తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Pms | పీరియడ్స్ వల్ల కలిగే నొప్పి తగ్గాలంటే ఏవి తినకూడదు, ఏవి మంచివి?

PMS | పీరియడ్స్ వల్ల కలిగే నొప్పి తగ్గాలంటే ఏవి తినకూడదు, ఏవి మంచివి?

Manda Vikas HT Telugu

28 February 2022, 17:42 IST

google News
    • పీరియడ్స్ వల్ల కలిగే తిమ్మిరిని చాలా మంది మహిళలు ఏదో రకంగా భరిస్తారు. అయితే నొప్పి అధికంగా ఉన్న మహిళలు మాత్రం నొప్పిని తగ్గించేందుకు 'పెయిన్ కిల్లర్స్' పైనే ఆధారపడటం మినహా వారికి మరో దారి తెలియదు. అయితే కొన్ని రకాల ఆహార పదార్థాలను తీసుకోవడం, మరికొన్ని తీసుకోకపోవడం చేయడం ద్వారా నొప్పి నుంచి కాస్త ఉపశమనం పొందవచ్చు.
PMS
PMS (Shutterstock)

PMS

ప్రతీనెల మహిళలు ఎదుర్కొనే సమస్య, ఆడవారికి మాత్రమే ఎందుకూ అని అసహ్యించుకునే సమస్య పీరియడ్స్. ఎంత అలవాటుపడినా ఈ సమయంలో వారు అనుభవించే నొప్పి, తిమ్మిరి ఒక్కోసారి భరించలేనంతగా ఉంటుంది. దీంతో పాటు చికాకు అనిపించడం, కడుపు ఉబ్బరం, తలనొప్పి, తీవ్రమైన ఆహార కోరికలు, ఆందోళన, భారంగా అనిపించడం, మానసిక కల్లోలం లాంటి లక్షణాలు వెర్రి ఎక్కిస్తాయి. రోజువారీ కార్యకలాపాల్లో జోక్యం చేసుకుంటూ అసహనాన్ని కలిగిస్తాయి.

పీరియడ్స్ వల్ల కలిగే తిమ్మిరిని చాలా మంది మహిళలు ఏదో రకంగా భరిస్తారు. అయితే నొప్పి అధికంగా ఉన్న మహిళలు మాత్రం నొప్పిని తగ్గించేందుకు 'పెయిన్ కిల్లర్స్' పైనే ఆధారపడటం మినహా వారికి మరో దారి తెలియదు. ఇలా పెయిన్ కిల్లర్స్ వాడితే కొన్నిసార్లు అది దీర్ఘకాలంలో మంచి కంటే ఎక్కువ హాని చేస్తుంది.

అయితే కొన్ని రకాల ఆహార పదార్థాలను తీసుకోవడం, మరికొన్ని తీసుకోకపోవడం చేయడం ద్వారా నొప్పి నుంచి కాస్త ఉపశమనం పొందవచ్చు.

పీరియడ్స్ సమయంలో మరింత మంట కలిగించే ఆహారాలు:

  • అధికమొత్తంలోఉప్పు కలిగిన ఆహారాలు
  • నిల్వఉంచిన ఆహార పదార్థాలు
  • చక్కెర ఎక్కువైనపుడు (ఎక్కువ కార్బోహైడ్రేట్లు, చక్కెరతో రుతుక్రమ నొప్పి తీవ్రతరం అవుతుంది)
  • కాఫీ లేదా కెఫీన్ పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం
  • ఆల్కహాల్
  • కారంగా ఉండే ఆహారం, జంక్ ఫుడ్, షుగర్ కలిగిన డ్రింక్స్, రెడ్ మీట్ (మాంసం), పీచు అధికంగా ఉండే పదార్థాలు
  • ఫుడ్అలెర్జీ ఉంటే- పుట్టగొడుగులు, వంకాయ, వేరుశెనగలు, సీఫుడ్ , లాక్టోస్ పదార్థాలతో నొప్పి పెరుగుతుంది.

ఏయే ఆహార పదార్థాలు తీసుకోవాలి?

పీరియడ్స్ నొప్పి నివారించే డైట్‌లో భాగంగా ఉప్పు, కారం తక్కువ కలిగిన చిక్కుడు లాంటి కూరలు తీసుకోవాలి. దీంతోపాటు అన్నంలో పెరుగు తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలి. రుచికోసం వేయించిన అప్పడం తీసుకుంటే మంచిది. పెరుగులో కాల్షియం ఉంటుంది, బియ్యంలో మెగ్నీషియం, థయమిన్ పుష్కలంగా ఉంటాయి. ఈ కలయిక పీరియడ్ నొప్పిని ఎదుర్కోవడానికి మీకు తగినంత శక్తిని అందిస్తుంది.

అలాగే వేరుశెనగలు- బెల్లం లేదా జీడిపప్పు తీసుకుంటే ఆహార కోరికలు తగ్గుతాయి, మూడ్ స్వింగ్‌లను అరికట్టవచ్చు, తర్వాత రక్తం స్థాయిని పెరిగేందుకు కూడా దోహదపడతాయి.

రాత్రి భోజనంలో కిచిడీ తీసుకోవడం ద్వారా ఋతుస్రావం నొప్పి, వికారం, తిమ్మిరి, మానసిక కల్లోలం తదితర PMS లక్షణాల నుంచి బయటపడవచ్చు. అలాగే రాజ్ గిరా, కుట్టూ లాంటి తృణధాన్యాలు తీసుకోవడం ద్వారా అండాశయ ఆరోగ్యం, పునరుత్పత్తి వ్యవస్థను మెరుగురుచుకోవచ్చు.

ఇంకా.. పండ్లు, ఆకు కూరలు

మెగ్నీషియం అధికంగా ఉండే అల్లం నొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది. అల్లం టీ తిమ్మిరిని తగ్గిస్తుంది

పసుపు, డార్క్ చాక్లెట్, గింజలు, పీనట్ బటర్ లాంటివి మంటను తగ్గించడంతో పాటు జీవక్రియను మెరుగుపరుస్తాయి.

గోధుమతో చేసిన క్వినోవా లాంటి ఆహార పదార్థాలు, కాయధాన్యాలు, బీన్స్, నెయ్యి, యోగర్ట్ లాంటి ప్రో-బయోటిక్ పదార్థాలు తీసుకోవచ్చు. 

పిప్పరమెంట్ చప్పరించడం ద్వారా కూడా కొంత హాయి కలుగుతుంది.

వీటితో పాటు పుష్కలంగా నీరు తాగడం, ధ్యానం, యోగా తదితర వ్యాయామాలు చేస్తే ఉపశమనంగా ఉంటుంది.

నెలసరి కారణంగా శరీరంలో నుంచి చాలా రక్తం బయటకు వెళ్లిపోయి నిస్సత్తువగా మార్చడమే కాకుండా కొన్నిసార్లు రక్తహీనతకు దారితీసి మరిన్ని కొత్త సమస్యలను సృష్టిస్తుంది. కాబట్టి రక్తం స్థాయిలను పెంచేలా ఐరన్ లాంటి మినరల్స్ కలిగిన ఆహార పదార్థాలు తీసుకోవాలి.

 

టాపిక్

తదుపరి వ్యాసం