తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Eating Raw Carrot | మీరు పచ్చి క్యారెట్ తింటారా? అయితే కచ్చితంగా ఈ స్టోరీ చదవండి!

Eating Raw Carrot | మీరు పచ్చి క్యారెట్ తింటారా? అయితే కచ్చితంగా ఈ స్టోరీ చదవండి!

HT Telugu Desk HT Telugu

06 October 2022, 21:29 IST

google News
    • Eating Raw Carrot: కొందరు కూరగాయలను వండకుండా పచ్చిగానే తినేస్తారు. క్యారెట్, ఉల్లిపాయ, కాకరకాయ ఇలా ఏది దొరికినా కసాబిసా నమిలేస్తారు. అయితే ఇందులో మీరు పచ్చి క్యారెట్ తినేవారా? అయితే కచ్చితంగా ఈ స్టోరీ చదవండి, ఇతరులతో చదివించండి.
Eating Raw Carrot
Eating Raw Carrot (istock)

Eating Raw Carrot

కూరగాయలను వండుకొని తినాలి, అయితే కొన్నింటిని వండకుండానే నేరుగా పచ్చిగా కూడా తినేయవచ్చు. అలాంటి వాటిలో క్యారెట్ కూడా ఒకటి. ఆరోగ్య స్పృహ కాస్త ఎక్కువగా ఉన్నవారు పచ్చి కూరగాయలను తినడాన్ని ఆనందిస్తారు. అయితే పండించేటపుడు పెస్టిసైడ్స్ వాడతారు కాబట్టి పచ్చివి తింటే విషపదార్థాలు శరీరంలోకి వెళ్తాయని కొందరు భావిస్తారు.

మరి పచ్చివి తినాలా, వండుకొని తినాలా అన్నదానికి జవాబుగా మరీ పచ్చిగా తినకూడదు, ఎందుకంటే దీనివల్ల జీర్ణ సమస్యలు రావచ్చు. అలాగానీ బాగా వండుకోకూడదు, ఎక్కువగా వేడి చేస్తే అందులోని పోషకాలు నశిస్తాయి. కాబట్టి శుభ్రంగా కడిగి ఉడకబెట్టుకొని తినాలని ఆరోగ్య నిపుణుల సూచన.

Eating of Raw Carrot.. క్యారెట్ పచ్చిగా తింటే..

క్యారెట్ పచ్చిగా తింటే ఏమవుతుంది? అంటే క్యారెట్‌లను పచ్చిగానైనా తినవచ్చు లేదా ఆవిరిలో ఉడికించి తినడం కూడా మంచిదేనని పోషకాహార నిపుణులు అంటున్నారు. నిజానికి పచ్చి క్యారెట్ తినడం ద్వారా అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని హోలిస్టిక్ న్యూట్రిషనిస్ట్, కేటీ బ్రాస్వెల్ పేర్కొన్నారు. పచ్చి క్యారెట్ తింటే ఎలాంటి మేలు జరుగుతుందో కూడా వారు వివరించారు. అవేంటో ఇక్కడ తెలుసుకోండి.

1. హార్మోన్ల సమతుల్యత

పచ్చి క్యారెట్‌ను తింటే ఆడవారికి ఎంతో మంచిది, పచ్చి క్యారెట్‌లోని ఫైబర్ అదనపు ఈస్ట్రోజెన్‌ను బంధిస్తుంది. ఈస్ట్రోజన్ అదుపులో ఉండటం ఎంతైనా మంచిది, ఎందుకంటే శరీరంలో ఈస్ట్రోజెన్ ఎక్కువైతే మొటిమలు, PMS, మూడ్ హెచ్చుతగ్గులు మొదలైన వాటితో సహా వివిధ హార్మోన్ల అంతరాయాలకు దారితీస్తుంది. పచ్చి క్యారెట్లు పేగులోని చెడు బ్యాక్టీరియా సంఖ్యను తగ్గించడంలో సహాయపడతాయి. పేగులో చెడు బాక్టీరియా సాధారణంగా హార్మోన్ల అసమతుల్యతకు కారణమవుతుంది. కాబట్టి ఈ రకంగా హార్మోన్ల అసమతుల్యతను అడ్డుకోవచ్చు.

2. ఎండోటాక్సిన్‌లను డిటాక్స్ చేస్తుంది

క్యారెట్‌లు మొక్క వేరు నుంచి వచ్చే కూరగాయలు. అందువల్ల ఇవి ఎండోటాక్సిన్‌లు, బ్యాక్టీరియా, ఈస్ట్రోజెన్‌లకు నియంత్రించే ప్రత్యేకమైన ఫైబర్‌లను కలిగి ఉంటాయి. రోజుకు ఒక పచ్చి క్యారెట్‌ను కొన్ని రోజులు పాటు తింటూ ఉంటే, శరీరంలోని అధిక ఎండోటాక్సిన్‌లు, అధిక కార్టిసాల్, ఈస్ట్రోజెన్‌ల హెచ్చుతగ్గులు సంతులనం కావచ్చు. శరీరం నుండి ఎండోటాక్సిన్‌లను నిర్విషీకరణ చేయడానికి ఇది గొప్ప మార్గం.

3. విటమిన్ ఎ సమృద్ధిగా ఉంటుంది

క్యారెట్లు విటమిన్ A కు అద్భుతమైన మూలం, ఒక క్యారెట్ ద్వారా పోషక విలువలో 184% విటమిన్ ఎ అందిస్తుంది. పెద్దలు, 4 సంవత్సరాల పైబడిన పిల్లలకు రోజుకు కనీసం 700 నుండి 900 మైక్రోగ్రాముల విటమిన్ Aని అవసరంగ. రోజులో ఒకేఒక పచ్చి క్యారెట్‌ తినడం ద్వారా FDA సిఫార్సుకు అనుగుణంగా తగినంత విటమిన్ A లభిస్తుంది.

4. మృదువైన చర్మం కోసం

క్యారెట్లు విటమిన్ ఎ, బీటా కెరోటిన్‌తో నిండి ఉంటాయి. అందువల్ల, పచ్చి క్యారెట్‌లను తినడం వల్ల మొటిమలను తగ్గించడంతోపాటు ఎలర్జీలను తగ్గించడం, మరోవైపు సెల్ టర్నోవర్ (సహజ ఎక్స్‌ఫోలియేషన్)ను ప్రోత్సహించడం ద్వారా మచ్చలను నివారించడంలో సహాయపడుతుంది.

5. థైరాయిడ్ బ్యాలెన్స్‌లో సహాయపడుతుంది

థైరాయిడ్ పనితీరుకు మద్దతిచ్చే విటమిన్ ఎ అద్భుతమైన మూలం క్యారెట్ కాబట్టి హైపోథైరాయిడిజం ఉన్నవారికి క్యారెట్‌లు గొప్ప ఆహరం, ఔషధం.

తదుపరి వ్యాసం