర, పుదీనాతో గ్రీన్ దోశ చేశారంటే ఎంతో హెల్తీ, రెసిపీ ఇదిగో

World laughter day 2024: మూతి ముడుచుకుంటే వచ్చేదేం లేదు, ప్రతిరోజూ నవ్వండి నవ్వించండి, ఎక్కువకాలం జీవిస్తారు

Weight Loss Drink : ఇంట్లో తయారుచేసిన డ్రింక్.. ఈజీగా బరువు తగ్గవచ్చు

Usiri Pachadi: ఉసిరి పచ్చడి ఇలా స్పైసీగా చేయండి, వేడివేడి అన్నంలో అదిరిపోతుంది

క్రాప్ టాప్, పలాజో సెట్

క్రాప్ టాప్, పలాజో సెట్‌తో ఈ దీపావళిని కొత్తగా, ఆసక్తికరంగా మార్చేసుకోండి. మీరు మీ మిడ్‌రిఫ్‌ను హైలైట్ చేసే పెప్లమ్ హేమ్‌తో అలంకరించిన క్రాప్ టాప్‌తో పాస్టెల్-రంగు సెట్‌ని ఎంచుకోవచ్చు. దానిని మ్యాచింగ్, ఫ్లోవీ పలాజోతో జత చేయవచ్చు. దీనికి సాంప్రదాయిక చెవిపోగులతో, చక్కటి జోటీలతో మీ రూపాన్ని మరింత స్టైలిష్​గా, ట్రెండీగా, సాంప్రదాయకంగా కనిపించవచ్చు.

ధోతీ ప్యాంటుతో పొట్టి కుర్తీ

ఈ వేషధారణ దీపావళి పార్టీలో ధరించడానికి అత్యంత సౌకర్యవంతమైన వాటిలో ఒకటి. ఇది మీకు ప్రయోగాత్మకమైన, సూపర్-స్టైలిష్ రూపాన్ని అందిస్తుంది. ముదురు గోధుమరంగు, నీలం, గులాబీ లేదా పసుపు రంగులో ఉన్న ధోతీ ప్యాంట్‌ల కోసం వెళ్లి.. పూల లేదా పైస్లీ ప్రింట్‌లతో సారూప్య-రంగు పొట్టి కుర్తీతో వాటిని జత చేయండి. లుక్ పూర్తి చేయడానికి మాండరిన్ కాలర్ జాకెట్, స్ట్రాపీ హై హీల్స్ ధరించండి.

ట్రెడీషనల్ జంప్‌సూట్

జంప్‌సూట్‌లు అత్యంత ఫ్యాషన్‌గా, మీకు సూపర్-చిక్‌ లుక్​ని ఇస్తాయి. అంతే కాకుండా సౌకర్యవంతంగా, సులభంగా అటూ ఇటూ తిరిగేందుకు సహాయం చేస్తాయి. అయితే మీ మొత్తం రూపానికి డ్రామా, ఫ్లెయిర్‌ని జోడించడానికి.. పాకెట్స్‌తో కూడిన చక్కని జంప్‌సూట్‌ని తీసుకోండి. ఆకుపచ్చ, ఎరుపు, ఊదా లేదా నారింజ వంటి ప్రకాశవంతమైన షేడ్స్‌పై ఎంబ్రాయిడరీ ఉండేలా ఎంచుకోండి. దానికి సాంప్రదాయకమైన చెవిపోగులు, గోల్డెన్ కలర్ చెప్పులు, అందమైన హ్యాండ్‌బ్యాగ్‌తో మీ రూపాన్ని పూర్తి చేయండి.

చీర లేకపోతే ఎలా

చీరలు పండుగలు. జంటపక్షులు లాంటివి. అయితే చీర కట్టుకోవడం కాస్త ఇబ్బందిగా ఫీల్ అయ్యేవారు.. కుట్టిన చీరలు ఎంచుకోవచ్చు. చీరలు సంప్రదాయంగా ఉండేందుకు, ఫ్యాషన్​గా కనిపించేందుకు కూడా సహాయం చేస్తాయి.

కుట్టిన చీర అనేది ఇప్పటికే ట్రెండ్​లో ఉంది. కాబట్టి మీరు దానికి తగిన కోట్​తో సెట్ చేసుకోవచ్చు. రఫుల్ హెమ్ అలంకరించిన జాకెట్ బ్లౌజ్‌తో.. కుట్టిన మెరిసే చీరను ఎంచుకోవచ్చు.

షరార

క్లాసిక్ షరారా డ్రెస్‌లు ఎప్పుడూ స్టైల్‌కు దూరంగా ఉండవు. మీ దీపావళి వార్డ్‌రోబ్‌లో ఇవి తప్పనిసరిగా ఉండాల్సిందే. ఫ్లేర్డ్ బాటమ్, పొట్టి కుర్తీ, చక్కగా అలంకరించిన దుపట్టాతో షరారా-శైలి సల్వార్ కమీజ్‌ని ఎంచుకోవచ్చు. మీరు సీక్విన్స్, స్టోన్‌వర్క్ లేదా మిర్రర్‌వర్క్‌తో అలంకరించిన సెట్‌ను ఎంచుకోవచ్చు.

టాపిక్