Lice Season: తలలో పేలు పట్టే సీజన్ అది, పేలు బారిన పడకుండా ఇలా సురక్షితంగా ఉండండి
07 October 2024, 17:15 IST
- Lice Season: పేలు పట్టడం వ్యాధి కాకపోవచ్చు, కానీ చికాకు కలిగించే వ్యవహారం. నిత్యం తలపై దురద కలుగుతూనే ఉంటుంది. పేలు బారిన పడకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
పేలు ఏకాలంలో ఎక్కువగా పడతాయి?
Lice Season: కాలేజీలకి, స్కూలుకు వెళ్లే వారిలో తలలో పేలు ఎక్కువగా పట్టేస్తాయి. పిల్లల నుంచి పెద్దలకు కూడా సులువుగా పేలు సరిపోతాయి. పేలు బారిన పడకుండా ముందుగా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఆ సమస్య నుంచి బయట పడవచ్చు. అలాగే పేలు ఎక్కువగా ఏ కాలంలో చేరుతాయో కూడా చెప్తున్నారు డెర్మటాలజిస్టులు.
పేలు పెరిగే కాలం ఏది?
తలలో పేను చేరడం ఒక చిన్నపాటి ఆరోగ్య సమస్యగానే భావించాలి. ముఖ్యంగా వేసవి చివరిలో వేడి తగ్గుతున్న కాలంలో పిల్లలు పాఠశాలలకు బయలుదేరుతారు. ఆ సమయంలోనే పేలు సీజన్ కూడా. వేసవి తగ్గుతున్నప్పుడు, వర్షాకాలం పెరుగుతున్నప్పుడు పేలు ఎక్కువగా వ్యాప్తి చెందుతాయి. వాటికి కావాల్సిన తేమ, శారీరక పరస్పర చర్యలకు అనువైన వాతావరణం వంటివి ఆ సమయంలోనే ఉంటాయి. అందుకే వేసవి ముగుస్తుండగా వర్షాకాలం ప్రారంభమవుతుండగా పేల సమస్య ఎక్కువ మందిలో కనిపిస్తుంది.
పేలు పరాన్న జీవులు. మన రక్తాన్ని తాగి జీవిస్తాయి. పేల వల్ల అనేక రకాల సమస్యలు వస్తాయి. అలెర్జీ కూడా కలగవచ్చు. తరుచూ దురద పెడతాయి. పేలు వెంట్రుకలపై తన గుడ్లను పెడతాయి. వీటిని నిట్స్ అంటారు. పేలు అధికమైపోతే తలపై ఎర్రటి గడ్డలు, పుండ్లు కూడా ఏర్పడవచ్చు. పేలవల్ల అసౌకర్యంగా అనిపిస్తుంది. విశ్రాంతి లేనట్టుగా ఉంటుంది. నిద్రకు ఆటంకం కలుగుతుంది. పిల్లలకు ఏకాగ్రత తగ్గుతుంది. కాబట్టి పేల సమస్యను తేలికగా తీసుకోకండి.
పేలు ఉన్నవారితో దగ్గరగా కూర్చున్నప్పుడు లేదా వారు వాడిన దువ్వెనలు,హెయిర్ బ్రష్ లు, టోపీలు వంటివి తిరిగి మీరు వాడినప్పుడు పేలు వ్యాపిస్టూ ఉంటాయి. స్కూళ్లలో పిల్లలు పక్కపక్కనే చాలా దగ్గరగా కూర్చుంటారు. అందుకే ఒకరి పేలు మరొకరికి సులువుగా చేరుకుంటాయి. కాబట్టి ఎవరి వ్యక్తిగత వస్తువులను మీరు వాడకండి. ముఖ్యంగా దువ్వెనలను సెపరేట్‌గా పెట్టుకోండి.
పేలు నుంచి ఇలా బయటపడండి
పేల నుంచి ఉపశమనం కావాలంటే బయటకొన్ని షాంపూలు దొరుకుతాయి. అవి పేలు తలపై లేకుండా క్లీన్ చేస్తాయి. అలాగే పేలు పెట్టిన గుడ్లను కూడా ఇవి శుభ్రం చేస్తాయి. అలాంటి షాంపూలను తరచూ వాడడం మంచిది. లేదా పేల దువ్వెనలు బయట దొరుకుతూ ఉంటాయి. వాటితో ప్రతిరోజూ దువ్వుకోవడం ద్వారా వాటిని తొలగించుకోవచ్చు. పేలు సమస్య ఎక్కువైపోతే వైద్యుల వద్దకు వెళ్తే తగిన మందులను సూచిస్తారు. ఇంటి దగ్గరే టీ ట్రీ ఆయిల్ వంటివి వాడితే త్వరగా పేలు బయటికి పోతాయి. పేలు తగ్గించే షాంపూలు కూడా మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. వాటిని వాడితే