ఎలక్ట్రిక్ కారు కొనాలని ఆలోచిస్తున్నారా? వారి కోసం SBI బంఫర్ ఆఫర్!
11 April 2022, 20:26 IST
- పెరుగుతున్న డీజిల్, పెట్రోల్ ధరలు, ఎలక్ట్రిక్ వాహనాల (EV)లను ప్రోత్సహించాలన్న ప్రభుత్వ యోచన కారణంగా ఇప్పుడు ఎలక్ట్రిక్ కార్లకు ఆదరణ పెరుగుతోంది. చాలా మంది ఇప్పుడు తమ పెట్రోల్ లేదా డీజిల్ కార్ల నుండి ఎలక్ట్రిక్ వాహనాలకు మారాలని ఆలోచిస్తున్నారు.
SBI Loan
పెరుగుతున్న డీజిల్, పెట్రోల్ ధరలు, ఎలక్ట్రిక్ వాహనాల (EV)లను ప్రోత్సహించాలన్న ప్రభుత్వ యోచన కారణంగా ఇప్పుడు ఎలక్ట్రిక్ కార్లకు ఆదరణ పెరుగుతోంది. చాలా మంది ఇప్పుడు తమ పెట్రోల్ లేదా డీజిల్ కార్ల నుండి ఎలక్ట్రిక్ వాహనాలకు మారాలని ఆలోచిస్తున్నారు. ఎందుకంటే డీజిల్-పెట్రోల్ వాహనాల కంటే ఎలక్ట్రిక్ వాహనాలు నడపడానికి తక్కువ ఖర్చు అవుతుంది. వినియోగదారుల ఆసక్తిని గమనించిన బ్యాంకులు ఎలక్ట్రిక్ వాహనాల కోసం ఆకర్షణీయమైన ధరలకు రుణాలు అందిస్తున్నాయి. ముఖ్యంగా అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ SBI కూడా ఎలక్ట్రిక్ కార్ల కొనుగోలుపై రుణాలు అందిస్తోంది. మరీ ఆ రుణం గురించి మరింతగా తెలుసుకుందాం.
SBI గ్రీన్ లోన్
అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన SBI ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలును ప్రోత్సహించేందుకు గ్రీన్ కార్ లోన్‌ను ప్రారంభించింది. వీటి వడ్డీ రేటు ప్రస్తుత ఆటో లోన్ స్కీమ్ రేటు కంటే 20 బేసిస్ పాయింట్లు తక్కువ ఉంది. SBI వెబ్‌సైట్ ప్రకారం, ఎంపిక చేసిన మోడళ్లపై ఆన్-రోడ్ ధరలో 90 శాతం నుండి 100 శాతం వరకు రుణాలు అందుబాటులో ఉంటాయి. గ్రీన్ కార్ రుణాలపై వడ్డీ రేట్లు 7.05 శాతం నుంచి 7.75 శాతం వరకు ఉన్నాయి.
రుణ మెుత్తం
ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాన్ని కొనుగోలు చేయడానికి మీరు రూ. 10 లక్షల వరకు రుణం తీసుకోవచ్చు, అయితే కారుపై మాత్రం పరిమితి లేదు. కొత్త ఎలక్ట్రిక్ 4-వీలర్‌పై తీసుకునే రుణాన్ని 84 నెలల్లో తిరిగి చెల్లించవచ్చు, ఇక కొత్త ఎలక్ట్రిక్ 2-వీలర్‌పై తీసుకునే రుణ వ్యవధి 36 నెలల నుండి 60 నెలల వరకు ఉంటుంది.
రుణ అర్హత
>> భారతదేశంలోని శాశ్వత నివాసితులు లేదా నాన్-రెసిడెంట్ భారతీయులు (NRIలు) ఈ రుణాలు అర్హులుగా ఉంటారు
>> రుణాన్ని పొందే వారి వయసు కనిష్ట వయస్సు 18 సంవత్సరాలు, గరిష్టంగా 75 సంవత్సరాలు.
>> 60 ఏళ్లు దాటిన తర్వాత కూడా సాధారణ ఆదాయ వనరు ఉన్నవారు కూడా రుణాన్ని పొందవచ్చు.
>> మీరు ఇతర అర్హతగల వ్యక్తులతో కలిసి ఉమ్మడిగా లేదా వ్యక్తిగతంగా రుణం తీసుకోవచ్చు. గరిష్టంగా ముగ్గరి వరకు కలిసి దరఖాస్తుదారులుగా ఉండవచ్చు. ప్రధాన దరఖాస్తుదారుతో గరిష్టంగా 2 సహ-దరఖాస్తుదారులు ఉండవచ్చు.
>> సహ-దరఖాస్తులలో జీవిత భాగస్వామి, తండ్రి, తల్లి, కుమారుడు, అవివాహిత కుమార్తె ఉండవచ్చు.