Car Purchase | రూ. 5 లక్షల్లో లభించే బెస్ట్ మోడెల్స్ ఇవే!
28 February 2022, 17:48 IST
- ఒకప్పుడు కారు ఉండటాన్ని లగ్జరీగా భావించేవారు.. ఇప్పుడు కారు అనేది విలాసం నుంచి ఒక అవసరంగా మారింది. ఇండియాలో ఎక్కువ మంది అందుబాటు ధరల్లో లభించే 'ఎంట్రీ లెవెల్' కార్ల కొనుగోలుకే ఆసక్తి చూపుతున్నట్లు మార్కెట్ గణాంకాలు చెబుతున్నాయి.
Maruti Celerio
మనిషి జీవన ప్రమాణాలు మారుతున్నాయి. ఒకప్పుడు కారు ఉండటాన్ని లగ్జరీగా భావించేవారు.. ఇప్పుడు కారు అనేది విలాసం నుంచి ఒక అవసరంగా మారింది. ఇండియాలో ఎక్కువ మంది అందుబాటు ధరల్లో లభించే 'ఎంట్రీ లెవెల్' కార్ల కొనుగోలుకే ఆసక్తి చూపుతున్నట్లు మార్కెట్ గణాంకాలు చెబుతున్నాయి. బడ్జెట్ ధరల్లో కారు లభిస్తుండటం, చెల్లించాల్సిన వాయిదాలు కూడా సులభంగా ఉండటంతో సామాన్య, మధ్య తరగతి వారు కూడా వీలైతే ఒక కారు కొనుగోలు చేయాలని ఆసక్తి కనబరుస్తున్నారు.
ఇండియన్ మార్కెట్లో పెరుగుతున్న డిమాండును దృష్టిలో ఉంచుకొని మారుతి సుజుకి, టాటా మోటార్స్, డాట్సన్, రెనో లాంటి కంపెనీలు బడ్జెట్ కార్ల ఉత్పత్తి చేస్తున్నాయి. ముఖ్యంగా రూ. 5 లక్షల బడ్జెట్ ధరలోనే కార్లను మార్కెట్లో విడుదల చేస్తున్నాయి. మరి రూ. 5 లక్షల లోపు లభించే బెస్ట్ కార్ల మోడల్స్ ఏంటో ఒక లుక్ వేయండి.
బడ్జెట్ ధరలో లభించే కార్లు, వాటి వివరాలు:
మారుతి ఆల్టో (Maruti Alto):
ఆటోమొబైల్ మార్కెట్లో మారుతి సుజుకికి మంచి డిమాండ్ ఉంటుంది. ఈ బ్రాండ్ నుంచి ఎంట్రీ లెవల్ కార్లలో అత్యధికంగా అమ్ముడవుతున్న కార్లలో మారుతి ఆల్టో ఒకటి. ఈ కార్ ధరలు ఎక్స్ షోరూం వద్ద రూ. 2.94 లక్షల నుంచి ప్రారంభమవుతున్నాయి. ఈ కారు 0.8-లీటర్ పెట్రోల్ ఇంజిన్ కెపాసిటీ కలిగి ఉండి ఇది 47 హెచ్‌పి పవర్, 69 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. మైలేజ్ విషయానికి వస్తే ఆల్టో లీటరుకు 22.05 కిలోమీటర్లు లభిస్తుండగా.. ఇందులోని సీఎన్జీ వేరియంట్ కిలోకు 31.59 కిమీ మైలేజ్ ఇస్తుందని చెబుతున్నారు.
డాట్సన్ రెడి గో( Datsun India redi-GO)
Datsun India redi-GOకు మార్కెట్‌లో మంచి డిమాంగ్ ఉంది. ఇందులో ఎంట్రీ లెవెల్ కారు ధర (ఎక్స్-షోరూమ్) రూ. 3.98 లక్షలు ఉండగా టాప్-ఎండ్ మోడల్‌కి రూ. 4.96 లక్షల వరకు ఉంది. ఈ కారుకు 1.0-లీటర్ పెట్రోల్ ఇంజన్‌ను ఇచ్చారు. ఇది 67 బిహెచ్‌పితో పాటు 91 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 5-స్పీడ్ గల మాన్యువల్ గేర్‌బాక్స్‌ను అమర్చారు.
రెనాల్ట్ క్విడ్ (Renault KWID):
రెనో నుంచి క్విడ్ కారు ఇండియాలో చాలా పాపులర్ మోడెల్‌గా నిలిచింది. ఈ కారులో వేరియంట్లను బట్టి ఎక్స్-షోరూమ్ ధరలు రూ. 2.94 లక్షలతో ప్రారంభమై రూ. 4.16 లక్షల వరకు ఉన్నాయి. రెండు ఇంజన్ల ఆప్షన్‌తో ఉన్న ఈ కారులో 68 పిఎస్ పవర్ కలిగిన 1.0-లీటర్ పెట్రోల్ ఇంజన్ ఉంటుంది. 1.0-లీటర్ ఇంజిన్ మైలేజ్ లీటరుకు 21.74 కిమీ
మారుతి సుజుకి సెలెరియో (Maruti Suzuki Celerio)
మారుతి సుజుకి ఇండియా నూతన అవిష్కరణ సెలెరియో. 2021 సంవత్సరంలో ఈ మోడల్‌ను మారుతి లాంచ్ చేసింది. రూ. 4.99 లక్షల ప్రారంభ (ఎక్స్-షోరూమ్) ధరతో ఈ కారును విడుదల చేసింది. ఇందులో టాప్-ఎండ్ మోడల్ ధర రూ. 6.94 లక్షల వరకు ఉంటుంది. సెలెరియోలో అధునాతన 1.0-లీటర్ కె-సిరీస్ పెట్రోల్ ఇంజన్ అమర్చారు. ఇది లీటర్‌కు 26.68 కిమీ మైలేజీని అందిస్తుందని కంపెనీ పేర్కొంది. ఈ సరికొత్త ఇంజన్ మునుపటి మోడల్ కంటే 23 శాతం ఎక్కువ ఇంధనాన్ని ఆదా చేస్తుందని పేర్కొంది. ఇండియన్ మార్కెట్‌లో అత్యధికంగా పెట్రోల్ ఆదా చేసే కారుగా కూడా మారుతి సుజుకి సెలెరియో కారు వినియోగదారుల ఆదరణ పొందింది.
టాటా పంచ్ (Tata Punch)
టాటా మోటార్స్ ఇటీవలే మార్కెట్‌లోకి పంచ్ మైక్రో SUVని విడుదల చేసింది. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ. 5.49 లక్షలు. ఈ కారు 1.2-లీటర్ రెవెట్రాన్ పెట్రోల్ ఇంజన్‌తో పనిచేస్తుంది. ఇది 84 bhp పవర్‌తో పాటు 113 Nm గరిష్ట టార్క్‌ను కలిగి ఉంది. లీటర్ పెట్రోల్‌తో దాదాపు 19 కి.మీ మైలేజీని ఇస్తుంది.
టాపిక్