తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Banana Bread Recipe: బోలెడు ప్రొటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు ఉండే అరటిపండుతో బ్రెడ్ రెసిపీ

Banana Bread recipe: బోలెడు ప్రొటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు ఉండే అరటిపండుతో బ్రెడ్ రెసిపీ

Ramya Sri Marka HT Telugu

21 December 2024, 7:00 IST

google News
    • Banana Bread recipe: కొన్ని గంటల వరకూ ఆకలి అనే ఆలోచనే రాకుండా చేయగల వంటకం బనానా బ్రెడ్ ఫ్రిట్టారా. అదేనండీ అరటిపండు, బ్రెడ్ కలిపి తయారుచేసే వంటకం. మీకు నచ్చిన బ్రెడ్, మీరు మెచ్చే అరటిపండులను కలిపి అతి తక్కువ సమయంలో టేస్టీగా తయారుచేసుకోగల బ్రేక్ ఫాస్ట్ రెసిపీ మీకోసం.
బోలెడు ప్రొటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు ఉండే అరటిపండుతో బ్రెడ్ రెసిపీ
బోలెడు ప్రొటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు ఉండే అరటిపండుతో బ్రెడ్ రెసిపీ

బోలెడు ప్రొటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు ఉండే అరటిపండుతో బ్రెడ్ రెసిపీ

ఆరోగ్యకరమైన కొవ్వులతో పాటు ప్రొటీన్లు శరీరానికి అందించే "బనానా బ్రెడ్ ఫిట్టారా" (అరటిపండుతో బ్రెడ్) వంటకం రుచితో పాటు శరీరానికి మంచిది కూడా. పేరులో ఉన్నట్లుగానే ఫిట్టారా అంటే గుడ్లతో తయారుచేసేది అని. బాగా రంగు వచ్చి, నల్ల మచ్చలు వచ్చిన అరటిపండు కాకుండా దోరగా ఉండేది తీసుకోవడం బెటర్. ఇది బాగా తియ్యగా అనిపించదు కూడా. హెల్తీగానూ, టేస్టీగానూ అనిపించే ఈ వంటకం మీకు బ్రేక్ ఫాస్ట్‌కు మంచి ఛాయీస్. ఇంట్లో అందరూ తినే విధంగా, టేస్టీగా ఉండే బనానా బ్రెడ్ రెసీపీని ఇంట్లోని ఒక నలుగురైదుగురు వ్యక్తులకు సరిపోయేలా తయారుచేసుకోవడానికి ఈ పదార్థాలు తీసుకోండి.

బ్రెడ్ బనానా రెసిపీ కోసం కావాల్సిన పదార్థాలు..

అరటి పండ్లు- 5 (నిలువైన స్లైస్‌లుగా కట్ చేసుకోవాలి)

కొబ్బరి పాలు- ముప్పావు కప్పుగుడ్లు 12

ఖర్జూరాలు- అర కప్పు

దాల్చిన చెక్కపొడి - 4 చిన్న ముక్కలు

ఉప్పు - రుచికి సరిపడినంత

వెన్నిలా క్రీమ్ - 1 టీ స్పూన్ (ఆప్షనల్)

వాల్నట్స్- అరకప్పు

ప్రత్యామ్నాయాలు:

ఇక్కడ మీకు వాల్నట్స్ దొరకకపోతే మీకు నచ్చిన డ్రైఫ్రూట్స్ వేసుకోవచ్చు.

కొబ్బరి పాలు అందుబాటులో లేకపోతే సాధారణంగా మనం ఉపయెగించే పాలు కూడా వాడుకోవచ్చు.

మిల్క్ క్రీమ్ వాడినా బాగుంటుంది. వాడకపోయినా పర్వాలేదు.

మీకు ఘాటైన రుచి వద్దని అనుకుంటే దాల్చిన చెక్క కూడా పక్కకు పెట్టేయొచ్చు.

తీపి కోసం ఇందులో ఎటువంటి చక్కెరను ఉపయోగించం.

కాబట్టి ఎక్కువ తియ్యగా కావాలనుకుంటే కాస్త పండిన అరటిపండును తీసుకోండి.

లేదంటే ఖర్జూరాల ద్వారా వచ్చే తీపి సరిపోతుంది.

తయారుచేసే విధానం:

ఓవెన్‌ను వేడి చేసుకోండి.

గిన్నె లోపలి భాగంలో కాస్త ఆయిల్ పూసి ఉంచండి.

గిన్నె ఎంచుకోబోయే ముందు గుడ్లసొన ఉడకడానికి వీలుగా ఉండే గిన్నె తీసుకోవడం బెటర్.

ఆ తర్వాత గుడ్లను పగులగొట్టి ఆ సొనను, కొబ్బరి పాలను స్మూత్‌గా కలపండి.

ఆ తర్వాత అందులో నిలువుగా చీరిన అరటిపండ్ల ముక్కలను, ఖర్జూరపు గుజ్జును వేయండి.

అన్ని చక్కగా కలిపిన తర్వాత గిన్నెలో ఓవెన్ లో పెట్టండి.

కొద్ది నిమిషాల పాటు వేడి అయిన తర్వాత దానిపై వాల్నట్స్ వేసి మరొక 20 నుంచి 30 నిమిషాల వరకూ బేక్ చేయండి.

అంతే! "బనానా బ్రెడ్ ఫిట్టారా" రెడీ అయిపోయినట్లే.

ఇది తయారుచేసిన వెంటనే తినేయాల్సిన పదార్థమేమి కాదు.

ఒక నెల రోజుల పాటు నిల్వ ఉంచుకోవచ్చట కూడా.

ఇది ఏ సీజన్లో అయినా తీసుకోగల ఆహారం.

ఫిట్‌నెస్ లవర్స్ దీనిని కాస్త ఎక్కువగా తీసుకుంటే శరీరానికి ప్రొటీన్లు బాగా అందుతాయట.

శరీరానికి సమకూరే న్యూట్రిషన్ వాల్యూ:

ఆరోగ్యకరమైన కొవ్వు 37 గ్రాములుప్రొటీన్లు 26 గ్రాములు

కార్బొహైడ్రేట్స్ 61 గ్రాములుఫైబర్ 11 గ్రాములు

మొత్తం 676 కేలరీలు

తదుపరి వ్యాసం