Hair Oiling Benefits : తలకు నూనె రాసుకోవడం చాలా ముఖ్యం.. లేదంటే బట్టతల కన్ఫార్మ్
06 October 2022, 15:41 IST
- Hair Oiling Benefits : ఇప్పుడు ఫ్యాషన్ అంటూ చాలా మంది తలకు నూనె పెట్టుకోవడం పూర్తిగా మానేశారు. దాని వల్ల జుట్టు రాలిపోతుందంటూ బాధపడిపోతారు. అందుకే తలకు నూనె పెట్టుకోవడం చాలా ముఖ్యం. పైగా తలకు నూనె పెట్టుకోవడం చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.
తలకు నూనె మసాజ్ చేయండి
Hair Oiling Benefits : తలకు నూనె పెట్టుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయని ఆయుర్వేద శాస్త్రం కూడా చెప్తుంది. శతాబ్దాలుగా ఆయుర్వేదం అభ్యాసంలో జుట్టుకు నూనె రాయడం ఒక భాగం. హెయిర్ ఆయిల్‌తో తలను మసాజ్ చేయడం వల్ల రక్తప్రసరణ జరిగి జుట్టుకు బలం చేకూరుతుంది. కాబట్టి బాడీ మసాజ్ లేదా హాట్ ఆయిల్ మసాజ్ రక్త ప్రసరణను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. అది తలలోని మూలాలను బలపరుస్తుంది. ఇది జుట్టు రాలడం, అకాలంగా మెరిసే జుట్టు, చుండ్రు వంటి అనేక రకాల సమస్యలను నయం చేస్తుంది.
అందుకే మన అమ్మలు, అమ్మమ్మలు ఎల్లప్పుడూ నూనె రాయమని బలవంతం చేస్తారు. మనలో చాలా మంది దీనిని నిర్లక్ష్యం చేస్తారు కానీ జుట్టుకు నూనె రాయడం చాలా ముఖ్యం. నూనెతో జుట్టును సున్నితంగా మసాజ్ చేయడం వల్ల అది డ్రై హెయిర్ సమస్యను తగ్గించి.. తేమను పెంచుతుంది. జుట్టుకు మంచి మెరుపునిస్తుంది.
జుట్టుకు నూనె రాయడం వల్ల కలిగే ప్రయోజనాలివే
నూనె రాయడం వల్ల జుట్టు పొడిబారకుండా ఉంటుంది. జుట్టు రాలడాన్ని నివారిస్తుంది. మీకు పొడి, చిట్లిన జుట్టు ఉంటే.. వారానికి మూడుసార్లు జుట్టుకు నూనె రాయడం వల్ల జుట్టుకు బలం చేకూరుతుంది. తద్వారా జుట్టు చిట్లకుండా ఉంటుంది. గిరజాల జుట్టుకు తరచుగా నూనె రాసుకోవాలి. అయితే జిడ్డుగల జుట్టుకు నూనె ఎక్కువ రాయకూడదు. ఇది మీ జుట్టును మెరిసేలా, ఒత్తుగా కనిపించేలా చేస్తుంది.
ఈ నూనెలు బాగా హెల్ప్ చేస్తాయి
కొబ్బరి, ఆలివ్, నువ్వులు, బాదం, అర్గాన్, బృంగరాజ్, ఉసిరి వంటివి సాధారణంగా ఉపయోగించే కొన్ని జుట్టు సంరక్షణ నూనెలు. ఇవి జుట్టు రాలడం, చుండ్రు, చిట్లిపోవడం, నెరవడం వంటి మొదలైన ప్రాథమిక జుట్టు సమస్యలను పరిష్కరించడంలో సహాయపడతాయి.
ఆయుర్వేదం ప్రకారం.. ఒక వ్యక్తి తమ జుట్టును ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ప్రతిరోజూ నూనెను తప్పక రాసుకోవాలి. అది సాధ్యం కాకపోతే.. మంచి ప్రయోజనాల కోసం మీ జుట్టుకు కనీసం వారానికి రెండుసార్లు నూనె రాయండి. ఉత్తమ ఫలితాల కోసం తలను నూనెతో మసాజ్ చేసి.. రాత్రంతా అలాగే ఉంచండి. ఉదయం తలస్నానం చేసేయవచ్చు. దీనివల్ల మీరు అందమైన, బలమైన జుట్టును పొందుతారు.
టాపిక్